న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలంలో (2017–18, ఏప్రిల్– అక్టోబర్) కేంద్రం రూ.4.39 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులను వసూలు చేసింది. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చిచూస్తే ఇది 15.2 శాతం అధికం. వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నులు ప్రత్యక్ష పన్నుల్లో భాగంగా ఉంటాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) ప్రత్యక్ష పన్నుల వసూళ్లు లక్ష్యం రూ.9.8 లక్షల కోట్లు. తాజా వసూళ్లు చూసుకుంటే, వసూలు కావాల్సిన లక్ష్యంలో ఈ మొత్తం 44.8 శాతం. కాగా ప్రత్యక్ష పన్నుల స్థూల వసూళ్లు (రిఫండ్స్‌కు సర్దుబాటుకు ముందు) రూ.5.28 లక్షల కోట్లు. 2016 ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంతో పోల్చితే 10.7 శాతం అధికం. అయితే ఈ ఏడు నెలల కాలంలో రిఫండ్స్ విలువ రూ.89,507 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment