ముంబై: ఆటోమొబైల్ రంగానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. కరోనా నేపథ్యంలో ఆటోమొబైల్ రంగం వృద్ధి చెందేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆటోమొబైల్ రంగం పుంజుకునేందుకు అక్టోబర్ చివర నాటికి వాహన పాలసీ రూపొందనుందని గడ్కరీ పేర్కొన్నారు. వాహన పాలసీ రూపకల్పనలో చివరి దశలో ఉన్నట్లు తెలిపారు. ఈ పాలసీ ద్వారా ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. వాహన పాలసీపై కేంద్ర ప్రభుత్వ ముఖ్య విభాగాలు అధ్యయనం చేయనున్నాయని తెలిపారు. కాగా వాహన పాలసీలో వినియోగదారులకు లాభం జరగనుందని, పాత వాహనాలను మార్చుకునే కస్టమర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అయితే పాత వాహనాల కోనుగోలు వల్ల వాటిని రీసైక్లింగ్ చేయడానికి ఉపయోగపడనుందని ముడి విభాగాల దిగుమతి తగ్గి ఖర్చు తగ్గుతుందని అన్నారు. మరోవైపు స్వదేశీ పరికరాలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం విదేశీ దిగుమతులకు అధిక పన్నులు విధించనున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. అయితే ఎగుమతులను ప్రోత్సహించడానికి కేంద్రం ఇప్పటికే పలు కీలక చర్యలు తీసుకున్నదని, అలాగే ఎంఎస్‌ఎంఈలపై కేంద్రం నుంచే అన్ని ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలని నితిన్ గడ్కరీ సూచించారు. (చదవండి: ఆర్టీసీ లిక్విడేషన్‌కు కేంద్రం అనుమతి అవసరం)
Comments
Please login to add a commentAdd a comment