
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమ త్వరలో శుభవార్త విననుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. జవదేకర్ శుక్రవారం ఓ మీడియాతో మాట్లాడారు. జవదేకర్ మాట్లాడుతూ ఆటో పాలసీల విధానాన్ని సమీక్షించనున్నామని, షేర్‌హోల్డర్లు ఆటో పరిశ్రమ నిపుణుల సూచనలను అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఆటోమొబైల్ పరిశ్రమలో జీఎస్‌టీ(వస్తు సేవల పన్ను) ద్విచక్రవాహనాలు(బైక్) తదితర ప్రజా రవాణా వాహనాలకు జీఎస్‌టీ పన్నుల విధానంలో సానుకూల నిర్ణయాలు ఉంటాయని కేంద్ర వర్గాలు తెలిపాయి.
అయితే తుది నిర్ణయం ఆర్థిక శాఖ అధ్యయనం చేసిన తర్వాతే ఉంటుందని అన్నారు. ప్రస్తుతం జీఎస్‌టీ వాహనాలకు 28శాతం జీఎస్‌టీ పన్నులు విదిస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా ఉదృతి నేపథ్యంలో అన్ని రంగాలను ఆదుకోవాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తున్నట్లు జవదేకర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment