- నవంబర్ నుంచి అమల్లోకి
- పౌరకార్మికులందరికీ బీపీఎల్ కార్డులు
- ఏపీఎల్ కార్డుదారులకు సబ్సిడీ బియ్యం లేదు
- మంత్రి దినేష్ గుండూరావు
సాక్షి, బెంగళూరు : నకిలీ రేషన్ కార్డుల సమాచారం అందించిన వారికి నగదు బహుమతి ఇస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్‌గుండూరావు వెల్లడించారు. నవంబర్ నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన సోమవారం మాట్లాడారు. నకిలీ కార్డుల ఏరివేత ప్రక్రియను సక్రమంగా అమలు చేయడం కోసమే ‘నజరానా’ విధానాన్ని అమలు చేయనున్నామన్నారు. పౌరకార్మికులందరిరీ బీపీఎల్ కార్డులను అందిం చే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు.
ఏపీఎల్ కార్డుదారులకు సబ్సిడీ ధరపై బియ్యం అందించే విషయమేదీ ప్రస్తుతానికి పరిశీలనలో లేదన్నారు. తమిళనాడులోని అమ్మ క్యాంటీన్ల మాదిరి ఇక్కడ కూడా సబ్సిడీ ధరల్లో ఆహారం అందించే క్యాటీన్లను తెరవడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమన్నారు. ఈ విషయమై ఇప్పటికే సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలకు లేఖ రాసినా అటు వైపు నుంచి సమాచారం రాలేదని అసహనం వ్యక్తం చేశారు. ‘క్యాంటీన్ల’కంటే అంత్యోదయ పథకాన్ని మరింత సమర్ధవంతంగా అమలుచేయడం వల్లే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు.