న్యూఢిల్లీ: కోవిడ్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.4 లక్షలు పరిహారంగా ఇవ్వాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ ఆన్‌లైన్ ప్రచార కార్యక్రమం ‘కోవిడ్ న్యాయ్’ను ప్రారంభించింది. దేశ ప్రజలు కరోనా మహమ్మారితో తల్లడిల్లుతుండగా పట్టించుకోకుండా ప్రభుత్వం నిద్రపోతోందని దుయ్యబట్టింది. దేశంలో కరోనాతో మృతి చెందిన వారి వాస్తవ వివరాలు బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. శనివారం ‘కోవిడ్ న్యాయ్’ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్‌లో.. ‘కోవిడ్‌తో ప్రజలు కష్టనష్టాలకు గురవుతుండగా కేంద్ర ప్రభుత్వం మాత్రం నిద్ర పోతోంది. ప్రభుత్వ పెద్దలను మేల్కొలుపుదాం’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment