
వాటర్‌బైక్‌లు చాలాకాలంగా వాడుకలో ఉన్నవే! ఇప్పటి వరకు వాడుకలో ఉన్న వాటర్‌బైక్‌లన్నీ పెట్రోల్ లేదా డీజిల్ ఇంధనంగా ఉపయోగించుకుని నడిచేవే! కెనడాకు చెందిన ‘ఎన్వో’ కంపెనీ తొలిసారిగా పూర్తిగా విద్యుత్తుతోనే పనిచేసే 1500 వాట్ల మోటారుతో వాటర్‌బైక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది మిగిలిన ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది.
ఒకసారి చార్జింగ్ చేసుకుంటే, గంటసేపు నిరాటంకంగా జలవిహారం చేయవచ్చు. నీటిలో ఇది గంటకు ఇరవై కిలోమీటర్ల గరిష్ఠవేగంతో ప్రయాణించగలదు. దీనికో ఓ ప్రత్యేకత ఉంది.
మిగిలిన వాటర్‌బైక్‌లతో పోల్చుకుంటే దీని బరువు తక్కువే! కేవలం 50 కిలోల బరువు గల ఈ ఎలక్ట్రిక్ వాటర్ బైక్ 120 కిలోల బరువును తీసుకుపోగలదు. సరదా జలవిహారాలకు ఇది భేషైన వాహనం.
Comments
Please login to add a commentAdd a comment