
సాక్షి, విజయవాడ: ఎలక్ట్రిక్ బైకులు కదిలే బాంబుల్లా మారాయి. మంటల్లో చిక్కుకోవడం, చార్జింగ్‌లో ఉండగానే పేలిపోవడం కామన్‌గా మారింది. నిన్నా మొన్నటి వరకు తమిళనాడు, మహారాష్ట్రకే పరిమితమైన ఈ ప్రమాదాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు విస్తరించాయి. నిజామాబాద్ ఘటన మరిచిపోకముందే విజయవాడలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది.
విజయవాడలోని సూర్యారావుపేటకు చెందిన శివకుమార్ ఇటీవల ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశారు. రాత్రి వేళ బెడ్‌రూమ్‌లో బైక్ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టి నిద్రిస్తుండగా తెల్లవారుజామున బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయి మంటలు అలుముకున్నాయి. శివకుమార్‌తో పాటు భార్య, ఇద్దరు పిల్లలు ఈ మంటల్లో చిక్కుకున్నారు. స్థానికులు గమనించి మంటలను ఆర్పేశారు. అప్పటికే శివకుమార్ మరణించగా ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉంది.