దిగ్గజ కంపెనీ గూగుల్‌తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా డిజిటలైజ్ అయ్యే క్రమంలో భాగంగా గూగుల్ సంస్థతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, గూగుల్ ఇండియా హెడ్ సంజయ్ గుప్తాలు పాల్గొన్నారు.
గూగుల్, తెలంగాణ ప్రభుత్వంల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం ప్రభుత్వ పాఠశాలల డిజిటలీకరణ, మహిళలు, యువతకు సాంకేతిక అంశాల్లో శిక్షణతో పాటు అవసరమైన మద్దతును గూగుల్ అందిస్తుంది. అంతేకాకుండా ఇక్కడి యువతకు కెరీర్ ఓరియెంటెండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తుంది. వీటితో పాటు పౌర సేవలు మరింత సులభతం చేసేందుకు అవసరమైన టెక్నాలజీని గూగుల్ అందిస్తుంది.
మరోవైపు అమెరికా వెలుపల అతి పెద్ద క్యాంపస్ నిర్మాణ పనులను గూగుల్ ప్రారంభించింది. గచ్చిబౌలిలో 2019లో గూగుల్ 7.5 ఎకరాల స్థలం కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ స్థలంలో 23 అంతస్థుల భవనాన్ని నిర్మిస్తోంది. ఇందులో 3.30 మిలియన్ చదరపు అడుగుల వర్క్‌స్పేస్ అందుబాటులోకి వచ్చేలా భవనాన్ని గూగుల్ డిజైన్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment