
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ రద్దు చేసిన మూడు లక్షల సంస్థలపై విచారణ జరపాలని ఆదాయపన్ను శాఖ అధికారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ సంస్థలు పన్ను ఎగవేతతోపాటు పెద్ద నోట్ల రద్దు సమయంలో మనీలాండరింగ్ కార్యకలాపాలకు వేదికగా ఉపయోగపడ్డాయా అన్నది తేల్చాలని కోరింది. దీన్నో ప్రత్యేక కార్యక్రమం కింద చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ సంస్థలకు సంబంధించి బ్యాంకుల ఖాతాల్లో డిపాజిట్లు, ఉపసంహరణలను పరిశీలించాలని కోరింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి సమాచారం సేకరించడంతోపాటు, వీటి ఐటీ రిటర్నులను పరిశీలించాలని, బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించింది. వీటిల్లో అనేక కంపెనీలు పన్ను నేరాలకుపాల్పడి ఉండొచ్చన్న సమాచారం ఉందని, ఇది నిజమని తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
మనీలాండరింగ్ కేసులను ఈడీకి కూడా రిఫర్ చేస్తామని చెప్పారు. ‘‘అసాధారణ లావాదేవీలను గుర్తించినట్టయితే ఎన్‌సీఎల్‌టీ ముందు రిజిస్ట్రేషన్ రద్దుకు ముందునాటి పరిస్థితిని పునరుద్ధరించాలని కోరుతూ దరఖాస్తు దాఖలు చేసి, ఐటీ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది’’ అని సీబీడీటీ తెలిపింది. ఓ కాల వ్యవధిలోపు దీన్ని పూర్తి చేయాలని దేశవ్యాప్తంగా ఐటీ అధికారులను సీబీడీటీ కోరింది. ఈ తరహా కంపెనీలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం ఒక విధానంగా పెట్టుకోవాలని సూచించింది. ఒక్కసారి కార్పొరేట్ శాఖ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తే సంబంధిత కంపెనీకి సంబంధించి కీలక వివరాలను పొందడం కష్టమవుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఆర్థిక నివేదికలు, వార్షిక రిటర్నులను సమర్పించని కారణంగా మూడు లక్షల షెల్ కంపెనీల రిజి
Comments
Please login to add a commentAdd a comment