ఆర్‌బీఐ ఇప్పటికే పసిడి రుణాల మంజూరు, పంపిణీకి సంబంధించి ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ కంపెనీపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా షేర్లు, డిబెంచర్లపై ఎలాంటి రుణాలనూ అందించకుండా జేఎం ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిషేధం విధించింది.
ఈ ఆంక్షలు వెంటనే అమల్లోకి వస్తాయని ఆర్‌బీఐ వెల్లడించింది. ఐపీఓ రుణాల మంజూరు, పంపిణీకీ ఇది వర్తిస్తుందని పేర్కొంది. కంపెనీ ప్రస్తుతం ఇచ్చిన రుణాలను వసూలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. ఐపీఓ, ఎన్‌సీడీల కోసం రుణాలను ఇవ్వడంలో కొన్ని తీవ్ర లోపాలను గుర్తించిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి జేఎం ఫైనాన్షియల్ సమర్పించిన కొన్ని నివేదికలను పరిశీలించాక, ఈ చర్యలు తీసుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment