అతిపెద్ద ఈ కామర్స్ మార్కెట్‌గా ఆసియా: సర్వే | SoftBank turns largest investor in Indian e-Commerce | Sakshi
Sakshi News home page

అతిపెద్ద ఈ కామర్స్ మార్కెట్‌గా ఆసియా: సర్వే

Published Thu, Dec 18 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

అతిపెద్ద ఈ కామర్స్ మార్కెట్‌గా ఆసియా: సర్వే

అతిపెద్ద ఈ కామర్స్ మార్కెట్‌గా ఆసియా: సర్వే

బీజింగ్: ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ మార్కెట్‌గా ఈ ఏడాది ఆసియా అవతరిస్తుందని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) సర్వేలో వెల్లడైంది. ఇప్పటివరకూ అగ్రస్థానంలో ఉన్న ఉత్తర అమెరికాను తోసిరాజని ఆసియా ప్రాంతం మొదటి స్థానంలోకి దూసుకువస్తుందని ఈఐయూ సర్వే పేర్కొంది. ఎకనామిస్ట్ మ్యాగజైన్ గ్రూప్ అడ్వైజరీ కంపెనీగా వ్యవహరిస్తున్న ఈఐయూ  ఈ సర్వేను నిర్వహించింది. చైనా, హాంగ్‌కాంగ్, తైవాన్, మకావూ, భారత్, జపాన్, సింగపూర్, కొరియా తదితర దేశాల్లో  మొత్తం 5,500 మంది మహిళలపై ఈఐయూ ఈ సర్వేను నిర్వహించింది. వివరాలు...
- ఈ కామర్స్‌లో రిటైల్ అమ్మకాలు ఈ ఏడాది ఆసియాలో 5 శాతం వృద్ధితో 7.6 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతాయి. ఇది ఉత్తర అమెరికాలో 2.5 శాతం, యూరప్‌లో 0.8 శాతం చొప్పున వృద్ధి ఉండొచ్చు.
- ఆసియా మహిళలకు స్వేచ్ఛ, ఆర్థిక శక్తి పెరగడం, ఆన్‌లైన్ షాపింగ్‌పై మక్కువ పెరుగుతుండడం  వంటి కారణాల వల్ల అసియాలో ఈ కామర్స్ హవా పెరుగుతోంది.
- షాప్‌కు వెళ్లడం కంటే ఆన్‌లైన్‌లోనే షాపింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తామని సగానికి పైగా మహిళలు చెప్పారు.
- వస్తువులు, సేవలకోసం రోజులో ఒక్కసారైనా నెట్‌ను వాడతామని 63% మంది చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement