Anand Mahindra Get Dean Medal In The Fletcher School Of Law And Diplomacy - Sakshi
Sakshi News home page

ఆనంద్‌ మహీంద్రా s/o హరీష్‌..ఆయన విలువలే ఆస్తి!

Published Tue, May 24 2022 7:09 PM | Last Updated on Wed, May 25 2022 1:47 PM

Anand Mahindra Get Dean Medal In The Fletcher School Of Law And Diplomacy - Sakshi

ఆనంద్‌ మహీంద్రా.  సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ సమకాలిన అంశాలపై రెస్పాండ్‌ అవుతుంటారు. సందర్భానుసారం స్పందించే ఆనంద్‌ మహీంద్రా.. కొన్నిసార్లు తన వ్యక్తిగత విషయాల్ని నెటిజన్లతో పంచుకుంటుంటారు. 

ఇటీవల తన భార్య కోసం ఎస్‌యూవీ 700బుక్‌ చేసిన కారు కోసం ఎదురు చూస్తున్నానని సరదాగా సమాధానం ఇచ్చిన ఆనంద్‌ మహీంద్రా..ఈసారి స్పూర్తిగొలిపేలా తన తండ్రి గురించి ట్వీట్‌ చేశారు.

ఆనంద్‌ మహీంద్రా తండ్రి హరీష్‌ 75ఏళ్ల క్రితం అమెరికాలో బోస్టన్‌కు చెందిన ఫ్లెచర్ స్కూల్‌ ఆఫ్‌ లా'లో గ్రాడ్యూయేషన్‌ పూర్తి చేసుకున్న తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ఫ్లెచర్ స్కూల్‌ యాజమాన్యం నిర్వహించిన క్లాస్‌ డే వేడకులకు ఆయన  కుమారుడు ఆనంద్‌ మహీంద్రాను స్కూల్‌ గెస్ట్‌గా ఆహ్వానించింది. 

ఆ స్కూల్‌ డీన్‌ తండ్రికి బదులు ఆనంద్‌ మహీంద్రాను మెడల్‌తో సత్కరించింది. ఈ సత్కారంపై తన తండ్రి చదివిన స్కూల్‌ మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు.

చదవండి👉నా భార్య కోసం ఆర్డర్‌ చేశా.. Qలో ఉన్నా: ఆనంద్‌ మహీంద్రా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement