2023 సెప్టెంబరులో జరగనున్న జీ20 సదస్సుకు సన్నాహకంగా ప్రపంచ వ్యాపార దిగ్గజాలు న్యూఢిల్లో శుక్రవారం సమావేశమైనారు. ఈ సందర్బంగా మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగాలకు కల్పనకు, వృద్ధికి దారి తీస్తుందన్నారు. ఏఐ సంభావ్య ప్రమాదాలు, చాట్ జీపీటీ వంటి ఉత్పాదక సాధనాల భవిష్యత్తు గురించి కూడా మాట్లాడారు ఇవి ఖచ్చితంగా ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మారుస్తాయి, అయితే ఏఐ మానవ నియంత్రణలో ఉండాలన్నారు. దీనికి సంబంధించిన తనిఖీలు, బ్యాలెన్సింగ్ సిస్టం అవసరమన్నారు. విప్లవాత్మక ప్రింటింగ్ ప్రెస్ ఆవిష్కరణలా ఫ్యూచర్ నాలెడ్జ్‌కు ఇవి చాలా ముఖ్యం అని చెప్పారు.
ఏఐ ఉద్యోగాలకు మూలం ఏఐ అంటే మ్యాజిక్ కాదు
ఏఐ అనేది ప్రజలు తెలివిగా ఆలోచించడానికి, సమాధానాల్ని మరింత త్వరగా కనుగొనడంలో సహాయపడే ఒక సాధనం .. ఏఐ మనల్నిమరింత విజయ వంతం చేయగలదు. అలా అని మనం ఆలోచించడం మానుకోకూడదు. ఇది మరింత వృద్ధికి ఉద్యోగాల సృష్టికి మూలంగా ఉంటుందనే అభిప్రాయాన్ని మైక్రోసాఫ్ట్ బాస్ వెల్లడించారు. అంతేకాదు గత ఏడాది లాంచ్ అయిన ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీపై మరింత ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇది వ్యాధులను నిర్ధారించడంలో వైద్యులను మరింత ప్రభావవంతంగా చేస్తుంది. వ్యాధులను నయం చేయడానికి కొత్త మందుల్ని కనుగొనడంలో సహాయపడుతుంది, అలాగే విద్యార్థులు, తల్లిదండ్రులకు ట్యూటర్‌గా ఉపయోగ పడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా దాదాపు 600 సంవత్సరాల క్రితం ప్రింటింగ్ ప్రెస్ ఆవిష్కరణలా గట్టి ప్రభావం చూపుతుందనీ, ఈ విషయంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని స్మిత్ అన్నారు.
ఏఐ అంటేమ్యాజిక్ కాదు. నాలెడ్జ్‌కి ఇండిపెండెంట్ సోర్స్. అది గణితం. ఏఐ వల్ల ఎప్పటికీ ఎలాంటి ప్రమాదం లేదని నిరూపించా లనేదే తమ లక్ష్యమని, అయితే టెక్నాలజీ మన కంట్రోల్‌లో ఉండాలనే గుర్తుంచుకోవాలని తెలిపారు.
డిజిలైజేషన్‌లో అద్భుతం
అలాగే డిజిటలైజేషన్‌లో భారతదేశం సాధించిన అద్భుతమైన పురోగతిపై ఆయన ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఈ దశాబ్దం ఆరంభం నుండి అభివృద్ధి చెందిందని, డిజిటల్ చెల్లింపుల్లో ఇంత త్వరగా అభివృద్ది సాధించిన మరో దేశాన్ని తాను చూడలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment