సెక్షన్ 139(1) ప్రకారం ప్రతి వ్యక్తీ గడువు తేదీ లోపల ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలి. ఇక్కడ వ్యక్తి అన్న పదానికి నిర్వచనం చాలా పెద్దది. దాన్నొకసారిచూస్తే...
ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ ఏడాది ఏప్రిల్లో జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఎవరు ఏ ఫారం దాఖలు చేయాలో తెలిపింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాఖలు చేయాల్సిన అంశాలు ఐటీ విభాగం వెబ్‌సైట్లో దొరుకుతాయి. దీనిప్రకారం మొత్తం ఏడు ఫారాలుండగా... అందులో వ్యక్తులకు (ఇండివిడ్యుయల్స్) వర్తించే ఫారాలు నాలుగు. ఐటీఆర్–1, 2, 3, 4.
ఐటీఆర్–1 ఎవరు దాఖలు చేయాలంటే...
♦ రెసిడెంట్ ఇండియన్ వ్యక్తి... జీతం/పెన్షన్ ఉన్నవారు మాత్రమే దాఖలు చేయగలరు. ఇదికాక ఒక ఇంటిపై ఆదాయం (నష్టం లేకపోతేనే) ఉన్నవారు, వడ్డీ ఆదాయం ఉన్నవారు వేయొచ్చు.
♦మొత్తం ఆదాయం రూ.5 లక్షలు దాటకూడదు. ఈ–ఫైలింగ్ మాత్రమే చేయాలి. అయితే సూపర్ సీనియర్ సిటిజన్లకు, ఆదాయం రూ.5 లక్షల లోపుండి, రిఫండ్ క్లెయిమ్ చేయని వారికి ఈ–ఫైలింగ్ అక్కర్లేదు.
♦ ఇంటిమీద రూ.2 లక్షలలోపు నష్టం ఉండి... అది సర్దుబాటు అయిపోతే సరి. లేకుంటే ఈ ఫారం వేయకూడదు. వ్యయసాయంపై ఆదాయం ఉన్నవారు కూడా ఈ ఫారం వేయకూడదు.
ఐటీఆర్–2, 3 ఫారాలకు సంబంధించి...
♦ ఇది రెసిడెంట్లు, నాన్ రెసిడెంట్లు... జీతం/పింఛన్, ఇంటిపై ఆదాయం/మూలధన లాభాలు/ ఇతర ఆదాయాలు ఉన్నవారు వేయొచ్చు.
♦వ్యాపారంపై ఆదాయం ఉన్న వారు వేయకూడదు. రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఇళ్లున్నవారు ఈ ఫారం వేయొచ్చు.
♦ నష్టాన్ని సర్దుబాటు చేసిన తరవాత సర్దుబాటు కాని నష్టాన్ని వచ్చే సంవత్సరం బదిలీ చేసుకునే వారు ఈ ఫారం వేయొచ్చు.
♦ ఆదాయం విషయంలో ఎటువంటి ఆంక్షలు లేవు. ఈ–ఫైలింగ్ తప్పనిసరి.
♦ వ్యక్తి/హిందూ ఉమ్మడి కుటుంబం, వ్యవసాయ ఆదాయం ఉన్నవారు ఈ ఫారం వేయొచ్చు.
♦ ఇతర ఆదాయం ఎంత ఉన్నా.. లాటరీలు, గుర్రపు పందాలపై ఆదాయం ఉన్నా వేయొచ్చు.
♦ మూలధన లాభాలు/నష్టాలున్న వారు వేయొ చ్చుకానీ.. భాగస్వామ్యాలు, స్పెక్యులేషన్ ఆదా యం ఉన్నవారు, ఏజెన్సీ, ఇతరులు వేయరాదు.
♦ డివిడెండు ఆదాయం ఉన్నవారు వేయాలి. విదేశీ ఆస్తులు, ఆదాయం ఉంటే డిక్లేర్ చేయాలి.
ఈ రెండు ఫారాలూ దాఖలు చేశాక
♦మాన్యువల్‌గా వేసిన వాళ్లు ముందే సంతకం పెట్టి అధికారుల దగ్గర ఫైల్ చేయాలి. ఈ–ఫైలింగ్ వాళ్లు... ఫైలింగ్ తరవాత ఈ–వెరిఫై చేయాలి.
♦ ఈ– వెరిఫైకి రెండు ఫారాలుంటాయి. మొదటిది డిజిటల్ సంతకం ద్వారా చేయొచ్చు. ఈవీసీ ద్వారా ఓటీపీ పొంది వెరిఫై చేయటం రెండవ పద్ధతి.
♦ఏదైనా మరణం వల్ల ఈ –వెరిఫై కాకపోతే ఎకనాలెడ్జిమెంటు మీద స్వయంగా సంతకం చేసి బెంగళూరుకు పంపాలి.
ఏ ఫారం వేయాలో తెలుసా..?
Published Mon, Jul 2 2018 12:19 AM | Last Updated on Mon, Jul 2 2018 12:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment