ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదలై కుర్రకారుని ఉర్రూతలూగించిన అల్ట్రావయోలెట్ ఎఫ్77 డెలివరీలు ప్రారంభమయ్యాయి. కంపెనీ దేశ వ్యాప్తంగా డీలర్‌షిప్‌లను ప్రారంభించడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేసుకుంటోంది. అయితే ప్రస్తుతం మొదటి డెలివరీలు బెంగళూరులో ప్రారంభమయ్యాయి.
దేశీయ మార్కెట్లో అల్ట్రావయోలెట్ ఎఫ్77 ధరలు రూ. 3.80 లక్షల నుంచి రూ. 4.55 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఇది మొత్తం మూడు వేరియంట్స్‌లో లభిస్తుంది. కొనుగోలుదారులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 10,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
కంపెనీ తన అల్ట్రావయోలెట్ F77 ఎలక్ట్రిక్ బైకుని గ్లోబల్ మార్కెట్లో కూడా విక్రయించే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ బైక్ భారతీయ రోడ్ల మీద మాత్రమే కాకుండా యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, జపాన్, ఇతర ఆగ్నేయాసియా దేశాల రోడ్ల మీద కూడా తిరగనున్నాయి.
అల్ట్రావయోలెట్ ఎఫ్77 వేరియంట్ 7.1kWh బ్యాటరీ ప్యాక్ కలిగి, ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 207 కిలోమీటర్ల రేంజ్, రీకాన్ వేరియంట్ 10.3kWh బ్యాటరీ ప్యాక్ కలిగి 307 కిమీ రేంజ్, లిమిటెడ్ ఎడిషన్ కూడా 307 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే ఇది 77 యూనిట్లకు మాత్రమే పరిమితం.
అల్ట్రావయోలెట్ ఎఫ్77 వేరియంట్ బరువు 197 కేజీలు కాగా, రీకాన్ వేరియంట్ బరువు 187 కేజీల వరకు ఉంటుంది. ఈ రెండు వేరియంట్స్ అవుట్‌పుట్ గణాంకాలు వేరుగా ఉంటాయి. ఎఫ్77 వేరియంట్ గరిష్టంగా 36.2 బిహెచ్‌పి పవర్, 85 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. రీకాన్ వేరియంట్ 38.88 బిహెచ్‌పి పవర్, 95 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment