direct taxes
-
పన్నులపై సూచనలు ఇవ్వండి
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించిన కేంద్ర ఆర్థిక శాఖ.. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విషయంలో తగు సూచనలు చేయాలంటూ పరిశ్రమ వర్గాలు, ట్రేడ్ అసోసియేషన్లను కోరింది. డిమాండ్లతో పాటు వాటి వెనుక గల హేతుబద్ధతను కూడా వివరిస్తూ తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచించింది. సుంకాల స్వరూపం, పన్నుల రేట్లు మొదలైన వాటిల్లో మార్పులు, చేర్పులకు సంబంధించిన సిఫార్సులను పంపేందుకు నవంబర్ 5 ఆఖరు తేదీ. ప్రత్యక్ష పన్నుల రేట్లను క్రమబద్ధీకరించడంతో పాటు పన్ను ప్రోత్సాహకాలు, డిడక్షన్లు, మినహాయింపులు మొదలైనవి దశలవారీగా తొలగించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో తాజా బడ్జెట్‌పై ఆసక్తి నెలకొంది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 74% వృద్ధి
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు (వ్యక్తిగత, కార్పొరేట్) సెపె్టంబర్ 22వ తేదీ నాటికి (2021 ఏప్రిల్ నుంచి) నికరంగా రూ.5.70 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలి్చతే ఇది 74 శాతం అధికం. అడ్వాన్స్ పన్నులు, మూలం వద్ద పన్ను (టీడీఎస్) భారీ వసూళ్లు దీనికి కారణం. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు... ► ఏప్రిల్–1 నుంచి సెపె్టంబర్ 22 మధ్య నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5,70,568 కోట్లు. గత ఏడాది ఇదే కాలం (రూ.3.27 లక్షల కోట్లు) వసూళ్లతో పోల్చి చూస్తే 74.4 శాతం పెరుగుదల. కరోనా ముందస్తు సమయం 2019–20 ఇదే కాలంతో పోలి్చనా ఈ వసూళ్లు 27 శాతం అధికం. సంబంధిత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వసూళ్ల పరిమాణం రూ.4.48 లక్షల కోట్లు. ► ఇక స్థూలంగా చూస్తే, ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 47 శాతం పెరుగుదలతో రూ.4.39 లక్షల కోట్ల నుంచి రూ.6.45 లక్షల కోట్లకు ఎగశాయి. కరోనా కాలానికి ముందు 2019–20 ఆర్థిక సంవత్సరంతో (2019 సెపె్టంబర్ 22 వరకూ) పోలి్చతే 16.75 పెరుగుదల నమోదయ్యింది. అప్పట్లో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 5.53 లక్షల కోట్లు. ఇప్పటివరకూ రిఫండ్స్ రూ.75,111 కోట్లు. -
ఎగవేతదారులను వదలొద్దు
న్యూఢిల్లీ: వ్యవస్థలో లొసుగులను అడ్డం పెట్టుకుని పన్నులను ఎగవేయాలనుకునే వారితో కఠినంగా వ్యవహరించాలని ఆదాయ పన్ను శాఖ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అయితే, నిజాయతీగా కట్టాలనుకునేవారికి అవసరమైన తోడ్పాటునిచ్చి, తగిన విధంగా గౌరవించాలని పేర్కొన్నారు. 159వ ఆదాయపు పన్ను దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. ఎగవేతదారులను పట్టుకునేందుకు రెవెన్యూ శాఖలోని మూడు కీలక విభాగాలు (ఆదాయపు పన్ను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. ‘తప్పు ఎక్కడ జరుగుతోందో తెలుసుకునేందుకు మీ దగ్గర డేటా మైనింగ్, బిగ్ డేటా విశ్లేషణ వంటి సాధనాలు ఉన్నాయి. ఎగవేయాలనుకునే వారితో కఠినంగా వ్యవహరించండి. అలాంటి విషయాల్లో మీకు నా పూర్తి మద్దతు ఉంటుంది‘ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. సంపన్నులపై అధిక పన్ను భారం అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. పన్నులు చెల్లించడాన్ని ప్రజలు జాతి నిర్మాణంలో తమ వంతు కర్తవ్యంగా భావించాలే తప్ప జరిమానాగా అనుకోరాదని మంత్రి చెప్పారు. ‘ఎక్కువ సంపాదిస్తున్న వారిని శిక్షించాలన్నది మా ఉద్దేశం కాదు. ఆదాయాలు, వనరులను మరింత మెరుగ్గా పంచడానికి ఈ పన్నులు అవసరం. అత్యధికంగా ఆదాయాలు ఆర్జించే వర్గాలు కొంత మేర సామాన్యుల అభ్యున్నతికి కూడా తోడ్పాటు అందించాలన్నదే లక్ష్యం. ఈ భావాన్ని అర్థం చేసుకుంటే చాలు.. ఇన్‌కం ట్యాక్స్ విభాగమంటే భయం ఉండదు‘ అని ఆమె తెలిపారు. సులభసాధ్యమైన లక్ష్యం.. 2019–20లో నిర్దేశించుకున్న రూ. 13.35 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యం సులభసాధ్యమైనదేనని నిర్మలా సీతారామన్ చెప్పారు.‘గడిచిన అయిదేళ్లలో పన్ను చెల్లింపుదారుల సంఖ్యను రెట్టింపు స్థాయికి చేర్చగలిగాం. అలాంటప్పుడు పన్ను వసూళ్లను రూ. 11.8 లక్షల కోట్ల నుంచి కాస్త ఎక్కువగా రూ. 13 లక్షల కోట్లకు పెంచుకోవడం పెద్ద కష్టం కానే కాదు. సాధించతగిన లక్ష్యాన్నే మీకు నిర్దేశించడం జరిగింది‘ అని ఆమె వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యించినట్లుగా పన్ను చెల్లింపుదారుల సంఖ్యను ప్రస్తుతమున్న 7 కోట్ల నుంచి 8 కోట్లకు పెంచే దిశగా కృషి చేయాలని చెప్పారు. ఆహ్లాదకర వ్యవహారంగా ఉండాలి.. పన్ను చెల్లింపు ప్రక్రియ అంటే భయం కోల్పేదిగా కాకుండా ఆహ్లాదకరమైన వ్యవహారంగా ఉండే పరిస్థితులు కల్పించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ చెప్పారు. పన్ను వసూళ్లు పారదర్శకమైన, సముచిత రీతిలో జరిగేట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు చూడాలని ఆయన సూచించారు. 1960–61 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ. 13 లక్షలుగా ఉన్న ప్రత్యక్ష పన్ను వసూళ్లను గత ఆర్థిక సంవత్సరం (2018–19)లో రూ.11.37 లక్షల కోట్ల స్థాయికి చేర్చడంలో ఆదాయపు పన్ను శాఖ సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని మోదీ చెప్పారు. -
ఆదాయ పన్ను రద్దు సాధ్యమా?
రెండంకెల వృద్ధి సాధించాలంటే పొదుపును పెంచాలి. ఆదాయ పన్ను రద్దు చేయాలి అన్నారు డాక్టర్ సుబ్రమణ్య స్వామి గతంలో ఓసారి. కొంతమంది రాజకీయవేత్తలు, ఆదాయ పన్ను నిపుణులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. దీన్ని తెలివైన చర్యగా భావించవచ్చా? నిపుణులు ఏముంటున్నారో పరిశీలిద్దాం. ఆదాయ పన్ను ప్రభుత్వ రాబడికి ప్రధాన వనరు. భారత్ లాంటి దేశాల్లో పన్ను ఆదాయం సుస్థిర ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనకు దోహదపడుతుంది. పన్ను నిపుణుల ప్రకారం.. 2016 –17లో ప్రత్యక్ష పన్నుల చెల్లింపుదారులు 7.41 కోట్ల మంది. వీరి ద్వారా ప్రభుత్వానికి రూ. 8.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. మన జనాభాలో పన్ను చెల్లింపుదారులు కేవలం 2 శాతం మందే. జీడీపీలో ప్రత్యక్ష పన్నుల వాటా 5.98 శాతం మాత్రమే. ఈ వాటాను పెంచడానికి బదులు, అసలు ఆదాయ పన్నునే రద్దు చేయాలన్న ఆలోచనను పలువురు ముందుకు తెస్తున్నారు. జనం చేతుల్లో మరింత డబ్బు ఉండేలా చేయడమనేది దీని వెనక ఉన్న ఉద్దేశం. ‘పర్యవసానంగా డిమాండ్ పెరుగుతుంది. వ్యవస్థలోకి పెట్టుబడులు ప్రవహిస్తాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది’ అంటున్నారు కేపీఎంజీ (ఇండియా)లో కార్పొరేట్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్స్ విభాగాధిపతి హిమాన్షు పరేఖ్. అయితే, ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు, ఆర్థిక వ్యవస్థ అవసరాల కోసం భారీగా నిధులు కావాలి. 2030 నాటికి లక్ష గ్రామాల డిజిటలీకరణ, గ్రామాల పారిశ్రామికీకరణ, నదుల శుద్ధీకరణ, తీర ప్రాంత విస్తరణ, ఆహార రంగంలో స్వయం సమృద్ధి, ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సౌకర్యాల కల్పన తదితర లక్ష్యాలు సాధించాల్సివుంది. ఈ నేపథ్యంలో పన్ను రద్దు ప్రతిపాదన అసంబద్ధమైనదే అవుతుందంటున్నారు పరేఖ్. పైగా ప్రత్యక్ష పన్నుల విధానం న్యాయబద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకోవాలని ఆయన చెబుతున్నారు. పన్నుల మొత్తాలతోనే ప్రభుత్వాలు సమాజంలోని దిగువ తరగతి వర్గాలకు సంక్షేమ పథకాలు, సబ్సిడీలు అమలు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష పన్నులను రద్దు చేయాలంటే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషించాల్సి ఉందంటున్నారు డెలాయిట్ ఇండియా భాగస్వామి సరస్వతి కస్తూరి రంగన్. ప్రత్యక్ష పన్నుల రద్దు ద్వారా కోల్పోయే ఆదాయాన్ని – పరోక్ష పన్నులు పెంచడం వంటి ఇతరత్రా చర్యల ద్వారా సమకూర్చుకోవాలని ఆయన సలహా ఇస్తున్నారు. ఆదాయ పన్ను రద్దు వల్ల పన్ను చెల్లింపుదారులు తమ డబ్బును పొదుపు మార్గాల్లోకి, పెట్టుబడుల్లోకి మళ్లిస్తారని, ప్రత్యక్ష పన్ను వ్యవస్థ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం చేసే ఖర్చు కూడా తగ్గుతుందని పలువురు పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఇప్పటికే 3.4 శాతం ద్రవ్య లోటుతో ఉన్న ఆర్థిక వ్యవస్థపై ఈ చర్య వ్యతిరేక ప్రభావం చూపుతుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ‘ప్రస్తుతం యూఏఈ, కేమన్ ఐలాండ్స్, బహమాస్, బెర్ముడా తదితర కొన్ని దేశాలు ఆదాయ పన్ను విధించడం లేదు. పెద్ద దేశాలు మాత్రం పన్ను వసూలు చేస్తూనే ఉన్నాయి. నిజానికి, ప్రతి దేశమూ కనీసపాటి పన్ను విధించాలంటున్న ఓఈసీడీ – ఇందుకు శ్రీకారం కూడా చుట్టింది. ఆదాయ పన్నును రద్దు చేయడం వల్ల కొన్ని అనుకూలతలు దరి చేరవచ్చునేమో గానీ, భారత్‌లోని స్థూల ఆర్థిక దృశ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు దాన్ని రద్దు చేయకపోవడమే ఉత్తమం. ఇందుకు బదులుగా పన్ను రేట్లను తగ్గించడం, పన్ను విధానాన్ని మెరుగ్గా అమలు పరచడం అవసరం’ అంటున్నారు పరేఖ్. అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆదాయ పన్ను వసూలు చేస్తుండటం, దానిపై ఆధారపడి కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన విషయం. ప్రత్యక్ష పన్ను చట్టాల ప్రక్షాళన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఈ నెల 31న తన నివేదిక సమర్పించనుంది. -
3 లక్షల డీ రిజిస్టర్డ్ సంస్థలపై దర్యాప్తు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ రద్దు చేసిన మూడు లక్షల సంస్థలపై విచారణ జరపాలని ఆదాయపన్ను శాఖ అధికారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ సంస్థలు పన్ను ఎగవేతతోపాటు పెద్ద నోట్ల రద్దు సమయంలో మనీలాండరింగ్ కార్యకలాపాలకు వేదికగా ఉపయోగపడ్డాయా అన్నది తేల్చాలని కోరింది. దీన్నో ప్రత్యేక కార్యక్రమం కింద చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ సంస్థలకు సంబంధించి బ్యాంకుల ఖాతాల్లో డిపాజిట్లు, ఉపసంహరణలను పరిశీలించాలని కోరింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి సమాచారం సేకరించడంతోపాటు, వీటి ఐటీ రిటర్నులను పరిశీలించాలని, బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించింది. వీటిల్లో అనేక కంపెనీలు పన్ను నేరాలకుపాల్పడి ఉండొచ్చన్న సమాచారం ఉందని, ఇది నిజమని తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. మనీలాండరింగ్ కేసులను ఈడీకి కూడా రిఫర్ చేస్తామని చెప్పారు. ‘‘అసాధారణ లావాదేవీలను గుర్తించినట్టయితే ఎన్సీఎల్టీ ముందు రిజిస్ట్రేషన్ రద్దుకు ముందునాటి పరిస్థితిని పునరుద్ధరించాలని కోరుతూ దరఖాస్తు దాఖలు చేసి, ఐటీ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది’’ అని సీబీడీటీ తెలిపింది. ఓ కాల వ్యవధిలోపు దీన్ని పూర్తి చేయాలని దేశవ్యాప్తంగా ఐటీ అధికారులను సీబీడీటీ కోరింది. ఈ తరహా కంపెనీలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం ఒక విధానంగా పెట్టుకోవాలని సూచించింది. ఒక్కసారి కార్పొరేట్ శాఖ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తే సంబంధిత కంపెనీకి సంబంధించి కీలక వివరాలను పొందడం కష్టమవుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఆర్థిక నివేదికలు, వార్షిక రిటర్నులను సమర్పించని కారణంగా మూడు లక్షల షెల్ కంపెనీల రిజి -
ముందస్తు ఇంటిపన్ను అంచనా..
సాక్షి, కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపాలిటీలకు ఆస్తి పన్నులే ఆధారం.. మున్సిపాలిటీలకు అత్యంత ఆదాయాన్ని తెచ్చిపెట్టే వనరుల్లో ఇంటి పన్ను మొదటిస్థానంలో ఉంటుంది. సాధారణ ఖర్చులతో పాటు శానిటేషన్, పాలనా వ్యవహారాలు, అత్యవసర పనులన్నీ సాధారణ నిధులతోనే చేపడుతుంటారు. అయితే ఆస్తి పన్నులను సకాలంలో రాబట్టుకోవడంలో మున్సిపాలిటీలు విఫలమవుతున్నాయనే విమర్శలున్నాయి. ప్రతియేడు 95శాతం వసూలు చేస్తున్నామని చెబుతున్నా, కొత్త ఇళ్లకు నెంబర్లు వేయకుండా యేళ్ల తరబడి పెండింగ్‌లో పెడుతుండడంతో ఆ ఇళ్ల నుంచి ఆస్తి పన్నులు వసూలు చేసే మార్గమే లేకుండా పోతోంది. ఇలా వేల సంఖ్యలో కొత్తగా నిర్మించిన ఇళ్లు ఇంటి నెంబర్లు లేకుండానే ఉంటున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, యజమాని పట్టింపులేని తనమో కాని ఆస్తి పన్నుల రూపంలో మున్సిపాలిటీ ఆదాయానికి గండిపడుతోంది. ఈ విధానానికి చెక్ పెడుతూ భవనాలకు అనుమతి తీసుకోవడానికి వచ్చినప్పుడు పన్ను అసెస్మెంట్ చేసే ప్రక్రియకు పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది. మున్సిపాలిటీలు ఈ విధానాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేయాలని ఆదేశించింది. పురపాలక శాఖ ఆదేశాల మేరకు కరీంనగర్ నగరపాలక సంస్థలో అధికారులు కొత్త విధానంపై కసరత్తు చేస్తూ ఆన్లైన్ ప్రక్రియకు అనుసంధానం చేసే పనిలో పడ్డారు. నూతన ఆర్థిక సంవత్సరంలో అనుమతితోనే పన్ను అసెస్మెంట్ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. పక్కాగా ఆస్తిపన్ను వసూలు.. ఆస్తి పన్ను పక్కాగా వసూలు చేసేందుకు నగరపాలక సంస్థ కసరత్తు చేస్తోంది. ఇంటి అనుమతులకు వచ్చే సమయంలోనే వీటిని నమోదు చేసి పన్ను మదింపు చేసుకోవడం ద్వారా ఆదాయం పెంచుకునే పనిలో పడింది. ఇప్పటి వరకు ఇంటి నెంబర్ కేటాయిస్తే తప్ప పన్ను వసూలయ్యేది కాదు. అయితే ఈ పన్నుల వసూళ్లలో కొంతమేర అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. నిర్లక్ష్యానికి చెక్ పెడుతూ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉన్న అవకాశాలన్నింటిని ఉపయోగించుకునే పనిలో మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టింది. భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే సమయంలోనే ఆస్తి పన్నును ప్రాథమికంగా అంచనా వేసే విధానంపై దృష్టి సారించింది. భవన నిర్మాణాలు పూర్తయిన వెంటనే పన్ను వసూలు చేసే విధంగా కార్పొరేషన్లో నిబంధనలు అమలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఇంటి నంబర్లు వేసుకోకపోవడం, పాత ఇంటి నంబర్ల మీదనే భవనాలు ఉండడంతో కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయం రాకుండా పోతోంది. అక్రమాలకు పాల్పడితే జరిమానా.. భవన నిర్మాణాలు పూర్తయిన తర్వాత యజమానికి స్వాధీన ధ్రువీకరణ పత్రం జారీ చేస్తున్నారు. అయితే కొత్త విధానం ప్రకారం స్వాధీన ధ్రువీకరణ పత్రం తీసుకునే సమయంలోనే ఏ జోన్ పరిధిలో ఉంటే ఆ జోన్లో ఏ మేర ఆస్తిపన్ను ఉంటుందో దానిని లెక్క కట్టి పన్ను మదింపు చేస్తారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు చేసే వారికి మాత్రం రెండింతల పన్నును విధిస్తారు. కొత్త నిబంధనల ప్రకారం అక్రమ నిర్మాణాలు చేసుకుంటే జీవితకాలం రెండింతల పన్నును కట్టాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి కొత్త విధానం అమలు.. భవన అనుమతులతో పాటు ఆస్తి పన్ను మదింపు విధానం ఏప్రిల్ నుంచి అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీని కోసం కొత్త సాంకేతిక వ్యవస్థను కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు రూపొందిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో భవన అనుమతులు తీసుకోవడం పూర్తిగా ఆన్లైన్లో జరుగుతుంది. ఇది అమలైతే ఆన్లైన్లోనే భవన అనుమతులు, ఆస్తి పన్ను మదింపు, ఇంటి నంబర్ల కేటాయింపు ఒకేసారి జరిగిపోతుంది. ప్రతీ ఒక్క భవనం ఆస్తి పన్ను పరిధిలోకి రావడంతో పాటు కార్పొరేషన్‌కు ఆదాయం కూడా పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
ప్రత్యక్ష పన్నుల నివేదికపై మరింత గడువు?
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం స్థానంలో కొత్తగా ప్రత్యక్ష పన్నుల చట్టం రూపకల్పన కోసం ఏర్పాటైన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ.. ఇందుకు మరింత గడువివ్వాలని కేంద్రాన్ని కోరింది. దీనిపై ఇప్పటిదాకా పురోగతి గురించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వివరించిన సందర్భంగా.. నివేదిక సమర్పించేందుకు మరో 2–3 నెలల గడువు ఇవ్వాలని టాస్క్‌ఫోర్స్ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు 50 ఏళ్ల నుంచి అమలవుతున్న ఆదాయ పన్ను చట్ట నిబంధనలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో 2017 నవంబర్‌లో కేంద్రం ఆరుగురు సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఆరు నెలల వ్యవధిలో 2018 మే 22 నాటికి నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. ఆ తర్వాత ఆగస్టు 22 దాకా పొడిగించింది. అప్పటికీ నివేదిక సిద్ధం కాలేదు. ఈలోగా కమిటీ కన్వీనర్ అరవింద్ మోదీ సెప్టెంబర్ 30న రిటైర్ కావడంతో టాస్క్‌ఫోర్స్ నివేదిక ప్రశ్నార్థకంగా మారింది. -
ఆదాయ పన్ను వివాదాల పరిష్కారానికి 2 కమిటీలు
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ సంబంధ వివాదాల పరిష్కారాలు సూచించేందుకు, అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాల పరిశీలనకు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు కొత్తగా రెండు కమిటీలు ఏర్పాటు చేసింది. ఇవి రెండూ కూడా నెల రోజుల్లోగా నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. వివాదాస్పద అంశాల క్రమబద్ధీకరణ, పరిష్కార మార్గాలు సూచించేందుకు ఏర్పాటైన కమిటీకి ఐటీ కమిషనర్ హోదా అధికారి సారథ్యం వహిస్తారు. ఇందులో ఐదుగురు సభ్యులు ఉంటారు. ఇక పన్ను వివాదాల పరిష్కారానికి అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాల పరిశీలనకు ఏర్పాటైన రెండో కమిటీకి కమిషనర్ స్థాయి అధికారి సారథ్యం వహిస్తారు. ఇందులో కూడా నలుగురు సభ్యులు ఉంటారు. సాధ్యమైనంత వరకూ లిటిగేషన్లను తగ్గించే దిశగా సీబీడీటీ ఇటీవలి కాలంలో పలు చర్యలు తీసుకుంది. ట్రిబ్యునల్స్, కోర్టుల్లో ట్యాక్స్ శాఖ అప్పీలు చేసేందుకు ఉద్దేశించిన పన్ను బాకీల పరిమితిని కూడా గణనీయంగా పెంచింది. అధికారిక గణాంకాల ప్రకారం 2018 ఏప్రిల్ 1 నాటికి ఐటీ అపీల్స్ కమిషనర్ ముందు అప్పీల్స్ రూపంలో రూ. 6.38 లక్షల కోట్ల బకాయిల వివాదాలు పెండింగ్‌లో ఉన్నాయి. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 16 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏప్రిల్–నవంబర్ మధ్య స్థూలంగా 15.7 శాతం ఎగశాయి. విలువలో 6.75 లక్షల కోట్లుగా నమోద య్యాయి. ఆర్థికశాఖ ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఎనిమిది నెలల కాలంలో రిఫండ్స్ విలువ రూ.1.23 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే రిఫండ్స్ విలువ 20.8 శాతం అధికం. మొత్తం ఆర్థిక సంవత్సరంలో రూ.11.50 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు జరపాలన్నది 2018–19 బడ్జెట్ లక్ష్యం. తాజా గణాంకాల్లో ఇందులో 48 శాతానికి చేరినట్లయ్యింది. కాగా ఏప్రిల్–నవంబర్ మధ్య స్థూలంగా కార్పొరేట్ ఆదాయపు పన్ను (సీఐటీ) వసూళ్లు 17.7 శాతం, వ్యక్తిగత పన్ను వసూళ్లు 18.3 శాతం పెరిగాయి. -
నోట్ల రద్దుతో పెరిగిన ఐటీ రిటర్నులు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీ రిటర్న్స్) దాఖలు చేసిన వారి సంఖ్య 6.08 కోట్లకు పెరిగిందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం అధికమని, పెద్ద నోట్ల రద్దు ఇందుకు గణనీయంగా తోడ్పడిందని ఆయన వెల్లడించారు. ‘పన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య పెరగడానికి డీమోనిటైజేషన్ గణనీయంగా తోడ్పడింది. ఈ ఏడాది ఇప్పటిదాకా (2018–19 అసెస్మెంట్ ఇయర్) 6.08 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇది 50 శాతం వృద్ధి. కాబట్టి ఇది డీమోనిటైజేషన్ ప్రభావమేనని చెప్పవచ్చు‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సదస్సులో ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఏ తేదీ నాటికి ఫైలింగ్స్ 6.08 కోట్లకు చేరాయన్నది మాత్రం చంద్ర వెల్లడించలేదు. ‘స్థూలంగా ప్రత్యక్ష పన్ను వృద్ధి రేటు 16.5 శాతంగాను, నికర ప్రత్యక్ష పన్ను వృద్ధి రేటు 14.5 శాతంగాను ఉంది. పన్నులు చెల్లించేవారి సంఖ్య పెరిగేందుకు పెద్ద నోట్ల రద్దు తోడ్పడిందనడానికి ఇదే నిదర్శనం‘ అని చంద్ర తెలిపారు. 2016 నవంబర్‌లో కేంద్రం రూ. 500, రూ. 1,000 నోట్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న నాలుగు గంటల వ్యవధిలోనే ఎలక్ట్రానిక్ రూపంలో పర్మనెంట్ అకౌంటు నంబరు (ఈ–పాన్) జారీ చేసేందుకు సీబీడీటీ కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ‘ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే ఏడాది కాలంలో 4 గంటల వ్యవధిలోనే పాన్‌ను జారీ చేయడానికి అవకాశం ఉంది. ఆధార్ గుర్తింపు సంఖ్యను సమర్పిస్తే చాలు.. 4 గంటల్లో మీ కు ఈ–పాన్ జారీ అవుతుంది‘ అని చంద్ర తెలిపారు. ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యం సాధిస్తాం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్నట్లుగా రూ. 11.5 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధించగలమని చంద్ర ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా మొత్తం ప్రత్యక్ష పన్నులకు సంబంధించి బడ్జెట్ అంచనాల్లో 48 శాతం వసూలైనట్లు చెప్పారు. 2018–19 అసెస్మెంట్ ఇయర్లో సీబీడీటీ ఇప్పటిదాకా 2.27 కోట్ల రీఫండ్లు జారీ చేసిందని, గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇది 50 శాతం అధికమని చంద్ర చెప్పారు. డీమోనిటైజేషన్ అనంతరం కార్పొరేట్ ట్యాక్స్ చెల్లింపుదారుల సంఖ్య 8 లక్షలకు చేరిందన్నారు. గడిచిన నాలుగేళ్లలో పన్ను చెల్లింపు దారుల సంఖ్య 80 శాతం పైగా పెరిగిందని చంద్ర తెలిపారు. ఈ ఏడాది ఇప్పటిదాకా అసెసీలను ట్యాక్స్ ఆఫీసులకు పిలిపించకుండా సుమారు 70,000 పైగా కేసులను ఆన్లైన్లోనే పరిష్కరించినట్లు చెప్పారు. ఐటీ రిటర్నులు దాఖలు చేయని వారికి, ఆదాయాలకు రిటర్నులకు పొంతన లేని వారికి సీబీడీటీ దాదాపు 2 కోట్ల ఎస్ఎంఎస్లు పంపినట్లు చంద్ర చెప్పారు. -
ఏ ఫారం వేయాలో తెలుసా..?
సెక్షన్ 139(1) ప్రకారం ప్రతి వ్యక్తీ గడువు తేదీ లోపల ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలి. ఇక్కడ వ్యక్తి అన్న పదానికి నిర్వచనం చాలా పెద్దది. దాన్నొకసారిచూస్తే... ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ ఏడాది ఏప్రిల్‌లో జారీ చేసిన నోటిఫికేషన్లో ఎవరు ఏ ఫారం దాఖలు చేయాలో తెలిపింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాఖలు చేయాల్సిన అంశాలు ఐటీ విభాగం వెబ్సైట్లో దొరుకుతాయి. దీనిప్రకారం మొత్తం ఏడు ఫారాలుండగా... అందులో వ్యక్తులకు (ఇండివిడ్యుయల్స్) వర్తించే ఫారాలు నాలుగు. ఐటీఆర్–1, 2, 3, 4. ఐటీఆర్–1 ఎవరు దాఖలు చేయాలంటే... ♦ రెసిడెంట్ ఇండియన్ వ్యక్తి... జీతం/పెన్షన్ ఉన్నవారు మాత్రమే దాఖలు చేయగలరు. ఇదికాక ఒక ఇంటిపై ఆదాయం (నష్టం లేకపోతేనే) ఉన్నవారు, వడ్డీ ఆదాయం ఉన్నవారు వేయొచ్చు. ♦మొత్తం ఆదాయం రూ.5 లక్షలు దాటకూడదు. ఈ–ఫైలింగ్ మాత్రమే చేయాలి. అయితే సూపర్ సీనియర్ సిటిజన్లకు, ఆదాయం రూ.5 లక్షల లోపుండి, రిఫండ్ క్లెయిమ్ చేయని వారికి ఈ–ఫైలింగ్ అక్కర్లేదు. ♦ ఇంటిమీద రూ.2 లక్షలలోపు నష్టం ఉండి... అది సర్దుబాటు అయిపోతే సరి. లేకుంటే ఈ ఫారం వేయకూడదు. వ్యయసాయంపై ఆదాయం ఉన్నవారు కూడా ఈ ఫారం వేయకూడదు. ఐటీఆర్–2, 3 ఫారాలకు సంబంధించి... ♦ ఇది రెసిడెంట్లు, నాన్ రెసిడెంట్లు... జీతం/పింఛన్, ఇంటిపై ఆదాయం/మూలధన లాభాలు/ ఇతర ఆదాయాలు ఉన్నవారు వేయొచ్చు. ♦వ్యాపారంపై ఆదాయం ఉన్న వారు వేయకూడదు. రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఇళ్లున్నవారు ఈ ఫారం వేయొచ్చు. ♦ నష్టాన్ని సర్దుబాటు చేసిన తరవాత సర్దుబాటు కాని నష్టాన్ని వచ్చే సంవత్సరం బదిలీ చేసుకునే వారు ఈ ఫారం వేయొచ్చు. ♦ ఆదాయం విషయంలో ఎటువంటి ఆంక్షలు లేవు. ఈ–ఫైలింగ్ తప్పనిసరి. ♦ వ్యక్తి/హిందూ ఉమ్మడి కుటుంబం, వ్యవసాయ ఆదాయం ఉన్నవారు ఈ ఫారం వేయొచ్చు. ♦ ఇతర ఆదాయం ఎంత ఉన్నా.. లాటరీలు, గుర్రపు పందాలపై ఆదాయం ఉన్నా వేయొచ్చు. ♦ మూలధన లాభాలు/నష్టాలున్న వారు వేయొ చ్చుకానీ.. భాగస్వామ్యాలు, స్పెక్యులేషన్ ఆదా యం ఉన్నవారు, ఏజెన్సీ, ఇతరులు వేయరాదు. ♦ డివిడెండు ఆదాయం ఉన్నవారు వేయాలి. విదేశీ ఆస్తులు, ఆదాయం ఉంటే డిక్లేర్ చేయాలి. ఈ రెండు ఫారాలూ దాఖలు చేశాక ♦మాన్యువల్‌గా వేసిన వాళ్లు ముందే సంతకం పెట్టి అధికారుల దగ్గర ఫైల్ చేయాలి. ఈ–ఫైలింగ్ వాళ్లు... ఫైలింగ్ తరవాత ఈ–వెరిఫై చేయాలి. ♦ ఈ– వెరిఫైకి రెండు ఫారాలుంటాయి. మొదటిది డిజిటల్ సంతకం ద్వారా చేయొచ్చు. ఈవీసీ ద్వారా ఓటీపీ పొంది వెరిఫై చేయటం రెండవ పద్ధతి. ♦ఏదైనా మరణం వల్ల ఈ –వెరిఫై కాకపోతే ఎకనాలెడ్జిమెంటు మీద స్వయంగా సంతకం చేసి బెంగళూరుకు పంపాలి. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో తెలుగు రాష్ట్రాల ముందంజ
సాక్షి, హైదరాబాద్: ప్రత్యక్ష పన్ను వసూళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు దూసుకుపోతున్నాయని, జాతీయ స్థాయిలో పన్ను వసూళ్ల వృద్ధి 18 శాతం ఉంటే, ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి 30.9 శాతం నమోదయిందని ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఎస్.పి. చౌదరి చెప్పారు. రెండు రాష్ట్రాలు పన్ను వసూళ్లలో పోటీపడి ముందుకెళుతున్నా యని, రాష్ట్రాల అభివృద్ధికి ఇదో ఉదాహరణ అని అన్నారు. ఈ ఏడాది రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.50 వేల కోట్ల పన్ను వసూళ్లను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫెటాప్సీ) ఆధ్వర్యంలో వర్తక, పరిశ్రమ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై చార్టర్డ్ అకౌంటెంట్లతో ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడారు. ఆదాయాన్ని పన్ను నుంచి ఎలా మినహాయించాలా అనే కోణం కన్నా... సరైన కారణం లేకుండా పన్ను మినహాయింపులు వ్యాపారులకు ఇవ్వకూడదనే ఆలోచనతో ఫెటాప్సీ ప్రతినిధులు పనిచేయాలని ఎస్.పి.చౌదరి సూచించారు. దేశం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలు సంతోషంగా ఉండాలన్నా పన్ను చెల్లింపులు తప్పనిసరని, పన్ను చెల్లించడమంటే జాతి నిర్మాణంలో భాగస్వాములు కావడమే నని ఆయన వ్యాఖ్యా నించారు. పన్ను చెల్లింపు దారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, పన్నుల శాఖ అధికారుల మధ్య వృత్తిప రమైన శత్రుత్వమే తప్ప వ్యక్తిగత శత్రుత్వాలకు తావుండకూడదని అన్నారు. వచ్చే జన్మంటూ ఉంటే తాను చార్టర్డ్ అకౌంటెంట్ కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఫెటాప్సీ కో చైర్మన్ రాందేవ్ భుటాడా అధ్యక్షత వహించగా, ఫెటాప్సీ అధ్యక్షుడు గౌర శ్రీనివాస్, సీనియర్ ఉపాధ్యక్షుడు అరుణ్ లుహరుక, ప్రత్యక్షపన్నుల కమిటీ చైర్మన్ సురేశ్ కుమార్‌జైన్, పలువురు ఆదాయపన్ను శాఖ అధికారులు, ఫెటాప్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రత్యక్ష పన్నుల్లో 15 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలంలో (2017–18, ఏప్రిల్– అక్టోబర్) కేంద్రం రూ.4.39 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులను వసూలు చేసింది. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చిచూస్తే ఇది 15.2 శాతం అధికం. వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నులు ప్రత్యక్ష పన్నుల్లో భాగంగా ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) ప్రత్యక్ష పన్నుల వసూళ్లు లక్ష్యం రూ.9.8 లక్షల కోట్లు. తాజా వసూళ్లు చూసుకుంటే, వసూలు కావాల్సిన లక్ష్యంలో ఈ మొత్తం 44.8 శాతం. కాగా ప్రత్యక్ష పన్నుల స్థూల వసూళ్లు (రిఫండ్స్‌కు సర్దుబాటుకు ముందు) రూ.5.28 లక్షల కోట్లు. 2016 ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంతో పోల్చితే 10.7 శాతం అధికం. అయితే ఈ ఏడు నెలల కాలంలో రిఫండ్స్ విలువ రూ.89,507 కోట్లు. -
4 నెలల్లో కోటికిపైగా ఐటీ ఈ-ఫైలింగ్స్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ద్వారానే ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి చెల్లింపుదారులు అధికంగా మొగ్గు చూపుతున్నట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. గడచిన సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల కాలంలో ఈ-ఫైలింగ్ చేసిన వారి సంఖ్యలో 48% వృద్ధి నమోదు కావడమే కాకుండా వీరి సంఖ్య కోటి దాటిందని ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) ప్రకటించింది. జూలై 31 వరకు ఆన్లైన్ ద్వారా రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 1.03 కోట్లుగా ఉంటే గతేడాది ఇదే కాలానికి 69,63,056 మంది దాఖలు చేసినట్లు సీబీడీటీ పేర్కొంది. ఆన్లైన్ ద్వారా దాఖలు చేసే వారి సంఖ్య పెరగడంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగిందని, నిమిషానికి 2,303 మంది రిటర్నులు దాఖలు చేసినట్లు సీబీడీటీ అధికారులు తెలిపారు. దీంతో చివరకు రిటర్నుల గడువు తేదీని మరో 5 రోజులు పొడిగించడంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 2012-13లో మొత్తంమీద ఆన్లైన్లో రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 2.14 కోట్లుగా ఉంది.