EV Maker Altigreen Launches Retail Centre in Chennai - Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌దే భవిష్యత్‌

Published Tue, Nov 29 2022 5:04 PM | Last Updated on Tue, Nov 29 2022 6:03 PM

Chennai: Ev Maker Altigreen Launches Retail Centre - Sakshi

చెన్నై: ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌దే భవిష్యత్‌ అని సుందరం ఫైనాన్స్‌ లిమిటెడ్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏఎన్‌ రాజు అన్నారు. సోమవారం ఉదయం చెన్నై అంబత్తూరులో ఏర్పాటు చేసిన ఆల్టీగ్రీన్‌ రీటైల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..పర్యావరణ హితానికి ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రధాన్యత పెరిగిందని.. ప్రభుత్వాలు సైతం వీటిపై దృష్టిపెట్టాయని తెలిపారు.

అంతకుముందు భారతదేశపు వాణిజ్య ఈవీ విభాగంలో మొట్టమొదటిగా లక్ష్మీ గ్రూప్‌ పరిశ్రమతో ప్రముఖ వాణిజ్య ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ఆల్టీగ్రీన్‌ భాగస్వామ్యం చేసుకుని ఈ సెంటర్‌ను ప్రారంభించినట్లు అల్టీగ్రీన్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ అమితాబ్‌ శరణ్‌ తెలిపారు. లక్ష్మీ గ్రూప్‌ ఎండీ కె.జయ్‌రామ్‌ పాల్గొన్నారు.

చదవండి: బంపర్‌ ఆఫర్‌..ఆ క్రెడిట్‌ కార్డ్‌ ఉంటే 68 లీటర్ల పెట్రోల్‌, డీజిల్‌ ఫ్రీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement