ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు రాష్ట్రం హోసూర్ జిల్లా కృష్ణగిరిలో ఉన్న తయారీ ప్లాంట్‌లో ఓలా తయారీ కార్యకలాపాల్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది.
ప్రొడక్షన్ నిలిపివేతపై ఓలా ప్రతినిధుల్ని వివరణ కోరగా వెహికల్స్ తయారీ కోసం కొత్త మెషిన్‌లను ఇన్‌స్టాల్ కోసం గత వారం రోజుల నుంచి ప్రొడక్షన్ నిలిపివేసినట్లు తెలిపారు. కానీ ప్రొడక్షన్‌ను షట్ డౌన్ చేయడానికి ఇతర కారణాలున్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి.
అంచనా తలకిందులైందే?
అగ్గిపుల్ల నుంచి సబ్బుబిళ్ల వరకు తన ఇన్నోవేటీవ్ మార్కెటింగ్ స్ట్రాటజీతో అమ్మకాలు జరిపే సత్తా ఉన్న ఓలా సీఈవో భవిష్ అగర్వాల్. కానీ ఓలా అమ్మకాల్లో తన అంచనాలు తలకిందులైనట్లు తెలుస్తోంది. సమ్మర్ సీజన్‌లో ఆ సంస్థ తయారు చేసిన వెహికల్స్‌లోని బ్యాటరీలు హీటెక్కి కాలిపోవడం, నాసిరకం మెటీరియల్‌తో వెహికల్స్ తయారు చేయడం, చిన్న పాటి రోడ్డు ప్రమాదాలకే ఆ వెహికల్ టైర్లు ఊడిపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఓలా ఈవీ వెహికల్స్ కొనుగోలు చేయాలనుకున్న కొనుగోలు దారులు సైతం వెనక‍్కి తగ్గారు. దీంతో తయారీ ఉత్పత్తి పెరిగిపోయి.. కొనుగోలు డిమాండ్ తగ్గింది.
వెహికల్స్ పేరుకుపోతున్నాయ్?
తమిళనాడులో ఫ్యూచర్ ఫ్యాక్టరీ పేరుతో ఉన్న ఓలా ఫ్లాంట్‌లో సుమారు 4వేలకు పైగా ఈవీ వెహికల్స్ అమ్ముడుపోక స్టాక్ అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. జులై 22 నుంచి రోజుకు 600వెహికల్స్ తయారీ సామర్ధ్యం ఉన్న ఫ్లాంట్‌లో కేవలం రోజుకు 100 వెహికల్స్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. కానీ ఇటీవల కాలంలో ఓలా ఎస్1 ప్రోను కొనుగోలు చేసిన వాహనదారులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
అశోక్ బైద్ ఏం చెప్పారంటే
ఓలా వెహికల్స్ నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపపథ్యంలో ఓలాఎస్1ప్రో'ను కొన్న అశోక్ బైద్ అనే వాహనదారుడు స్పందించారు. నేను గతనెలలో ఓలా ఎస్1 ప్రోను కొనుగోలు చేశా. ఇప్పటి వరకు నేను ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొలేదు. సంస్థ వెహికల్స్‌ను విడుదల చేసిన ప్రారంభంలో సమస్యలు ఎదురైన మాట వాస్తవమేనంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎలాంటి కారణాలు లేవు
ఆటోమొబైల్ సంస్థలు వార్షిక నిర్వహణకు అనుగుణంగా కార్యకలాపాల్ని నిర్వహిస్తుంటాయి.మేం కూడా అదే చేస్తున్నాం. ఓలా ప్రొడక్షన్ ఎందుకు షట్ డౌన్ చేశారనే విషయంలో ఇతర కారణాలు ఏవీ లేవని ఓలా స్పోక్ పర్సన్ తెలిపారు.
చదవండి: ఓలా: వెళ్లిపోతాం..ఇక్కడే ఉంటే మునిగిపోతాం..పెట్టేబేడా సర్దుకుని!
Comments
Please login to add a commentAdd a comment