ముంబై: ఊహించని విధం గా రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) దేశంలోనే పేరెన్నికగన్న చార్టర్డ్ అకౌం టెంట్ సంస్థలలో ఒకటైన హరిభక్తి అండ్ కో ఎల్ ఎల్‌పీపై రెండేళ్ల నిషేధాన్ని విధించింది. 2022 ఏప్రిల్ 1 నుంచి నిషేధం అమల్లోకిరానుంది. దీంతో నియంత్రణ సంస్థల పరిధిలోకి వచ్చే ఏ కంపెనీ తరఫునా ఆడిట్ అసైన్‌మెంట్లను చేపట్టేందుకు వీలుండదు. అయితే ఈ ఆర్థిక సంవ త్సరానికి(2021–22) ఆడిట్ అసైన్‌మెంట్లను పూర్తి చేయడంలో కంపెనీపై ఎలాంటి ప్రభావమూ ఉండదని ఆర్‌బీఐ పేర్కొంది. శ్రేయీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్(ఎస్‌ఐఎఫ్‌ఎల్)కు హరిభక్తి అండ్ కో ఆడిటర్‌గా వ్యవహరిస్తోంది.
గత వారం ఎస్‌ఐఎఫ్‌ఎల్ బోర్డును రద్దు చేయడంతోపాటు దివాలా చట్ట చర్యలకు ఆర్‌బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా నిషేధాజ్ఞలకు ప్రాధాన్యత ఏర్పడింది. వ్యవస్థాగతంగా ప్రాధాన్యత కలిగిన ఎన్‌బీఎఫ్‌సీల చట్టబద్ధ ఆడిట్ నిర్వహణలో ఆర్‌బీఐ నిబంధనలను పాటించకపోవడంతో నిషేధాన్ని విధించినట్లు కేంద్ర బ్యాంకు పేర్కొంది. ఇంతక్రితం 2019లో గ్లోబల్ ఆడిటింగ్ సంస్థ ఈవై కు అనుబంధ సంస్థ ఎస్‌ఆర్ బట్లిబాయ్ అండ్ కోపై ఆర్‌బీఐ ఏడాది కాలపు నిషేధాన్ని విధించింది. కాగా.. శ్రేయీ గ్రూప్ కంపెనీలలో కొన్ని కేసులకు సంబంధించి మొండిబకాయిలు(ఎన్‌పీఏలు)గా మారిన ఖాతాలను ఓవైపు మూసివేస్తూ.. మరోపక్క మారుపేర్లతో సరికొత్తగా రుణాలు మంజూరు చేయడం వంటి అవకతవకలు నమోదైనట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment