సాక్షి,బెంగళూరు : ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన చాలా వస్తువులకు వారెంటీ ఉండదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావు అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై వినియోగదారులు దృష్టి సారిస్తే తదుపరి ఎదురయ్యే సమస్యలను తప్పించుకోవచ్చని అన్నారు. ఇక్కడి మల్లేశ్వరంలోని వెస్ట్‌ఎండ్‌జూస్ షాప్‌లో శుక్రవారం ప్రారంభించిన ‘ఆన్‌లైన్ ధరలోనే రిటైల్ అమ్మకాలు’ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ధర తక్కువ కావడంతో ఇటీవల చాలా మంది ఆన్‌లైన్‌లోనే వస్తువులను కొనుగోలు చేస్తున్నారన్నారు. అయితే రీటైల్ అమ్మకందారులు ఇచ్చినట్టు వారెంటీ సేవలను ఈ-కామర్స్ కంపెనీలు అం దించడంలో విఫలమవుతున్నాయన్నా రు. ఈ విషయంపై వినియోగదారులు దృష్టిసారించాలన్నారు. ఈ-కామర్స్ కం పెనీలు వస్తువుల విక్రయం కోసం అనుసరిస్తున్న విధానాలు పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
విక్రయాలకు సంబంధించి మరింత కఠిన నియంత్ర ణ, నిఘాలను ఏర్పాటు చేయడం సబబ ుగా ఉంటుందని పేర్కొన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు. వ్యక్తిగతంగా తాను రీటైల్ దుకాణాల్లోనే వస్తువులను గొనుగోలు చేయడానికి ఇష్టపడుతానని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి సావేజ్ అహ్మద్, పలువురు సా ్థనిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌లో వస్తువులకు వారెంటీ ఉండదు
Published Sat, Oct 11 2014 1:57 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement