e-commerce market
-
ఈ కామర్స్ ఎలిఫెంట్ ఫ్లిప్‌కార్ట్
న్యూఢిల్లీ: దేశ ఈ కామర్స్ మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. 48 శాతం మార్కెట్ వాటాతో వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ మొదటి స్థానంలో ఉన్నట్టు అలియన్స్ బెర్న్‌స్టీన్ తాజా నివేదిక వెల్లడించింది. అదే సమయంలో జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు కలిగిన మీషో వేగంగా చొచ్చుకుపోతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్‌కార్ట్ 21 శాతం మేర యూజర్లను పెంచుకోగా, మీషో 32 శాతం కొత్త యూజర్లను జోడించుకుంది. అదే సమయంలో అమెజాన్ యూజర్ల వృద్ధి 13 శాతానికే పరిమితమైంది. ‘2022–23 సంవత్సరంలో భారత ఈ–కామర్స్‌లో 48 శాతం వాటాతో ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ లీడర్‌గా ఉంది. పరిశ్రమ కంటే వేగంగా ఫ్లిప్‌కార్ట్ వృద్ధి చెందుతోంది. మొబైల్స్, వ్రస్తాలు ఫ్లిప్‌కార్ట్‌కు రెండు పెద్ద విభాగాలుగా ఉన్నాయి. మొబైల్స్‌లో 50 శాతం, వ్రస్తాల్లో 30 శాతం వాటా కలిగి ఉంది. ఆన్లైన్ స్మార్ట్ఫోన్లలో 48 శాతం, ఆన్లైన్ ఫ్యాషన్ విభాగంలో 60 శాతం చొప్పున మార్కెట్ వాటా ఫ్లిప్‌కార్ట్ కలిగి ఉంటుందని అంచనా’ అని ఈ నివేదిక తెలిపింది. చిన్న పట్టణాలపై మీషో గురి జీరో కమీషన్ నమూనాలో ద్వితీయ శ్రేణి, చిన్న పట్టణాలపై మీషో వ్యూహాత్మకంగా దృష్టి సారించడం ద్వారా మార్కెట్ వాటాను వేగంగా పెంచుకుంటున్నట్టు బెర్న్‌స్టీన్ నివేదిక వెల్లడించింది. భారత్‌లో ఈ కామర్స్ యాప్ డౌన్లోడ్లలో 48 శాతం మేర మీషోనే ఉంటున్నట్టు పేర్కొంది. ‘గడిచిన 12 నెలల్లో మీషో ఆర్డర్ల పరిమాణం 43 శాతం మేర పెరిగింది. ఆదాయంలో 54 శాతం వృద్ధి నెలకొంది. మళ్లీ, మళ్లీ కొనుగోలు చేసే కస్టమర్లు 80 శాతంగా ఉన్నారు. మీషోలో 80 శాతం విక్రేతలు రిటైల్ వ్యాపారవేత్తలు కాగా, ప్లాట్‌ఫామ్‌పై 95 శాతం కొనుగోళ్లు అన్బ్రాండెడ్వే ఉంటున్నాయి. నెలవారీ 12 కోట్ల సగటు యూజర్లతో మీషో భారత్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఈ–కామర్స్ కంపెనీ. ప్రస్తుతం మీషో స్థూల వాణిజ్య విలువ (జీఎంవీ) 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ’అని ఈ నివేదిక వెల్లడించింది. ఫ్యాషన్‌లో మింత్రా టాప్... ఫ్యాషన్ ఈ–కామర్స్‌లో రిలయన్స్‌కు చెందిన అజియో 30 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నట్టు బెర్న్‌స్టీన్ నివేదిక తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సంస్థ మింత్రా ఈ విభాగంలో 50% మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో ఉంది. 2023 డిసెంబర్లో పోటీ సంస్థల కంటే మింత్రాయే మెరుగ్గా 25 శాతం మేర వృద్ధిని నమోదు చేసింది. ఈ–గ్రోసరీలో బ్లింకిట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. ఉత్పత్తుల శ్రేణి, కస్టమర్లకు చేరువ విషయంలో జెప్టో బ్లింకిట్‌తో పోలిస్తే వెనుకనే ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. బ్లింకిట్ 40 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంటే, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 37–39% వాటా, జెప్టో 20% వాటాతో తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
ఈ కామర్స్.. 3 లక్షల కోట్లకు!
న్యూఢిల్లీ: దేశంలో ఈ కామర్స్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. 2019 నాటికి 4 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్ (రూ.30వేల కోట్లు).. 2030 నాటికి 40 బిలియన్ డాలర్ల (రూ.3లక్షల కోట్లు)కు వృద్ధి చెందుతుందని కెర్నే సంస్థ అంచనా వేసింది. ‘ఈ కామర్స్: భారత రిటైల్ మార్కెట్లో తదుపరి పెద్ద అడుగు’ అంటూ ఈ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. డిజిటల్ చానల్స్ టైర్–3, 4 పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాలకు చేరువ అవుతుండడం.. ఆన్లైన్ కొనుగోళ్ల దిశగా వినియోగదారుల్లో మారుతున్న ధోరణులు ఈ కామర్స్ విస్తరణకు దోహదపడనున్నట్టు ఈ సంస్థ భావిస్తోంది. లైఫ్ స్టయిల్ రిటైల్ మార్కెట్ సైతం 2019 నాటికి ఉన్న 90 బిలియన్ డాలర్ల నుంచి 2026 నాటికి 156 బిలియన్ డాలర్లకు, 2030 నాటికి 215 బిలియన్ డాలర్లకు పెరగనున్నట్టు అంచనా వేసింది. వస్త్రాలు, పాదరక్షలు, యాక్సెసరీలు, కాస్మొటిక్స్ ఈ విభాగంలోకే వస్తాయి. ‘‘భారత్‌లో రిటైల్ రంగం కరోనా నుంచి కోలుకుంటోంది. విలువ ఆధారిత ఆన్లైన్ షాపర్లు పెరుగుతుండడం భారత ఈ కామర్స్ రూపాన్నే మార్చేయనుంది. లైఫ్‌స్టయిల్ విభాగం చాలా వేగంగా వృద్ధి చెంది 2030 నాటికి 215 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది’’ అని కెర్నే పార్ట్నర్ సిద్ధార్థ్ జైన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విభాగంలోని డిమాండ్‌లో 4 శాతాన్నే ఆన్లైన్ వేదికలు తీరుస్తుండగా. 2030 నాటికి 19 శాతానికి ఇది పెరుగుతుందని అంచనా వేసింది. ఇంటర్నెట్ యూజర్లలో వృద్ధి ‘‘భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2026 నాటికి 110 కోట్లకు చేరుకుంటుంది. ఇందులో మూడింట ఒక వంతు మంది చురుగ్గా ఆన్లైన్లో షాపింగ్ చేసే వారే ఉంటారు’’ అని కెర్నే తన నివేదికలో వివరించింది. ప్రస్తుతానికి లైఫ్‌స్టయిల్ రిటైల్ డిమాండ్‌లో 70 శాతం విలువ ఆధారిత ఉత్పత్తుల నుంచే ఉంటోందని వివరించింది. ఈ మార్కెట్లో 80 శాతం వాటా ప్రస్తుతం అసంఘటిత రంగంలోను, 4 శాతం వాటా ఈ కామర్స్ సంస్థలకు ఉండగా.. 2030 నాటికి అసంఘటిత రంగం వాటా 57 శాతానికి తగ్గుతుందని.. అదే సమయంలో ఈ కామర్స్ వాటా 19 శాతానికి విస్తరిస్తుందని అంచనాలు ప్రకటించింది. 2026 నాటికి 140 బిలియన్ డాలర్లు భారత ఈ–రిటైల్ (ఈకామర్స్/ఆన్లైన్) మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోందని.. 2026 మార్చి నాటికి 120–140 బిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని బెయిన్ అండ్ కంపెనీ సైతం అంచనాలను ప్రకటించింది. 2020–21లో రిటైల్ మార్కెట్ మొత్తం మీద 5 శాతం తగ్గినప్పటికీ.. ఈ–రిటైల్ మార్కెట్ 25 శాతం వృద్ధితో 38 బిలియన్ డాలర్లకు విస్తరించినట్టు తెలిపింది. ‘‘2021 చివరికి మొత్తం రిటైల్‌లో ఈ కామర్స్ వాటా 4.6 శాతంగా ఉంది. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఈ రిటైల్ మార్కెట్ వృద్ధికి దోహదపడింది. భద్రత, సౌకర్యానికి వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. భారత్‌లో లాక్డౌన్ల సమయంలో నిత్యావసరాలు, పరిశుభ్రత ఉత్పత్తులను ఈకామర్స్ సంస్థలు ఇళ్లకు చేరవేశాయి’’ అని ఈ సంస్థ పేర్కొంది. -
దేశీయ ఈ-కామర్స్ మార్కెట్లోకి టెక్ దిగ్గజం
టెక్ దిగ్గజం గూగుల్ కన్ను ఇప్పుడు ఈ-కామర్స్ మార్కెట్‌పై పడింది. అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌లో వాటా కొనేసి మన ఈ-కామర్స్ మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత.. టెక్ దిగ్గజం గూగుల్ సైతం ఈ-కామర్స్ మార్కెట్లోకి అరంగేట్రం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కంపెనీ తొలి స్టాప్ కూడా భారతేనట. ఈ ఏడాది దివాళి వరకు దేశీయ ఈ-కామర్స్ మార్కెట్లోకి గూగుల్ ప్రవేశించబోతుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను కొనుగోలు చేసిన అనంతరం, ఈ టెక్ దిగ్గజం కూడా చర్చలు జరిపింది. ప్రస్తుతం సొంతంగానే గ్లోబల్ ఈ-కామర్స్ మార్కెట్లోకి ప్రవేశించాలని చూస్తోంది. 2020 వరకు దేశీయ ఈ-కామర్స్ మార్కెట్ 100 బిలియన్ డాలర్లకు చేరుకోబోతుందని తెలిసింది. దీంతో భారత్‌లోనే తన తొలి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేయాలని గూగుల్ చూస్తోంది. ‘గూగుల్ రెండో వైపు ఆలోచనలను ప్రారంభించింది’ అని ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. అయితే ఈ విషయంపై గూగుల్ స్పందించడం లేదు. ఈ వారం ప్రారంభంలోనే ఈ-కామర్స్ మార్కెట్‌పై తనకు ఆసక్తి ఉందని గూగుల్ సంకేతాలు ఇచ్చింది. చైనీస్ ఈకామర్స్ కంపెనీ జేడీ.కామ్‌లో గూగుల్ 550 మిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టింది. అక్కడ వాల్‌మార్ట్, జేడీ.కామ్లు వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఉన్నాయి. గూగుల్ ఇండియా ఈ-కామర్స్ ప్లాన్లు ఏడాది పట్టే అవకాశం ఉందని తెలిసింది. ఇతర ఎమర్జింగ్ మార్కెట్లలోకి వెళ్లే ముందు, భారత్‌లో వీటిని టెస్ట్ చేయాలనుకుంటోంది. దీని కోసం 2వేల వర్క్‌షాపులను నిర్వహించింది. గూగుల్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ కోసం 15 వేల మందికి పైగా విక్రయదారులను గుర్తించిందని కూడా తెలిసింది. ఇలా గూగుల్ తన ఈ-కామర్స్ ప్లాన్స్‌ను అమల్లోకి తీసుకురావడానికి వేగవంతంగా ముందుకు సాగుతోంది. -
ఈ-కామర్స్ మార్కెట్లోకి ఫేస్బుక్
-
అమెజాన్‌ను దెబ్బతీయడం కోసం మరో దిగ్గజం
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు గట్టిపోటీ ఇచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్‌లు మెగా డీల్‌ను కుదుర్చుకోగా, మరో దిగ్గజ కంపెనీ కూడా అమెజాన్‌ను దెబ్బతీయడానికి భారత ఈ-కామర్స్ మార్కెట్లోకి అరంగేట్రం చేయబోతోంది. వాట్సాప్ ద్వారా ఇప్పటికే దేశీయ పేమెంట్ సర్వీసుల్లోకి ప్రవేశించిన ఫేస్బుక్, త్వరలోనే ఈ-కామర్స్ మార్కెట్లోకి ప్రవేశించనున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ కంపెనీ పలు బ్రాండులు, వ్యాపారస్తులతో చర్చలు జరుపుతుందని తెలిపాయి. జూన్ నుంచి ప్రారంభించబోతున్న బిజినెస్-టూ-కన్జ్యూమర్ ట్రాన్సక్షన్స్ టెస్టింగ్ ఈ నెల నుంచే మొదలైనట్టు ఒకరు పేర్కొన్నారు. ఫేస్బుక్ తన మార్కెట్‌ప్లేస్‌లో ఉత్పత్తులను అప్లోడ్ చేయడం కోసం మరిన్ని టూల్స్‌ను ఏర్పాటు చేయనుందని, ఇన్వెంటరీ, ఆర్డర్లను నిర్వహించనుందని తెలిపారు. ఈ ఏడాది చివరి వరకు పేమెంట్స్‌ను కూడా జత చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఫేస్బుక్, తన వినియోగదారులను అమ్మకపుదారుల ఫేస్బుక్ పేజీలకు, వెబ్సైట్లకు మరలుస్తోంది. ఫేస్బుక్ గత ఆరు నెలల క్రితమే కన్జ్యూమర్-టూ-కన్జ్యూమర్ ఇంటర్ఫేస్ కోసం మార్కెట్ ప్లేస్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి నెల ఈ మార్కెట్‌ప్లేస్‌ను 70 దేశాల్లో 800 మిలియన్ మంది యూజర్లు సందర్శిస్తూ కొనుగోళ్లు, అమ్మకాలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ సోషల్‌మీడియా దిగ్గజం బిజినెస్-టూ-కన్జ్యూమర్ మోడల్‌ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. దేశీయ ఈ-కామర్స్ మార్కెట్ 2026 వరకు 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మోర్గాన్ స్లాన్లీ అంచనావేస్తోంది. ప్రజల అవసరాలను చేరుకోవడానికి కంపెనీ ఎల్లవేళలా కృషిచేస్తుందని కంపెనీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఈకామర్స్ ద్వారా కమ్యూనిటీస్ కనెక్ట్ కావడం కోసం కొత్త మార్గాలను ఎల్లప్పుడూ అన్వేషిస్తూనే ఉంటామని తెలిపారు. -
ఫ్లిప్‌కార్ట్ భారీ గిడ్డంగి హైదరాబాద్‌లో..
అమ్మకాల్లో టాప్-3లో భాగ్యనగరి 13 నుంచి బిగ్ బిలియన్ డేస్ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇ-కామర్స్ మార్కెట్ ప్లేస్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ గిడ్డంగిని హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తోంది. కంపెనీకి ఇది 16వ గిడ్డంగి కాగా, తెలుగు రాష్ట్రాల్లో మొదటిది. 2.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మహబూబ్‌నగర్ జిల్లాలో ఇది రానుంది. నిర్మాణం పూర్తి అయితే రోజుకు 1.2 లక్షల వస్తువులను గిడ్డంగి నుంచి సరఫరా చేసే వీలుంది. అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఈ గిడ్డంగిని అక్టోబర్‌లోనే ప్రారంభించే అవకాశం ఉంది. 16 గిడ్డంగులకుగాను ఫ్లిప్‌కార్ట్ ఇప్పటి వరకు రూ.400 కోట్లు వెచ్చించింది. 2020 నాటికి మరో 50 నుంచి 100 గిడ్డంగులను ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. ఇందుకు రూ.3 వేల కోట్ల దాకా వెచ్చించే అవకాశం ఉంది. కొత్త గిడ్డంగి ద్వారా ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి కలగనుందని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నగోరి సాక్షి బిజినెస్ బ్యూరోకు సోమవారమిక్కడ తెలిపారు. మూడో స్థానంలో హైదరాబాద్.. ఫ్లిప్‌కార్ట్ విక్రయాల్లో ఢిల్లీ, బెంగళూరు తర్వాతి స్థానాన్ని హైదరాబాద్ దక్కించుకుందని అంకిత్ వెల్లడించారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లిప్‌కార్ట్‌తో 3,000 మంది విక్రయదారులు చేతులు కలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో సంస్థకు 5 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. కస్టమర్ల సంఖ్య ప్రతి నెల 8 శాతం పెరుగుతోంది. కొనుగోళ్ల పరంగా భాగ్యనగరి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్, తూర్పు గోదావరి ముందంజలో ఉన్నాయి. విభాగాల వారీగా చూస్తే అపారెల్స్, హోం, మొబైల్, స్పోర్ట్స్, ఫిట్నెస్, పర్సనల్ కేర్ వరుసగా నిలిచాయి. విద్యార్థులు, ఉద్యోగస్తులైన యువత అధికంగా ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. ఇ-కామర్స్ పుంజుకోవడానికి గల కారణాల్లో సౌకర్యం, ఎంచుకోవడానికి విభిన్న రకాలు, విక్రయానంతర సేవ, ఆ తర్వాతే ధర నిలిచింది’ అని అన్నారు. బిగ్ బిలియన్ డేస్.. అక్టోబర్ 13 నుంచి 17 వరకు బిగ్ బిలియన్ డేస్‌ను ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తోంది. 70 విభాగాల్లో 3 కోట్లకుపైగా ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. 40 వేల మంది విక్రయదారులు ఇందులో పాలుపంచుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 19 వేల మంది డెలివరీ బాయ్స్ సిద్ధంగా ఉన్నారని కంపెనీ తెలిపింది. ఆన్లైన్ లో వస్తువులను కొనుక్కునే వినియోగదార్లు దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది ఉన్నారని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ఇందులో తమ కస్టమర్లు 4.5 కోట్ల మంది ఉన్నారని వెల్లడించింది. 75 శాతం మంది మొబైల్ ద్వారా ఆర్డరు చేస్తున్నారని తెలిపింది. 4జీ విస్తృతి పెరిగితే ఇ-కామర్స్‌కు జోష్ వస్తుందని వివరించింది. -
ఐదేళ్లలో 36 శాతం వృద్ధి
భారత ఈ కామర్స్ హవా టెక్‌సై రీసెర్చ్ వెల్లడి కోల్‌కత: భారత ఈ-కామర్స్ మార్కెట్ ఐదేళ్లలో 36 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలదని కెనడాకు చెందిన టెక్‌సై రీసెర్చ్ సంస్థ తాజా నివేదిక తెలిపింది. భారీ డిస్కౌంట్లు, స్మార్ట్ఫోన్ల విని యోగం బాగా పెరగడం, తలసరి వ్యయార్హ వేతనాలు పెరగడం, యువ జనాభా పెరుగుతుండడం వంటి కారణాల వల్ల 2015-20 కాలానికి ఈ కామర్స్ మార్కెట్ ఈ స్థాయిలో దూసుకుపోతుందని పేర్కొంది. ఈ వివరాలను టెక్‌సై రీసెర్చ్ డెరైక్టర్ కరణ్ చెచి వెల్లడించారు. నివేదిక ప్రకారం.. భారత ఉద్యోగుల్లో యువ జనాభా అధికంగా ఉంది. సంప్రదాయ షాపులకు వెళ్లి షాపింగ్‌కు చేసేంత తీరిక సమయం వీరికి ఉండడం లేదు. దీంతో ఆన్లైన్ షాపింగ్ జోరుగా పెరుగుతోంది.ఈ-కామర్స్ కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీపడుతూ భారీ డిస్కౌంట్లను ఇస్తున్నాయి. దీంతో ఆన్‌లైన షాపింగ్ పట్ల ఆసక్తి పెరుగుతోంది.భారత ఈ-కామర్స్ మార్కెట్లో ఈ సేవల సెగ్మెంట్ జోరు బాగా ఉంది. అన్నింటిలోకి ఆన్లైన్ ట్రావెల్ మార్కెట్ జోరుగా ఉంది. సెలవు రోజులు గడపటానికి, హోటళ్లు, బస్, రైలు, విమా న టికెట్ల బుకింగ్స్ కారణంగా ఆన్లైన్ ట్రావెల్ మార్కెట్ లావాదేవీలు దూసుకెళ్తున్నాయి. ఈ-కామర్స్ మార్కెట్లో చెల్లింపుల విధానం చెప్పుకోదగిన స్థాయిలో మెరుగుపడుతోంది. దీంతో ఆన్లైన్ షాపింగ్ సురక్షితం కాదనే భావన నుంచి వినియోగదారులు బైటపడుతున్నారు.కన్సూమర్ ఎలక్ఠ్రానిక్స్, ఆన్లైన్ ట్రావెల్, అప్పారెల్, యాక్సెసరీలు... ఈ సెగ్మెంట్లలో వృద్ధి అంతకంతకూ జోరందుకుంటోంది.కొన్న రోజే డెలివరీ చేసే అవకాశంతో ఆన్లైన్ కిరాణా పోర్టల్స్ బిజినెస్ పుంజుకుంటోంది. -
టెకీల కోసం... లేటెస్ట్
టెక్నాలజీ ఉపకరణాల్ని మాత్రమే విక్రయిస్తున్న లేటెస్ట్వన్.కామ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ మార్కెట్ 2013-14 నాటికి రూ.30 వేల కోట్లకు చేరింది. అయితే దీన్లో టెక్నాలజీ ఉపకరణాల వాటా రూ.2 వేల కోట్లుగా ఉంటుంది. ఇది చాలు... ఆన్లైన్లో టెక్ ఉత్పత్తుల డిమాండ్ తెలియజేయడానికి. అందుకే కేవలం టెక్నాలజీ ఉపకరణాలను మాత్రమే విక్రయించేందుకు లేటెస్ట్వన్.కామ్‌ను ఆరంభించామన్నారు సంస్థ సీఈఓ అమీన్ ఖ్వాజా. గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో సంస్థ విస్తరణ ప్రణాళికలు వివరించారాయన. అవి... - సెల్ఫోన్లు, కంప్యూటర్లు, చార్జర్లు, కేబుల్స్ వంటి టెక్నాలజీ ఉపకరణాల విక్రయానికి రూ.30 కోట్ల పెట్టుబడితో గత ఆగస్టులో లేటెస్ట్వన్.కామ్‌ను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం దీన్లో 8 వేల వరకు వివిధ రకాల ఉత్పత్తులున్నాయి. రోజుకు రూ.11-12 లక్షల విలువ చేసే 2,500 ఆర్డర్లొస్తున్నాయి. వీటిలో సెల్‌ఫోన్ యాక్ససరీల వాటా ఎక్కువ. - ఇతర ఈ-కామర్స్ సైట్లకు మాకూ ఉన్న ప్రధాన తేడా ఏంటంటే.. విక్రయించే వస్తువుల్లో 75 శాతం ఉత్పత్తులు సొంత బ్రాండ్ పీ-ట్రాన్‌వే. చైనాకు చెందిన మూడు తయారీ సంస్థలతో ఒప్పందం చేసుకుని అవి తయారు చేసిన వస్తువుల్నే విక్రయిస్తున్నాం. దీంతో ధర తక్కువగా ఉంటోంది. మార్జిన్లూ ఎక్కువే ఉన్నాయి. -
లక్ష ఈ-కామర్స్ కొలువులు!
వచ్చే ఆరునెలల్లో నియామకాలపై పరిశ్రమల వర్గాల అంచనా ముంబై: ఆన్లైన్ షాపింగ్ పరిశ్రమలో కొలువుల జోరు పెరగనుంది. ఈ-కామర్స్ మార్కెట్‌కు వచ్చే ఆరు నెలల్లో లక్ష కొత్త ఉద్యోగాల అవసరం ఉందనేది పరిశ్రమ వర్గాల అంచనా. నియామకాలకు సంబంధించిన కన్సల్టెంగ్ సంస్థలకు ఈ-కామర్స్ నుంచి హైరింగ్ విజ్ఞప్తులు భారీగా పెరుగుతున్నాయని గ్లోబల్ హెర్ఆర్ దిగ్గజం ఇన్హెల్మ్ లీడర్షిప్ సొల్యూషన్స్ కంట్రీ హెడ్ ప్రశాంత్ నాయర్ చెప్పారు. రానున్న ఆరు నెలల వ్యవధిలో కనీసం లక్ష కొత్త ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఉందన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. * 2009లో దేశీ ఈ-కామర్స్ మార్కెట్ విలువ 3.8 బిలియన్ డాలర్లు ఉండగా... 2013లో ఇది 12.6 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. చక్రీయగతిన(సీఏజీఆర్) 30% వృద్ధిని నమోదు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి 8-10 శాతం స్థాయిలో ఉంది. * అయితే, కీలక స్థానాల్లో నిపుణులను అట్టిపెట్టుకోవడం దేశీ ఈ-కామర్స్ రంగానికి అతిపెద్ద సవాలు. * కంపెనీలు భారీ స్థాయిలో విస్తరణ ప్రణాళికలను అమలు చేస్తుండటంతో.. సిబ్బంది అవసరం కూడా గణనీయంగా పెరుగుతోంది. దీంతో నియామకాల కోసం ఈ రంగంలో నైపుణ్యంగల కన్సల్టెన్సీలపై అధికంగా ఆధారపడుతున్నాయి. -
అతిపెద్ద ఈ కామర్స్ మార్కెట్‌గా ఆసియా: సర్వే
బీజింగ్: ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ మార్కెట్‌గా ఈ ఏడాది ఆసియా అవతరిస్తుందని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) సర్వేలో వెల్లడైంది. ఇప్పటివరకూ అగ్రస్థానంలో ఉన్న ఉత్తర అమెరికాను తోసిరాజని ఆసియా ప్రాంతం మొదటి స్థానంలోకి దూసుకువస్తుందని ఈఐయూ సర్వే పేర్కొంది. ఎకనామిస్ట్ మ్యాగజైన్ గ్రూప్ అడ్వైజరీ కంపెనీగా వ్యవహరిస్తున్న ఈఐయూ ఈ సర్వేను నిర్వహించింది. చైనా, హాంగ్‌కాంగ్, తైవాన్, మకావూ, భారత్, జపాన్, సింగపూర్, కొరియా తదితర దేశాల్లో మొత్తం 5,500 మంది మహిళలపై ఈఐయూ ఈ సర్వేను నిర్వహించింది. వివరాలు... - ఈ కామర్స్‌లో రిటైల్ అమ్మకాలు ఈ ఏడాది ఆసియాలో 5 శాతం వృద్ధితో 7.6 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతాయి. ఇది ఉత్తర అమెరికాలో 2.5 శాతం, యూరప్‌లో 0.8 శాతం చొప్పున వృద్ధి ఉండొచ్చు. - ఆసియా మహిళలకు స్వేచ్ఛ, ఆర్థిక శక్తి పెరగడం, ఆన్లైన్ షాపింగ్‌పై మక్కువ పెరుగుతుండడం వంటి కారణాల వల్ల అసియాలో ఈ కామర్స్ హవా పెరుగుతోంది. - షాప్‌కు వెళ్లడం కంటే ఆన్లైన్లోనే షాపింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తామని సగానికి పైగా మహిళలు చెప్పారు. - వస్తువులు, సేవలకోసం రోజులో ఒక్కసారైనా నెట్‌ను వాడతామని 63% మంది చెప్పారు. -
ఆన్లైన్ షాపింగ్ హల్చల్..!
న్యూఢిల్లీ: భారత్‌లో ఆన్లైన్ కొనుగోళ్లు దూసుకెళ్తున్నాయని సెర్చింజన్ దిగ్గజం గూగుల్ పేర్కొంది. రెండేళ్లలో(2016 కల్లా) ఈ-కామర్స్ మార్కెట్ 15 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.93 వేల కోట్లు)కు ఎగబాకనున్నట్లు తెలిపింది. ప్రధానంగా ఇంటర్నెట్ వినియోగం అంతకంతకూ పెరుగుతుండటం.. ఆన్లైన్లో షాపింగ్‌కు మొగ్గుచూపుతున్నవాళ్ల సంఖ్య జోరందుకుంటుండటమే దీనికి కారణమని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఈ-కామర్స్ మార్కెట్ విలువ 3 బిలియన్ డాలర్లు(సుమారు రూ.18,600 కోట్లు)గా పరిశ్రమ విశ్లేషకుల అంచనా. 2012లో ఆన్లైన్ కొనుగోలుదారుల సంఖ్య 80 లక్షలు కాగా, ప్రస్తుతం ఈ సంఖ్య దాదాపు 3.5 కోట్లకు పెరిగిందని గూగుల్ పేర్కొంది. దుస్తులు, పాదరక్షల నుంచి ఎలక్ట్రానిక్స్, సౌందర్య ఉత్పత్తులు, ఫర్నిచర్ ఇలా సమస్తం ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్న ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. కాగా, 2016నాటికి ఆన్లైన్ షాపర్ల సంఖ్య మూడింతలై 10 కోట్లకు వృద్ధి చెందనుందనేది గూగుల్ అంచనా. కన్సల్టింగ్ సంస్థ ఫారెస్టర్ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సర్వేలో 6,859 మంది పాల్గొన్నారు. ఆన్‌లైన్‌పై పెరుగుతున్న విశ్వాసం... ‘వచ్చే రెండేళ్లలో మూడింతలు కానున్న ఆన్లైన్ కొనుగోలుదార్లలో 5 కోట్ల మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచే జతకానున్నారు. ఈ నగరాల్లోని ఆఫ్‌లైన్ కొనుగోలుదారుల్లో(అధ్యయనంలో పాల్గొన్నవాళ్లు) 71 శాతం మంది రానున్న 12 నెలల్లో తాము ఆన్లైన్లో కొనుగోలు చేస్తామంటున్నారు. ఆన్లైన్ షాపింగ్ విషయంలో కస్టమర్ల విశ్వాసం పుంజుకుంటోందనడానికి ఇదే నిదర్శనం. ఈ డిసెంబర్ చివరినాటికి భారత్‌లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 30.2 కోట్లుగా ఉండొచ్చని అంచనా. తద్వారా ఆన్లైన్ యూజర్‌బేస్ విషయంలో అమెరికాను వెనక్కినెట్టి భారత్ రెండో స్థానాన్ని ఆక్రమించనుంది’ అని గూగుల్ ఇండియా ఎండీ రాజన్ ఆనంద్ పేర్కొన్నారు. ఆన్లైన్ షాపింగ్‌పై విశ్వాసం, పెరుగుతున్న యూజర్లతో ఈ-కామర్స్ రంగం ఊహించని వృద్ధిని సాధించనుందన్న సంకేతాలు న్నాయని గూగుల్ ఇండియా డెరైక్టర్నితిన్ బావంకులే అన్నారు. పటిష్టమైన వృద్ధి ధోరణికి అనుగుణంగా యూజర్ల అవసరాలను తీర్చడంపై పరిశ్రమ దృష్టిపెట్టాలన్నారు. -
భారత్‌లో అమెజాన్ రూ.12 వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: తీవ్ర పోటీతో వేడెక్కుతున్న దేశీ ఈ-కామర్స్ మార్కెట్లో విదేశీ దిగ్గజాలు దూకుడు పెంచుతున్నాయి. అంతర్జాతీయ అగ్రగామి సంస్థ అమెజాన్.. భారత్‌లో 2 బిలియన్ డాలర్ల(సుమారు రూ.12,000 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు బుధవారం ప్రకటించింది. దేశీ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్... ఇన్వెస్టర్ల నుంచి రూ.6,000 కోట్లను సమీకరించినట్లు వెల్లడించిన మర్నాడే అమెజాన్ భారీ ఇన్వెస్ట్మెంట్ ప్రకటన వెలువడటం గమనార్హం. అమెజాన్.ఇన్ పేరుతో ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఏడాది క్రితం భారత్ మార్కెట్లోకి అమెజాన్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ ఒకటని.. ఇక్కడ తమ స్థూల అమ్మకాలు బిలియన్ డాలర్ల(దాదాపు రూ.6,000 కోట్లు) స్థాయికి చేరువవుతున్నాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘తొలి ఏడాది వ్యాపారంలో కస్టమర్లు, చిన్న, మధ్యస్థాయి వ్యాపారుల నుంచి స్పందన మా అంచనాలను మించింది. ఇక్కడి ఆర్థిక వ్యవస్థతో పాటు ఈ-కామర్స్ రంగంలో కూడా అపారమైన అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణలో భాగంగా మరింత వినూత్న ఆలోచనలు, మెరుగైన సదుపాయాలతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ 2 బిలియన్ డాలర్ల నిధులను వెచ్చించనున్నాం’ అని అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్ పేర్కొన్నారు. బుక్స్, అపారెల్, ఎలక్ట్రానిక్స్ ఇలా విభిన్న విభాగాల్లో అమెజాన్ 1.7 కోట్లకుపైగా ఉత్పత్తులను భారత్‌లో విక్రయించినట్లు అంచనా.