ప్రమఖ ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ సంస్థ ఓలా వాహన కొనుగోలు దారులకు శుభవార్త చెప్పింది. జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల పాటు ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సదుపాయంతో వినియోగదారులకు ఓలా ఈవీ బైక్‌ను కొనుగోలు చేయడం మరింత సులభతరం కానుంది.
ఇటీవల కేంద్రం ఎలక్ట్రిక్ బైక్స్‌కు అందించే ఫేమ్-2 సబ్సిడీలో కోత పెట్టింది. దీంతో వాహనాల అమ్మకాలు తగ్గాయి. ఈ తరుణంలో వాహనాల సేల్స్‌ను పెంచేలా ఓలా తన ప్రత్యర్ధి సంస్థ ఎథేర్ అందిస్తున్నట్లుగానే ఎస్10 రేంజ్ వాహనాల్ని అందించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఎల్ అండ్ టీ ఫైనాన్షియల్ సర్వీస్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.
చదవండి👉‘బండ్లు ఓడలు ..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’!
మార్కెట్‌లోని ఇతర సంస్థల కంటే తామే అతి తక్కువ వడ్డీతో డౌన్ పేమెంట్ చెల్లించే అవసరం లేకుండా 6.99 శాతంతో 60 నెలల పాటు ఈఎంఐ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఓలా ప్రతినిధులు తెలిపారు.
గతంలో, ఫైనాన్స్ కంపెనీలు ఈవీ వెహికల్స్‌పై 36 నెలలు మాత్రమే లోన్ సౌకర్యాన్ని అందించేవి. పండగలతో పాటు కొన్ని సందర్భాలలో 48 నెలలకు పొడిగించేవి. అయితే, ఓలా ఎలక్ట్రిక్ మాత్రం దేశం మొత్తం 60 నెలల పాటు లోన్ సౌకర్యాన్ని అందిస్తుండడం విశేషం.
చదవండి👉ట్రాన్సామెరికా డీల్ రద్దు.. టీసీఎస్‌కు 15 వేల కోట్ల నష్టం!
Comments
Please login to add a commentAdd a comment