
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ జిప్ ఎలక్ట్రిక్ వచ్చే ఏడాది చివరినాటికి ఒక లక్ష ఎలక్ట్రిక్ స్కూటర్లను జొమాటో సహకారంతో ప్రవేశపెట్టనుంది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో జొమాటోకు కావాల్సిన డెలివరీ భాగస్వాములను సైతం జిప్ అందించనుంది.
ఇప్పటికే డెలివరీ సేవల్లో 13,000 పైచిలుకు ఎలక్ట్రిక్ స్కూటర్లు నిమగ్నమయ్యాయని జిప్ వెల్లడించింది. 2030 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్‌కు మారాలన్న జొమాటో దీర్ఘకాలిక ప్రణాళికలో ఈ భాగస్వామ్యం ఒక భాగమని తెలిపింది. 50కి పైచిలుకు అగ్రిగేటర్స్, ఈ–కామర్స్ క్లయింట్లకు జిప్ ఎలక్ట్రిక్ సేవలు అందిస్తోంది.