టాటా మోటార్స్ మాజీ ఎండీ ఆత్మహత్య
ముంబై: టాటా మోటార్స్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఆత్మహత్య కలకలం రేపింది. ప్రశాంత్ సిబ్బల్ (43) ముంబై, పరేల్‌లోని ఆయన నివాస భవనం 15 వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
కలాచౌకీ పోలీసులు అధికారి దిలీప్ ఉగాలే అందించిన ప్రకారం ఈ సంఘటన తరువాత కల‍్పతరు హా బిటెంట్ భవన సొసైటీ సభ్యుడినుంచి కాల్ వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సిబాల్‌నున ఆసుపత్రికి తీసుకెళ్లారు, అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. అలాగే మృతిని బెడ్ రూమ్ లో ఆత్మహత్య నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు మొదలుపెట్టారు.
ఏప్రిల్ 2017 లో సిబాల్‌ను టాటా మోటార్స్ తొలగించింది. అప్పటినుంచి ఆయన తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని పోలీసుల కథనం. ఈ నేపథ్యంలో ఆయన చికిత్స కూడా తీసుకుంటున్నారని సిబాల్ భార్య ధృవీకరించారని పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన కేసు నమోదు చేశామని తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎన్.ఆర్కికా చెప్పారు. అలాగే మరింత తెలుసుకోవడానికి టాటా మోటార్స్ ఉద్యోగులు కూడా ప్రశ్నించనున్నామని చెప్పారు.
అయితే ప్రశాంత్ ఆత్మహత్యపై టాటా మోటార్స్ స్పందించింది. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపిన సంస్థ, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది. ఏప్రిల్ లో ఆయన స్వచ్ఛంద విరమణ పథకం ఎంచుకున్నారని వివరించింది. ఈ విషయంలో దర్యాప్తు అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నామని టాటా మోటార్స్ అధికార ప్రతినిధి తెలిపారు.