13 లక్షలకు మారుతీ స్విఫ్ట్ కార్ల అమ్మకాలు | Maruti Suzuki Swift turns 10, clocks over 1.3 mn in sales | Sakshi
Sakshi News home page

13 లక్షలకు మారుతీ స్విఫ్ట్ కార్ల అమ్మకాలు

Published Sat, May 9 2015 2:26 AM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM

13 లక్షలకు మారుతీ స్విఫ్ట్ కార్ల అమ్మకాలు

13 లక్షలకు మారుతీ స్విఫ్ట్ కార్ల అమ్మకాలు

న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి 10 ఏళ్లలో 13 లక్షల ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ కార్లను విక్రయించింది. ‘భారత్‌లో ఆటోమొబైల్ పరిశ్రమ గతిని మారుస్తూ 13 లక్షల కార్లను విక్రయించాం’ అని మారుతీ సుజుకి మార్కెటింగ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్.ఎస్.కల్సి అన్నారు. 2005 నుంచి ప్రారంభమైన మారుతీ స్విఫ్ట్ మోడల్‌లో 2007, 2014లలో చిన్న మార్పులను చేయగా, 2011లో మొత్తం మోడల్‌నే మార్చేశారు. స్విఫ్ట్ కార్ల అమ్మకాలు 2007లో లక్ష యూనిట్లకు, 2008లో రెండు లక్షల యూనిట్లకు చేరాయి. అలాగే 2010 జనవరిలో స్విఫ్ట్ అమ్మకాలు 5 లక్షల మార్క్‌ను, 2013 సెప్టెంబర్‌లో 10 లక్షల మార్క్‌ను అధిగమించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement