న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏప్రిల్–నవంబర్ మధ్య స్థూలంగా 15.7 శాతం ఎగశాయి. విలువలో 6.75 లక్షల కోట్లుగా నమోద య్యాయి. ఆర్థికశాఖ ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఎనిమిది నెలల కాలంలో రిఫండ్స్ విలువ రూ.1.23 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే రిఫండ్స్ విలువ 20.8 శాతం అధికం.
మొత్తం ఆర్థిక సంవత్సరంలో రూ.11.50 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు జరపాలన్నది 2018–19 బడ్జెట్ లక్ష్యం. తాజా గణాంకాల్లో ఇందులో 48 శాతానికి చేరినట్లయ్యింది. కాగా ఏప్రిల్–నవంబర్ మధ్య స్థూలంగా కార్పొరేట్ ఆదాయపు పన్ను (సీఐటీ) వసూళ్లు 17.7 శాతం, వ్యక్తిగత పన్ను వసూళ్లు 18.3 శాతం పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment