న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించిన కేంద్ర ఆర్థిక శాఖ.. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విషయంలో తగు సూచనలు చేయాలంటూ పరిశ్రమ వర్గాలు, ట్రేడ్ అసోసియేషన్లను కోరింది. డిమాండ్లతో పాటు వాటి వెనుక గల హేతుబద్ధతను కూడా వివరిస్తూ తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచించింది.
సుంకాల స్వరూపం, పన్నుల రేట్లు మొదలైన వాటిల్లో మార్పులు, చేర్పులకు సంబంధించిన సిఫార్సులను పంపేందుకు నవంబర్ 5 ఆఖరు తేదీ. ప్రత్యక్ష పన్నుల రేట్లను క్రమబద్ధీకరించడంతో పాటు పన్ను ప్రోత్సాహకాలు, డిడక్షన్లు, మినహాయింపులు మొదలైనవి దశలవారీగా తొలగించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో తాజా బడ్జెట్‌పై ఆసక్తి నెలకొంది.
చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!
Comments
Please login to add a commentAdd a comment