కొత్త టెక్నాలజీతో జియో వెహికల్‌ ట్రాకింగ్‌ | JIO Drives Future Of Connected Vehicles In Auto EXPO 2020 | Sakshi
Sakshi News home page

కొత్త టెక్నాలజీతో జియో వెహికల్‌ ట్రాకింగ్‌

Published Wed, Feb 5 2020 6:52 PM | Last Updated on Thu, Feb 6 2020 7:53 PM

JIO Drives Future Of Connected Vehicles In Auto EXPO 2020 - Sakshi

ఢిల్లీ : ఆటోమోటివ్ ఇండస్ట్రీ టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న వేళ రిలయన్స్‌ జియో మరో అడుగు ముందుకేసింది. ఆటోమోటివ్‌ రంగంలో సూపర్‌ మెకానిక్స్‌ ద్వారా మాత‍్రమే కాకుండా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌(ఏఐ), టెలిమాటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా కూడా నడుస్తుంది. ఢిల్లీలో జరగనున్నఆటో ఎక్స్‌పో2020లో భాగంగా రిలయన్స్‌ జియో తన జియో నెట్‌వర్క్‌ను వాహనాలకు కనెక్టివిటీ చేసింది. జియో ప్రవేశపెట్టిన కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఆటోమొబైల్ రంగం సహా పరిశ్రమలలో డిజిటల్ స్వీకరణకు,కస్టమర్ అనుభవాలను వివరించడానికి జియో కృషి చేయనుంది.ఆటో ఎక్స్‌పో 2020లో వెహికల్‌ కనెక్టివిటీతో ఆటోమోటివ్‌ కనెక్టివిటీ సొల్యూషన్స్‌, సర్టిఫైడ్ డివైజెస్ & హార్డ్‌వేర్ , ఇంటిగ్రేటెడ్ క్లౌడ్ & సర్వీసెస్ ప్లాట్‌ఫామ్‌, ఇండియా వైడ్ సర్వీసెస్ & సపోర్ట్ నెట్‌వర్క్ సేవలను జియో అందించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement