Hatchback Swift car
-
మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ కారులో 4వ జనరేషన్ మోడల్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.64 లక్షల వరకు (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటుంది. ఈ కారును అభివృద్ధి చేయడంపై రూ. 1,450 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు సంస్థ ఎండీ హిసాషి తకెయుచి తెలిపారు. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ అమ్మకాల్లో ప్రీమియం విభాగం వాటా 60 శాతంగా ఉంటోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏటా 7 లక్షల యూనిట్లుగా ఉన్న ఈ సెగ్మెంట్ 2030 నాటికి పది లక్షల యూనిట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. -
13 లక్షలకు మారుతీ స్విఫ్ట్ కార్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి 10 ఏళ్లలో 13 లక్షల ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ కార్లను విక్రయించింది. ‘భారత్‌లో ఆటోమొబైల్ పరిశ్రమ గతిని మారుస్తూ 13 లక్షల కార్లను విక్రయించాం’ అని మారుతీ సుజుకి మార్కెటింగ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్.ఎస్.కల్సి అన్నారు. 2005 నుంచి ప్రారంభమైన మారుతీ స్విఫ్ట్ మోడల్లో 2007, 2014లలో చిన్న మార్పులను చేయగా, 2011లో మొత్తం మోడల్‌నే మార్చేశారు. స్విఫ్ట్ కార్ల అమ్మకాలు 2007లో లక్ష యూనిట్లకు, 2008లో రెండు లక్షల యూనిట్లకు చేరాయి. అలాగే 2010 జనవరిలో స్విఫ్ట్ అమ్మకాలు 5 లక్షల మార్క్‌ను, 2013 సెప్టెంబర్‌లో 10 లక్షల మార్క్‌ను అధిగమించాయి.