ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కంపెనీ ఓలాలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో ఓలా ఫ్లాంట్‌ను షట్ డౌన్ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి రాగా.. 3 వారాల్లో సుమారు 300 నుంచి 350 మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు తెలుస్తోంది.
ఓలా తొలగించిన ఉద్యోగుల్లో ప్రొడక్ట్, మార్కెటింగ్, సేల్స్, సప్లై, టెక్, బిజినెస్, ఆపరేషన్స్ సహా అన్ని ఇతర డిపార్ట్‌మెంట్‌లకు చెందిన ఉద్యోగులున్నారు. వారికి నెల రోజుల ప్యాకేజీ, నోటీస్ పిరియడ్ అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా "దీని గురించి ( ప్యాకేజీ,నోటీస్ పిరియడ్) ఎటువంటి అధికారిక ప్రకటనలేదు. గత మూడు వారాలుగా ప్రతిదీ చాలా వ్యూహాత్మకంగా జరుగుతుంది. మాకిచ్చిన ల్యాప్‌ట్యాప్‌లతో పాటు ఇతర ఉపకరణాల్ని తిరిగి ఇవ్వాలని అడుగుతున్నారు. ఒక నెల వేతనంతో తక్షణమే వెళ్లిపోవాలని లేదా నోటీసు వ్యవధిని అందించాలని అడుగుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment