
సాక్షి, మైసూరు(కర్ణాటక): మండ్యకు చెందిన సౌమ్య (29), చామరాజనగరకు చెందిన ప్రసాద్(30) అనే ఇద్దరిని మైసూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ ఓ ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి సురేష్‌తో పరిచయం పెంచుకున్నారు. తమ బంగారం వేరొకరి వద్ద కుదువలో ఉందని మాయమాటలు చెప్పారు. అంతటితో ఆగకుండా డబ్బులు కావాలని కోరారు.
మీరు డబ్బులిస్తే విడిపించి మీకే అమ్ముతామని సురేష్‌ను నమ్మించి రూ.1.75 లక్షలను తీసుకున్నారు. తరువాత ఇద్దరూ మొబైల్‌ఫోన్లను స్విచ్చాఫ్ చేయడంతో బాధితుడు సాలిగ్రామ పోలీసులకు ఫిర్యాదు చేయగా, గాలించి ఇద్దరినీ అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment