సీఈవో ఎలాన్ మస్క్ టెస్లా కార్ల ధరల్ని భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. ట్విటర్ కొనుగోలు అనంతరం మస్క్ పూర్తిగా ఆ సంస్థకే అంకితమవ‍్వడం, మార్కెట్‌లో టెస్లాకు పోటీగా కొత్త కంపెనీలు పుట్టుకొని రావడం,టెస్లా షేర్ హోల్డర్లు అపనమ్మకం వంటి ఇతర కారణాల వల్ల టెస్లా కార్ల అమ్మకాలు భారీగా తగ్గాయి.
ఈ తరుణంలో తిరిగి కార్ల అమ్మకాలు పుంజుకునేలా టెస్లా ధరల్ని భారీగా తగ్గించారు ఎలాన్ మస్క్. ఇందులో భాగంగా అమెరికాలో మోడల్ 3 సెడాన్, మోడల్ వై ఎస్‌యూవీ కార్ల ధరలు తగ్గాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. డిస్కౌంట్ ముందు కార్ల ధరలతో పోలిస్తే.. డిస్కౌంట్ తర్వాత కార్ల ధరలు 6 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గినట్లు తెలిపింది.
జర్మనీలో సైతం టెస్లా మోడల్ 3, మోడల్ వై ధరలను దాదాపు 1శాతం నుంచి 17శాతం వరకు తగ్గించింది. ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో సైతం ధరల్ని అదుపులోకి వచ్చాయి. ఈ నెలలో అమలులోకి వచ్చిన యూఎస్ ప్రభుత్వం ఈవీ కార్లపై అందించే సబ్సిడీతో కలిపి కొత్త టెస్లా ధర 31శాతంగా ఉంటుంది. అయితే టెస్లా సంస్థ కార్ల ధరల తగ‍్గింపు జోబైడెన్ అడ్మినిస్ట్రేషన్ టాక్స్ క్రెడిట్‌కు అర్హత కోసమే ఈ నిర్ణయమంటూ పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment