
సాక్షి, నెల్లూరు: చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ పేలిన ఘటన శుక్రవారం కందుకూరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు.. పట్టణానికి చెందిన ఆరీఫ్ అనే వ్యక్తి ‘ఎకోతేజా’ అనే కంపెనీకి చెందిన విద్యుత్ బ్యాటరీ ద్విచక్ర వాహనాన్ని కొంతకాలం క్రితం రూ.80 వేలు వెచ్చించి కొనుగోలు చేశాడు. శుక్రవారం కనిగిరి రోడ్డులోని అయ్యప్పస్వామి గుడి సమీపంలో ఓ చోట వద్ద వాహనానికి చార్జింగ్ పెట్టాడు. కొద్దిసేపటికే వాహనం బ్యాటరీ పేలి మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే నీళ్లు చల్లి మంటలు ఆర్పివేశారు. బ్యాటరీ పేలిన సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.
Comments
Please login to add a commentAdd a comment