![Auto Sales Skid in May as COVID Second Wave Bites - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/2/automobile%20sales%20may%202021.jpg.webp?itok=r4sF--CH)
ముంబై: రెండో దశ కోవిడ్ ప్రభావం దేశీయ వాహన విక్రయాలపై తీవ్ర ప్రతికూలతను చూపింది. వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన లాక్‌డౌన్‌లతో ఉత్పత్తి, పంపిణీలకు అంతరాయం కలిగింది. వ్యాధి వ్యాప్తి కట్టడికి ఆటో కంపెనీలు కొన్నిరోజుల పాటు తమ యూనిట్లను తాత్కాలికంగా మూసివేశాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ మే నెలలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టయోటాతో సహా అన్ని కంపెనీల అమ్మకాలు క్షీణత నమోదు చేశాయి. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మే నెలలో 35,293 యూనిట్లు మాత్రమే అమ్మింది.
ఈ ఏప్రిల్ నెలలో అమ్మిన 1.42 లక్షల యూనిట్లతో పోలిస్తే విక్రయాలు 75 శాతం క్షీణించాయి. మే 1 నుంచి 16 వరకు కంపెనీ ప్లాంట్లను ఆక్సిజన్ తయారీకి వినియోగించడంతో ఉత్పత్తి నిలిచిపోయినట్లు కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ మోటార్స్ మే నెలలో 25,001 యూనిట్లను విక్రయించింది. ఏప్రిల్ నెలలో అమ్మిన 49,002 యూనిట్లతో పోలిస్తే 49 శాతం తక్కువ. ఇదే మే నెలలో టాటా మోటార్స్ వాహన అమ్మకాలు 40 క్షీణించాయి. ఏప్రిల్‌లో 25,091 యూనిట్లను విక్రయించిన ఈ కంపెనీ మే నెలలో 15,181 వాహనాలను మాత్రమే విక్రయించింది. కియా మోటార్స్ ఏప్రిల్‌లో 16,111 యూనిట్లు విక్రయించింది. మేనెలలో 11,050 యూనిట్లకు పరిమితమైన అమ్మకాల్లో 31 శాతం క్షీణతను నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment