హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా జూన్ నెలలో అన్ని విభాగాల్లో కలిపి వాహన రిటైల్ విక్రయాలు 18,63,868 యూనిట్లు నమోదయ్యాయి. 2022 జూన్‌తో పోలిస్తే ఇది 10 శాతం అధికం అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఏడీఏ) తెలిపింది. 2023 మే నెలతో పోలిస్తే జూన్ అమ్మకాలు 8 శాతం క్షీణించడం గమనార్హం.
‘జూన్ మాసంలో ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాలు 5 శాతం ఎగసి 2,95,299 యూనిట్లకు చేరుకున్నాయి. ద్విచక్ర వాహనాలు 7 శాతం పెరిగి 13,10,186 యూనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహనాలు 75 శాతం దూసుకెళ్లి 86,511 యూనిట్లకు పెరిగాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 45 శాతం అధికమై 98,660 యూనిట్లను తాకాయి’ అని ఫెడరేషన్ వివరించింది.
మే నెలతో పోలిస్తే జూన్‌లో ద్విచక్ర వాహన విక్రయాలు 12 శాతం క్షీణించాయి. అలాగే రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంఖ్య 56 శాతం తగ్గింది. కేంద్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి ఫేమ్ సబ్సిడీ తగ్గించడమే ఈ క్షీణతకు కారణం.
Comments
Please login to add a commentAdd a comment