Tata Motor
-
మే నెలలో భారీగా తగ్గిన వాహన విక్రయాలు
ముంబై: రెండో దశ కోవిడ్ ప్రభావం దేశీయ వాహన విక్రయాలపై తీవ్ర ప్రతికూలతను చూపింది. వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన లాక్డౌన్లతో ఉత్పత్తి, పంపిణీలకు అంతరాయం కలిగింది. వ్యాధి వ్యాప్తి కట్టడికి ఆటో కంపెనీలు కొన్నిరోజుల పాటు తమ యూనిట్లను తాత్కాలికంగా మూసివేశాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ మే నెలలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టయోటాతో సహా అన్ని కంపెనీల అమ్మకాలు క్షీణత నమోదు చేశాయి. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మే నెలలో 35,293 యూనిట్లు మాత్రమే అమ్మింది. ఈ ఏప్రిల్ నెలలో అమ్మిన 1.42 లక్షల యూనిట్లతో పోలిస్తే విక్రయాలు 75 శాతం క్షీణించాయి. మే 1 నుంచి 16 వరకు కంపెనీ ప్లాంట్లను ఆక్సిజన్ తయారీకి వినియోగించడంతో ఉత్పత్తి నిలిచిపోయినట్లు కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ మోటార్స్ మే నెలలో 25,001 యూనిట్లను విక్రయించింది. ఏప్రిల్ నెలలో అమ్మిన 49,002 యూనిట్లతో పోలిస్తే 49 శాతం తక్కువ. ఇదే మే నెలలో టాటా మోటార్స్ వాహన అమ్మకాలు 40 క్షీణించాయి. ఏప్రిల్‌లో 25,091 యూనిట్లను విక్రయించిన ఈ కంపెనీ మే నెలలో 15,181 వాహనాలను మాత్రమే విక్రయించింది. కియా మోటార్స్ ఏప్రిల్‌లో 16,111 యూనిట్లు విక్రయించింది. మేనెలలో 11,050 యూనిట్లకు పరిమితమైన అమ్మకాల్లో 31 శాతం క్షీణతను నమోదు చేసింది. చదవండి: భారీగా తగ్గిన యమహా ఎఫ్‌జెడ్ 25 సిరీస్ బైక్ ధరలు -
టాటా మోటార్స్ మాజీ ఎండీ ఆత్మహత్య
ముంబై: టాటా మోటార్స్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఆత్మహత్య కలకలం రేపింది. ప్రశాంత్ సిబ్బల్ (43) ముంబై, పరేల్‌లోని ఆయన నివాస భవనం 15 వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కలాచౌకీ పోలీసులు అధికారి దిలీప్ ఉగాలే అందించిన ప్రకారం ఈ సంఘటన తరువాత కల్పతరు హా బిటెంట్ భవన సొసైటీ సభ్యుడినుంచి కాల్ వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సిబాల్నున ఆసుపత్రికి తీసుకెళ్లారు, అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. అలాగే మృతిని బెడ్ రూమ్ లో ఆత్మహత్య నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు మొదలుపెట్టారు. ఏప్రిల్ 2017 లో సిబాల్‌ను టాటా మోటార్స్ తొలగించింది. అప్పటినుంచి ఆయన తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని పోలీసుల కథనం. ఈ నేపథ్యంలో ఆయన చికిత్స కూడా తీసుకుంటున్నారని సిబాల్ భార్య ధృవీకరించారని పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన కేసు నమోదు చేశామని తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎన్.ఆర్కికా చెప్పారు. అలాగే మరింత తెలుసుకోవడానికి టాటా మోటార్స్ ఉద్యోగులు కూడా ప్రశ్నించనున్నామని చెప్పారు. అయితే ప్రశాంత్ ఆత్మహత్యపై టాటా మోటార్స్ స్పందించింది. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపిన సంస్థ, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది. ఏప్రిల్ లో ఆయన స్వచ్ఛంద విరమణ పథకం ఎంచుకున్నారని వివరించింది. ఈ విషయంలో దర్యాప్తు అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నామని టాటా మోటార్స్ అధికార ప్రతినిధి తెలిపారు.