న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ల రంగంలో అంతర్జాతీయంగా నాయకత్వ స్థానాన్ని లక్ష్యంగా చేసుకుంది. పరిమాణం పరంగా సంప్రదాయ ద్విచక్ర వాహన మార్కెట్లో హీరో ఇప్పటికే అంతర్జాతీయంగా అగ్ర స్థానంలో ఉంది.
పండుగల సీజన్ నాటికి భారత ఈవీ విపణిలో కంపెనీ రంగ ప్రవేశం చేయనుంది. విదా బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను సంస్థ ప్రవేశపెట్టనుంది. ఈవీ కంపెనీ ఏథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్ పెట్టుబడులు చేసింది. కాగా, 2021–22లో సంస్థ రూ.29,802 కోట్ల టర్నోవర్ సాధించింది. 1984 నుంచి 2011 మధ్య 10 కోట్ల యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించి భారీ మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే.
2030 నాటికి మరో 10 కోట్లు..
‘ఈ ఏడాది హీరో మోటోకార్ప్ పర్యావరణ అనుకూల వాహన విభాగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా తన నాయకత్వాన్ని ఎలక్ట్రిక్ వెహికల్ రంగానిదిగా మారుస్తుంది. తదుపరి దశాబ్దానికై సిద్ధంగా ఉన్నాం’.2030 నాటికి మరో 10 కోట్లు వాహనాల్ని అమ్మేదిగా ప్రణాళికల్ని సిద్ధం చేసినట్లు వాటాదార్లకు ఇచ్చిన సందేశంలో సంస్థ చైర్మన్, సీఈవో పవన్ ముంజాల్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment