Online War Congress Party Purely Dominates BJP - Sakshi
Sakshi News home page

వీడియో: అక్కడ కాంగ్రెస్‌ దూకుడు.. ప్చ్‌.. బీజేపీ వెనుకంజ!

Published Wed, Jun 28 2023 10:31 AM | Last Updated on Wed, Jun 28 2023 3:03 PM

Online War Congress Party Purely  Dominates BJP - Sakshi

ఢిల్లీ: 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ విజయకేతనంలో కీలక పాత్ర పోషించింది సోషల్‌ మీడియానే. అలాంటి ప్లాట్‌ఫామ్‌పై పరుగులో బీజేపీ వెనుకంజలో ఉంది. అనూహ్యాంగా గత కొంతకాలంగా జెట్‌స్పీడ్‌తో ఆ రేసులో దూసుకుపోతోంది కాంగ్రెస్‌ పార్టీ. ఎన్నికల ప్రస్తావనేదీ లేకుండా కేవలం క్రియేటివిటీ వీడియోలతో కాంగ్రెస్‌ ముందుకు సాగుతుండడం గమనార్హం.

గత కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా అకౌంట్లు విపరీతంగా యాక్టివ్‌గా ఉంటున్నాయి. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ గ్రూప్‌లలో  ప్రచారం విపరీతంగా పెరిగింది. రకరకాల థీమ్‌లతో వీడియోలు రూపొందిస్తోంది. ముఖ్యంగా కర్నాటక ఎన్నిలక ప్రచార సమయంలోనూ.. కాంగ్రెస్‌వీడియోలు విపరీతంగా ట్రెండ్‌ అయ్యాయి. ఆఖరికి అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ థీమ్‌ను సైతం ఉపయోగించుకున్నాయి. ఇక కర్ణాటక ఫలితాల రోజైతే ఏకంగా కాంగ్రెస్‌ వీడియోలే ట్రెండింగ్‌లో సత్తా చాటాయి. 

తాజాగా కాంగ్రెస్‌ రిలీజ్‌ చేసిన ఓ యానిమేటెడ్‌ వీడియో నెటిజన్స్‌ ఆదరణ చురగొంటోంది. బీజేపీ విద్వేష వ్యాపార వీధిని సృష్టిస్తే.. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అక్కడ ప్రేమ దుకాణాలను తెరిచి అడ్డుకుంటున్నారని కాంగ్రెస్‌ ఆ యానిమేటెడ్‌ వీడియోలో చూపించింది. పైగా ఈ వీడియోలో మోదీ, అమిత్‌ షాల క్యారెక్టర్లను కూడా చూపించింది. 

భారత్‌ జోడో యాత్ర సందర్భంగా.. విద్వేష వ్యాపార వీధిలో ప్రేమ దుకాణాలను తెరుస్తానని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించాడు. ఈ మాటనే పదే పదే ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ ఆన్‌లైన్‌ ప్రచారంలో దూసుకుపోతోంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement