Hyderabad Man Buys India's Most Expensive Supercar- Mclaren 765 LT Spider, Check Here Price - Sakshi
Sakshi News home page

భారత్‌లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్‌ వాసి.. వామ్మో అన్ని కోట్లా!

Published Wed, Dec 14 2022 12:55 PM | Last Updated on Wed, Dec 14 2022 3:37 PM

Indias Most Expensive Supercar Mclaren 765lt Spider Delivery To Hyderabad Business Man - Sakshi

భారత ఆటోమొబైల్‌ రంగం వృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ముఖ్యంగా కరోనా మహ్మమారి తర్వాత కాలం నుంచి కార్ల కొనుగోలుపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఖరీదైన కార్ల కొనుగోళ్లు సైతం పెరుగుతున్నాయి. ఈ క్రమంలో లంబోర్ఘిని, ఫెరారీ వంటి లగ్జరీ కార్లు మన దేశీయ మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మెక్‌లారెన్ ప్రవేశించింది. ముంబైలో ఇటీవలే తన మొదటి డీలర్ షిప్‌ను ప్రారంభించిన ఈ కంపెనీ ఆ వేడుకల్లో తన సూపర్ కార్ మెక్ లారెన్ 765 LTని ( MCLAREN 765LT SPIDER) లాంచ్ చేసింది.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న కాస్ట్లీ కార్లలో మెక్‌లారెన్‌ ఒకటి. ఇప్పటికే ఈ కంపెనీ భారత్‌లో మొదటి కస్టమర్‌కు ఈ కారును డెలివరీ చేసింది. అత్యంత ఖరీదైన ఈ కారును ఇటీవల హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త నసీర్ ఖాన్ కొనుగోలు చేశారు. ఈ కారు ఖచ్చితమైన ధర తెలియనప్పటికీ.. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.12 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 

ఈ కారు 4.0 లీటర్ ట్విన్-టర్బోచార్జుడ్ V8 పెట్రోల్ ఇంజిన్‌తో తయారుచేయబడింది. ఇందులో అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే, ఈ కన్వర్టిబుల్ కారు పైకప్పు కేవలం 11 సెకన్లలో తెరుచుకుంటుంది. 

మెక్‌లారెన్ ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత వేగవంతమైన కన్వర్టిబుల్‌లలో అద్భుతమైన కార్లలో ఇదీ ఒకటి. ఈ కారుని సొంతం చేసుకున్న నసీర్ ఖాన్ విషయానికి వస్తే ఇప్పటికే ఆయన ఎన్నో ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు ఇప్పటికే ఈయన వద్ద ఫెరారీ, లంబోర్ఘిని, రోల్స్ రాయిస్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.

చదవండి: ఉద్యోగుల ఆశలన్నీ ఆవిరి:  కేంద్రం షాకింగ్‌ న్యూస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement