హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) ఎలక్ట్రిక్ మోడల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. అలాగే తక్కువ ధరలో లభించే 100 సీసీ బైక్స్ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ‘ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించే ద్విచక్ర వాహనాల అభివృద్ధిలో నిమగ్నం కావాలని కృతనిశ్చయంతో ఉన్నాం. వీటికి ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీని అనుసంధానిస్తాం. ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రవేశపెట్టడంపై ప్రస్తుతం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నాం. 40 దేశాలకు భారత్ నుంచి ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేస్తున్నాం. మరిన్ని దేశాల్లో అడుగుపెడతాం. 2030 నాటికి ఏటా 10 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించాలన్నది లక్ష్యం. అంటే మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 30 శాతం ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధితో 40 లక్షల యూనిట్లు విక్రయించే అవకాశం ఉందని హోండా తెలిపింది.
చదవండి: పెట్రోల్ ధరలకు విరుగుడు.. ఫ్లెక్స్ ఇంజన్‌తో వస్తోన్న హోండా బైక్
Comments
Please login to add a commentAdd a comment