Dinesh gunduravu
-
నకిలీ కార్డుల సమాచారమిస్తే నజరానా
నవంబర్ నుంచి అమల్లోకి పౌరకార్మికులందరికీ బీపీఎల్ కార్డులు ఏపీఎల్ కార్డుదారులకు సబ్సిడీ బియ్యం లేదు మంత్రి దినేష్ గుండూరావు సాక్షి, బెంగళూరు : నకిలీ రేషన్ కార్డుల సమాచారం అందించిన వారికి నగదు బహుమతి ఇస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్గుండూరావు వెల్లడించారు. నవంబర్ నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన సోమవారం మాట్లాడారు. నకిలీ కార్డుల ఏరివేత ప్రక్రియను సక్రమంగా అమలు చేయడం కోసమే ‘నజరానా’ విధానాన్ని అమలు చేయనున్నామన్నారు. పౌరకార్మికులందరిరీ బీపీఎల్ కార్డులను అందిం చే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఏపీఎల్ కార్డుదారులకు సబ్సిడీ ధరపై బియ్యం అందించే విషయమేదీ ప్రస్తుతానికి పరిశీలనలో లేదన్నారు. తమిళనాడులోని అమ్మ క్యాంటీన్ల మాదిరి ఇక్కడ కూడా సబ్సిడీ ధరల్లో ఆహారం అందించే క్యాటీన్లను తెరవడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమన్నారు. ఈ విషయమై ఇప్పటికే సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలకు లేఖ రాసినా అటు వైపు నుంచి సమాచారం రాలేదని అసహనం వ్యక్తం చేశారు. ‘క్యాంటీన్ల’కంటే అంత్యోదయ పథకాన్ని మరింత సమర్ధవంతంగా అమలుచేయడం వల్లే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. -
ఆన్లైన్లో వస్తువులకు వారెంటీ ఉండదు
సాక్షి,బెంగళూరు : ఆన్లైన్లో కొనుగోలు చేసిన చాలా వస్తువులకు వారెంటీ ఉండదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావు అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై వినియోగదారులు దృష్టి సారిస్తే తదుపరి ఎదురయ్యే సమస్యలను తప్పించుకోవచ్చని అన్నారు. ఇక్కడి మల్లేశ్వరంలోని వెస్ట్ఎండ్జూస్ షాప్లో శుక్రవారం ప్రారంభించిన ‘ఆన్లైన్ ధరలోనే రిటైల్ అమ్మకాలు’ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ధర తక్కువ కావడంతో ఇటీవల చాలా మంది ఆన్లైన్లోనే వస్తువులను కొనుగోలు చేస్తున్నారన్నారు. అయితే రీటైల్ అమ్మకందారులు ఇచ్చినట్టు వారెంటీ సేవలను ఈ-కామర్స్ కంపెనీలు అం దించడంలో విఫలమవుతున్నాయన్నా రు. ఈ విషయంపై వినియోగదారులు దృష్టిసారించాలన్నారు. ఈ-కామర్స్ కం పెనీలు వస్తువుల విక్రయం కోసం అనుసరిస్తున్న విధానాలు పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. విక్రయాలకు సంబంధించి మరింత కఠిన నియంత్ర ణ, నిఘాలను ఏర్పాటు చేయడం సబబ ుగా ఉంటుందని పేర్కొన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు. వ్యక్తిగతంగా తాను రీటైల్ దుకాణాల్లోనే వస్తువులను గొనుగోలు చేయడానికి ఇష్టపడుతానని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి సావేజ్ అహ్మద్, పలువురు సా ్థనిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.