మార్కెట్‌కు ఫలితాల దన్ను! | Shares Of The Automobile Sector Closed At A Profit On Wednesday | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు ఫలితాల దన్ను!

Published Thu, Oct 24 2019 5:17 AM | Last Updated on Thu, Oct 24 2019 5:17 AM

Shares Of The Automobile Sector Closed At A Profit On Wednesday - Sakshi

ఐటీ, ఆర్థిక, వాహన రంగ షేర్ల దన్నుతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, కంపెనీల క్యూ2 ఫలితాలు ఆశావహంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా పుంజుకోవడం, ముడి చమురు ధరలు 0.85 శాతం తగ్గడం సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్, నిఫ్టీలు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైనా, చివరకు కీలకమైన పాయింట్ల ఎగువునే ముగిశాయి. సెన్సెక్స్‌ 39,000 పాయింట్లు, నిఫ్టీ 11,600 పాయింట్ల పైకి ఎగబాకాయి.

రోజంతా 331 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 95 పాయింట్ల లాభంతో 39,059 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 11,604 పాయింట్ల వద్ద ముగిశాయి.  కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు కారణంగా కంపెనీల నికర లాభాలు పెరుగుతున్నాయని, ఈ సానుకూల క్యూ2 ఫలితాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిస్తున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ ఎనలిస్ట్‌ వినోద్‌  నాయర్‌ చెప్పారు. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్‌ 2.9 శాతం లాభంతో రూ.1,096 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. ఆరి్థక ఫలితాల వెల్లడికి ముందు సానుకూల అంచనాలతో ఈ కౌంటర్‌లో కొనుగోళ్లు జోరుగా జరిగాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement