Mahindra and Mahindra Registered 65,000 Bookings for XUV700 in Just 14 Days - Sakshi
Sakshi News home page

Mahindra XUV700: అదిగో మహీంద్రా..! ప్రీ బుకింగ్స్‌లో దుమ్మురేపుతోంది..!

Published Wed, Oct 20 2021 7:34 PM | Last Updated on Wed, Oct 20 2021 8:12 PM

 Mahindra and Mahindra registered 65,000 bookings for XUV700 in just 14 days - Sakshi

ఎస్‌యూవీ మార్కెట్‌లో ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇస్తూ విడుదలైన ఎక్స్‌యూవీ700 ప్రీబుకింగ్స్‌లో దుమ్మురేపుతోంది. ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించిన 14రోజుల్లో 65,000 వెహికల్స్‌ బుకింగ్స్‌ జరిగినట్లు దేశీ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా  సంస్థ తెలిపింది.

రోజుకు 25వేల వెహికల్స్‌ బుకింగ్‌ 

అక్టోబర్‌ 7నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ప్రీ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. ప్రీ బుకింగ్స్‌లో 14 రోజుల స్వల్ప వ్యవధిలో 65,000 వెహికల్స్‌ అమ్మకాలు జరిగాయి. బుకింగ్స్‌ ప్రారంభమైన తొలిరోజు అక్టోబర్‌ 7, అక్టోబర్‌ 8 ఈ రెండు రోజుల్లో ఒక్కో రోజు సుమారు 25వేల వెహికల్స్‌ పై బుకింగ్‌ జరిగినట్లు మహీంద్రా ప్రతినిధులు తెలిపారు. ఈ రెండు రోజుల పాటు జరిగిన 50వేల వెహికల్స్‌ బుకింగ్‌ కేవలం 3 గంటల్లోనే జరిగాయని  సంతోషం వ్యక్తం చేశారు.  

 
ఇక వెహికల్స్‌ డెలివరీ విషయానికి వస్తే గతవారం ఎక్సయూవీ 700 డీజిల్‌ వేరియంట్‌ వెహికల్స్‌ డెలివరీ ప్రారంభం కాగా,పెట్రోల్‌ ఎక్స్‌యూవీ700 వేరియంట్స్‌ డెలివరీ వెహికల్స్‌ అక్టోబర్‌ 30 నుంచి ప్రారంభం కానున్నాయి.  


ఎక్స్‌యూవీ సరికొత్త రికార్డులు 
ఇటీవల చెన్నైలో ప్రూవింగ్ ట్రాక్ (ఎమ్‌ఎస్‌పీటీ) లో మహీంద్రా ఎక్స్‌యూవీ700 సరికొత్త రికార్డ్‌లని క్రియేట్‌ నమోదు చేసింది. ప్రూవింగ్ ట్రాక్‌లో జరిగిన 24 గంటల స్పీడ్ ఎండ్యూరెన్స్ ఛాలెంజ్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ  ఒక్కొక్కటి సుమారు 4000 కి.మీ. మొత్తంగా 17000 కిలోమీటర్ల మేర ప్రయాణించాయి. గతంలో ఈ రికార్డు 3161 కిలోమీటర్లతో ఉండేది.

చదవండి: Mahindra XUV 700: మేఘాలలో తేలిపొమ్మన్నది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement