డిజిటలైజేషన్ దిశగా గ్రంథాలయాలు
డిజిటలైజేషన్ దిశగా గ్రంథాలయాలు
Published Mon, Nov 14 2016 12:47 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
అనంతపురం కల్చరల్ : రాష్ట్రంలో తొలిసారి ’అనంత’ కేంద్రంగా డిజిటల్ లైబ్రరీ రూపుదిద్దుకోనుంది. తాడిపత్రి, హిందూపురం తదితర చోట్ల కూ డా డిజిటల్ గ్రంథాలయాల ఏర్పాటుకు ముమ్మురంగా పనులు సాగుతున్నాయి. అన్ని గ్రేడ్1, గ్రేడ్2 శాఖా గ్రంథాలయాలకు కూడా ఇటీవల ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించారు. ప్రాచీన గ్రంథాల నుం చి నేటి ప్రచురణల వరకూ కంప్యూటరీకరణ చేపడుతున్నారు. ఆర్డీటీ వారి సహాయ సహకారాలతో దాదాపు రూ. 90 లక్షల వ్యయంతో ఆసే్ట్రలియా దేశం తరహాలో డిజిటలైజేష¯ŒS లైబ్రరీ నిర్మిస్తున్నా రు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 69 శాఖా గ్రంథాలయా లు, 9 గ్రామీణ గ్రంథాలయాలు, 70 పుస్తక నిక్షిప్త కేంద్రాలున్నాయి. వీటన్నింటిలో సోమవారం నుంచి 49వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నారు.
జిల్లా చరిత్ర ఘనం..
పప్పూరు రామాచార్యుల వంటి ఉద్దండులు సాగించిన గ్రంథాలయ ఉద్యమం కారణంగా జిల్లా కేంద్రంలో 1952 ఏప్రిల్ 2న గ్రంథాలయం ఏర్పాౖటెంది. 1958లో రాయదుర్గం, గుంతకల్లు, పెనుకొండ, గుత్తి పట్టణాల్లో శాఖా గ్రం థాలయాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లాలో వివిధ కేంద్రాల్లో దాదాపు 4 లక్షల 25 వేల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. గత ఏడాది 14,875,12 మంది గ్రంథాలయాలకు హాజరయ్యారని సమాచారం. ఈ సంవత్సరం పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రత్యేక పుస్తకాలు వచ్చినందున సుమారు 20 లక్షల మంది లైబ్రరీలను సద్వినియోగం చేసకున్నారని అధికారులు చెపుతున్నారు.
సమస్యలతో సతమతం
అనేక గ్రంథాలయాల్లో సౌకర్యాలు లేక పాఠ కులు ఇబ్బందులకు గురవుతున్నారు. పలు లైబ్రరీల్లో టాయ్‌లెట్స్, తారునీటి సదుపాయం లేదు. ప్రత్యేక బడ్జెట్ కేటాయించక పోవడంతో వసతుల లేమి కనపడుతోంది. సిబ్బందికి 010 కింద జీ తా లు రావాలని, తమకు ఆరోగ్య శ్రీ వర్తింపజేయాలని చాలా కాలంగా గ్రంథాలయ ఉద్యోగ సంఘాలు పో రాటం చేస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని మహిళా లైబ్రరీ ప్రాంగణంలో నిర్మాణాలు నిరుపయోగంగా ఉన్నాయి. 36 గ్రంథాలయాలకు సొంత భవనాలుండగా, మరో 25 ఉచిత భవనాల్లో, 9 గ్రంథాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. స్థలాలున్నా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల కారణంగా నిర్మాణాలు ముందుకు సాగడం లేదు.
Advertisement