cheats
-
గులాబ్ జామూన్‌తో మాజీ మంత్రికి చిక్కులు
దొడ్డబళ్లాపురం: శ్వేతా గౌడ అనే మహిళ మాజీ మంత్రి పేరు చెప్పుకుని బెంగళూరు కమర్షియల్ వీధిలో ఓ జ్యువెలరీ షాప్ నుంచి రూ. 2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు తీసుకుని డబ్బు ఇవ్వకుండా టోకరా ఇచ్చిన కేసు మలుపు తిరిగింది. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఈ కేసులో నోటీసులు అందుకున్న మాజీ మంత్రి వర్తూరు ప్రకాశ్ భారతినగర పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిందితురాలు.. ఆయన ముద్దుగా పిలుచుకునే గులాబ్ జామూన్.. శ్వేతాగౌడ ఇచ్చిన మొత్తం రూ.12.50 లక్షల విలువైన నగదు, గిఫ్ట్‌లు, బంగారు నగలను పోలీసు అధికారులకు అప్పగించారు. శ్వేతగౌడ ఇలా చేస్తుందని కలలో కూడా ఊహించలేదని, ఆమె అడగకుండానే కానుకలు ఇచ్చిందని పోలీసులకు వర్తూరు తెలిపారు. తన పేరు చెప్పగానే జ్యువెలరీ షాప్ యజమాని కోట్ల విలువైన నగలను ఆమెకు ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు.ఫేస్బుక్లో పరిచయమై..అయితే శ్వేతా గౌడ, వర్తూరు ప్రకాశ్ ఇద్దరూ సన్నిహితంగా ఉన్నారని, అనేకసార్లు మైసూరు చాముండి కొండకు వెళ్లారని, తిరుమల కొండకు వెళ్లడానికి టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్టు తెలిసింది. ఇద్దరూ కలిసి మూడు నగల షాపుల్లో షాపింగ్ చేసినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. 6 నెలల క్రితం శ్వేతాగౌడ వర్తూరుకు ఫేస్బుక్ ద్వారా పరిచయమైందని, తరువాత వాట్సాప్, మెసెంజర్లలో ఘాటుగా చాటింగ్ చేసుకున్నారని, శ్వేతగౌడ మొబైల్ నంబర్‌ను గులాబ్ జామూన్ అని వర్తూరు ప్రకాశ్ సేవ్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు.మరో ఆభరణాల మోసం..యశవంతపుర: మాజీ ఎంపీ డికే సురేశ్ చెల్లినని చెప్పుకొంటూ మహిళ ఒకరు 14.6 కేజీల బంగారాన్ని కొనుగోలు చేసి మోసం చేసిన ఘటన బెంగళూరు ఆర్ఆర్ నగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఐశ్యర్య గౌడ, నటుడు ధమేంద్ర, హరీశ్ అనే వ్యక్తులపై కేసు నమోదైంది. ఐశ్వర్య.. ఓ నగల దుకాణానికి వెళ్లి 11 సార్లు బంగారాన్ని కొనుగోలు చేసి మాజీ ఎంపీ పేరు చెప్పి వెళ్లిపోయింది. దీంతో దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
హైదరాబాద్ లో బయటపడ్డ నిత్య పెళ్లికొడుకు బండారం
-
పంచాయతీలకు ప్రభుత్వం ట్విస్ట్
-
వాలంటీర్ల వాట్సాప్ గ్రూపులన్నీ తొలగించాలని చంద్రబాబు సర్కార్ ఆదేశం
-
శివరామరాజుకు బీజేపీ వెన్ను పోటు..
-
విస్మయం కలిగిస్తోన్న టిడిపి ప్రకటన
-
నమ్మిన నేతలకే వెన్నుపోటు..
-
బోడుప్పల్ లో రూ.10 కోట్ల కుచ్చుటోపి
-
మట్టికుండ బంగారమైతదని.. రూ.2లక్షల50వేలు కాజేసిన ఘనుడు
సాక్షి, దస్తురాబాద్: మట్టికుండ బంగారమైతదని నమ్మబలికి డబ్బులు కాజేశాడు ఓ ఘనుడు. మోసపోయిన బాధితుడు తిరిగి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో తప్పించుకునేందుకు దుప్పిని హతమార్చి దాని మాంసాన్ని అతడి చేనులో ఉంచి కేసు నమోదు చేయించాలని ప్లాన్ చేశాడు. చివరికి గ్రామ పెద్దల ఫిర్యాదుతో పోలీసులకు దొరికిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను నిర్మల్ డీఎస్పీ జీవన్‌రెడ్డి మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించాడు. మండలంలోని ఆకొండపేట గ్రామానికి చెందిన జాడి బుచ్చన్న అదే గ్రామానికి చెందిన మావుకారి రాజేశ్ ఇంటికి ఏప్రిల్ 29 రాత్రి ఒక మూటలో మట్టి కుండను తీసుకెళ్లాడు. దానిని ఓ మూలన పాతిపెట్టాడు. నెల రోజుల వరకు దానిని ఎవరూ ముట్టవద్దని, నెల తరువాత తానే స్వయంగా తీస్తానని నమ్మబలికాడు. మట్టికుండ బంగారు కుండగా మారాలంటే రూ.2లక్షల 50వేలు ఖర్చు అవుతాయని చెప్పాడు. ఈ విషయం నమ్మిన రాజేశ్ అట్టి డబ్బులను ముట్టజెప్పాడు. నెల రోజులు దాటిన తరువాత బుచ్చన్న ఇంటికి వెళ్లి కుండను బయటకుతీయాలని కోరాడు. రేపుమాపు అంటూ ఆరు నెలలు గడిపాడు. తను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని రాజేశ్ ఒత్తిడి చేశాడు. అయినా డబ్బులు ఇవ్వకపోవడంతో గ్రామ పెద్దలకు విషయం చెప్పాడు. బుచ్చన్నను గ్రామపంచాయతీకి పిలిచి విషయం అడిగారు. ఈ నెల 11న చర్చించుకుందామని చెప్పి బుచ్చన్న వెళ్లిపోయాడు. గ్రామ పెద్దలు ఎలాగైనా డబ్బులు కట్టిస్తారని ఆలోచన చేసి ఈ నెల 10వ తేదీన గ్రామ సమీపంలోని అడవిలో అదే గ్రామానికి చెందిన ముష్కం శ్రీనివాస్‌తో కలిసి దుప్పిని హతమార్చాడు. ఆ దుప్పి మాంసాన్ని కోసేందుకు గోండుగుడా గ్రామానికి చెందిన సిడాం సోముకు అప్పజెప్పాడు. అదేరోజు రాత్రి ఆ మాంసాన్ని మావుకారి రాజేష్ పంట చేనులో ఉంచి మరుసటి రోజు హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు ఫోన్‌చేసి రాజేష్ పంటచేనులో వేట మాంసం ఉందని, అతడిపై ఎలాగైనా అటవీశాఖ అధికారులతో కేసు నమోదు చేయించాలని కోరాడు. అందుకు రూ.10 వేలు ఇస్తానని తెలిపాడు. దీంతో హెడ్ కానిస్టేబుల్ అటవీశాఖ అధికారి అలీమ్కు సమాచారం ఇచ్చాడు. అతడు సంఘటనా స్థలానికి చేరుకుని మాంసాన్ని స్వాధీనం చేసుకుని పంటచేను యజమాని రాజేష్, కౌలుదారుడు కుక్కరికారి లక్ష్మయ్యను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆకొండపేట గ్రామపెద్దలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి గ్రామంలో గుప్త నిధుల పేరుతో జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న బుచ్చన్న, దుప్పిని వేటాడేందుకు సహకరించిన శ్రీనివాస్‌ను మంగళవారం అరెస్టు చేశారు. అలాగే హెడ్‌కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట సీఐ అజయ్‌బాబు, ఎస్సై జ్యోతిమణి ఉన్నారు. ఈ విషయమై అటవీశాఖ అధికారులను ఫోన్లో వివరణ కోరగా పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని చెప్పారు. (చదవండి: హైదరాబాద్: కంచే చేను మేసింది.. బ్యాంక్ ఫ్రాడ్ కేసులో సిబ్బంది సహా పదిమందికి కఠిన శిక్షలు) -
భర్తతో విడిపోయి మరో వ్యక్తితో సహజీవనం.. చివరికి షాకింగ్ ట్విస్ట్
కాకినాడ క్రైం: సహజీవనం చేసిన వ్యక్తి పలు దఫాలుగా రూ.1.5 లక్షలు తీసుకుని తనను మోసం చేశాడని పేర్కొంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ సాంబమూర్తినగర్‌కు చెందిన హీనా ఖాతున్ భర్తతో విడిపోయి వేరుగా ఉంటోంది. పాయరోటీ బండి పెట్టి జీవనం సాగిస్తోంది. దుమ్ములపేటలో నివాసం ఉంటున్న విజయభాస్కర్ 18 నెలల క్రితం ఆమెకు పరిచయమయ్యాడు. చదవండి: నిత్య పెళ్లికూతురు.. ఒకరు కాదు ఏకంగా ఆరుగురితో ఆ పరిచయం వారి సహజీవనానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో విజయభాస్కర్ అవసరాల కోసం పలు దఫాలుగా ఖాతున్ రూ.1.5 లక్షలు ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం నుంచి విజయ భాస్కర్ తనకు కనిపించకుండా పరారయ్యాడని పేర్కొంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. కాకినాడ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
యువతులే అతని టార్గెట్.. వెలుగులోకి నిత్య పెళ్లి కొడుకు లీలలు
నరసరావుపేట టౌన్(పల్నాడు జిల్లా): అమాయకులైన యువతులే అతని టార్గెట్.. పెళ్లి పేరుతో వారికి ఆశల వలవేసి నగదు దోచుకోవటం అతనికి వెన్నతో పెట్టిన విద్య.. అతని మాయమాటలు నమ్మి నరసరావుపేటకు చెందిన యువతి భారీ మొత్తంలో నగదును కోల్పోయింది. వివరాలలోకి వెళితే.. రామిరెడ్డిపేటకు చెందిన యువతికి గతంలో వివాహం కాగా భర్తతో విడాకులు పొందింది. మరో వివాహం చేసుకునేందుకు జీవన్సాథీ మ్యాట్రిమోని ద్వారా ప్రయత్నించే క్రమంలో వైజాగ్‌కు చెందిన కొచ్చర్ల శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడింది. చదవండి: ప్రియుడితో పరార్.. ప్రాణం తీసిన వివాహేతర సంబంధం వివాహం చేసుకుని అమెరికా వెళ్దామని నమ్మించాడు. వీసా పొందాలంటే ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు ఉండాలని యువతిని నమ్మబలికాడు. ఆమె తన ఖాతా ద్వారా శ్రీకాంత్ చెప్పిన అకౌంట్‌కు విడతల వారీగా రూ.48 లక్షలు బదిలీ చేసింది. పెళ్లి చూపులకు కుటుంబసభ్యులతో కలసి వస్తానని చెప్పి రాకుండా కాలయాపన చేస్తున్నాడు. నెలలు గడుస్తున్నా వీసా రాకపోవటంతో అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆరా తీయడంతో అసలు విష యం వెలుగుచూసింది. మోసపోయానని గ్రహించిన బాధితురాలు శుక్రవారం వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన సీఐ అశోక్ కుమార్ దర్యాప్తు చేపట్టారు. వెలుగులోకి నిత్య పెళ్లి కొడుకు లీలలు నిందితుడి ఫోన్ నంబరు ఆధారంగా అతని కోసం వెళ్లిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. నిందితుడు విజయవాడకు చెందిన వంశీకృష్ణగా గుర్తించారు. శ్రీకాంత్ పేరుతో ఫేక్ ఐడీ సృష్టించటంతో పాటు తన ఫొటోను మార్చి మ్యాట్రిమోనీ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్నారు. మ్యాట్రిమోని ద్వారా పరిచయం చేసుకుని ఇదే తరహాలో ప్రకాశం జిల్లాకు చెందిన యువతిని మోసం చేసి పెద్ద మొత్తంలో నగదు కాజేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఇటీవల అరెస్టు చేసినట్లు తెలుసుకున్నారు. దీంతో నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
స్నేహితుడి వంచన... మందు కొట్టి మరీ రూ. 75 లక్షలు చోరీ
మలక్‌పేట: అర్థరాత్రి వరకు కలిసి మద్యం తాగి స్నేహితుని ఇంట్లో రూ. 75 లక్షల నగదు దోచుకెళ్లాడు ఓవ్యక్తి. ఈ సంఘటన శనివారం మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారి సాయిప్రకాశ్‌రెడ్డి మూసారంబాగ్ డివిజన్ సలీంనగర్ పద్మావతి రెసిడెన్సీలో ఉంటున్నాడు. గోవాలో ఉంటున్న అతని ఫ్రెండ్ ఫిరోజ్ ఈనెల 29న సలీంనగర్‌కు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఇంట్లో మద్యం సేవించారు. తరువాత ఫిరోజ్ పబ్‌కి వెళ్దామని అంటే రాత్రి 10 గంటలకు కొత్తపేటలోని ఓ పబ్‌కి వెళ్ళారు. పబ్‌లో పాత ఫ్రెండ్ రాజేష్ కలిశాడు. రాత్రి 1.30 గంటలకు సాయిప్రకాశ్‌రెడ్డి, ఫిరోజ్, రాజేష్, రాజేష్ స్నేహితుడు నలుగురు కలిసి మద్యం తాగడానికి సలీంనగర్‌కు వచ్చారు. ఫిరోజ్ ఒక గదిలో పడుకున్నాడు. మిగిలిన ముగ్గురూ కలిసి హాల్లో మద్యం తాగుతుండగా.. రాజేష్ నిద్రవస్తుందని చెబితే సాయిప్రకాశ్‌రెడ్డి అతనిని మరొగదిలోకి తీసుకెళ్లి పడుకోమని చెప్పి వాష్‌రూమ్‌కు వెళ్లాడు. వాష్ రూమ్ నుంచి బయటికి వచ్చేసరికి మంచంపై ఖాళీ బ్యాగు పడి ఉండటాన్ని గమనించాడు. రాజేష్, అతని ఫ్రెండ్ ఇంట్లో లేరు. ఇంట్లో పెట్టిన రూ. 75 లక్షల నగదు ఉన్న బ్యాగ్ కన్పించలేదు. వెంటనే కిందకి వెళ్లి చూడగా రాజేష్ కనిపించాడు. అతన్ని ఆపి అడుగుతుండగా గేట్ దూకిపారిపోయాడు. భూమి అమ్మిన రూ.75 లక్షలు నల్లరంగు బ్యాగులో ఉండగా రాజేష రాజేష్ ఫ్రెండ్ దొంగతనం చేశారని బాధితుడు సాయిప్రకాశ్‌రెడ్డి శనివారం మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. (చదవండి: కళాశాల విద్యార్థికి ఉగ్రవాదులతో లింక్!) -
పేమెంట్ అయినట్టు మెసేజ్ వస్తుంది.. చెక్ చేసుకోకుండానే ఓకే చెప్తే అంతే!
‘ఇటీవల వనస్థలిపురంలో ఓ మొబైల్ షాప్‌లోకి ఇద్దరు యువకులు వచ్చారు. ఒకట్రెండు ఉత్పత్తులను కొనుగోలు చేయగా.. రూ.2,800 బిల్లు అయింది. స్పూఫింగ్ పేటీఎం యాప్ నుంచి షాప్ వివరాలను నమోదు చేయగానే యజమానికి బిల్లు చెల్లించినట్లు సందేశం వచ్చింది. దీంతో యజమాని తన ఖాతాలో చెక్ చేసుకోకుండానే ఓకే అనడంతో ఆ ఇద్దరు కస్టమర్లు అక్కణ్నుంచి వెళ్లిపోయారు. తాపీగా బ్యాంక్ ఖాతాలో చూసుకుంటే బిల్లు జమ కాలేదు. మెసేజ్ వచ్చింది కదా నగదు క్రెడిట్ కాకపోవటమేంటని బ్యాంకులో ఆరా తీస్తే.. అది నకిలీ మెసేజ్ అని తేల్చేశారు. దీంతో యజమాని పోలీసులను ఆశ్రయించాడు.. ఇలా ఒకరిద్దరు కాదు నగరంలో రోజుకు పదుల సంఖ్యలోనే రిటైల్ యజమానులకు స్పూఫింగ్ పేమెంట్ యాప్‌లతో టోపీ పెడుతున్నారు కొందరు వినియోగదారులు’ సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు తర్వాత నుంచి నగదు లభ్యత తగ్గడంతో చాలా మంది డిజిటల్ చెల్లింపుల వైపు మొగ్గుచూపుతున్నారు. కరోనా మహమ్మారితో ఈ వినియోగం మరింత పెరిగింది. చిన్న కిరాణా షాపులు, కూరగాయల బండ్ల మీదా పీటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్ అప్లికేషన్లు కనిపిస్తున్నాయి. యాప్ పేమెంట్ వినియోగం విరివిగా అందుబాటులోకి రావటంతో మోసగాళ్లు వీటినీ అవకాశంగా మలుచుకుంటున్నారు. కస్టమర్ కేర్ నంబర్లు, వెబ్సైట్లు, ఈ– మెయిల్ ఐడీలతో పాటూ ఈ– వ్యాలెట్లు కూడా స్పూఫింగ్ చేస్తున్నారు. చదవండి: కార్వీ ఎండీ పార్థసారథి అరెస్ట్ ఎలా చేస్తారంటే.. ►స్పూఫింగ్ యాప్‌లను మొబైల్ అప్లికేషన్ ఫ్లాట్‌ఫామ్‌ల నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. షాపింగ్ చేశాక కొనుగోలుదారుల మొబైల్లోని స్పూఫింగ్ ఈ– వ్యాలెట్‌లో షాప్ పేరు, ఫోన్ నంబర్, అమౌంట్ వంటి వివరాలను నమోదు చేసి ఎంటర్ చేస్తారు. దీంతో షాప్ యజమాని ఫోన్ నంబర్‌కు పేమెంట్ పూర్తయినట్లు నకిలీ నోటిఫికేషన్ వెళుతుంది. వాస్తవానికి యజమాని బ్యాంక్ ఖాతాలో మాత్రం నగదు జమ కాదు. ► బ్యాంక్ అకౌంట్‌ను ఓపెన్ చేసి డబ్బు జమ అయిందో లేదో యజమాని చూసుకునే సమయం ఉండదు. ఎందుకంటే వేరే కస్టమర్లు ఉండటంతో బిజీగా ఉండిపోతారు. తీరా ఖాళీ సమయంలో అకౌంట్లో చూసుకుంటే ఆ నోటిఫికేషన్ తాలుకు పేమెంట్ జమై ఉండదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకుంటాడు. ఒకవేళ షాప్ యజమాని చూసుకున్నా.. డేటా, సాంకేతిక సమస్య వల్ల ఖాతాలో అప్డేట్ కావడంలో ఆలస్యం అవుతుందని ఈ కేటుగాళ్లు యజమానిని ఒప్పిస్తున్నారు. చదవండి: దేశమంతటా మన పథకాలే సౌండ్ బాక్స్‌తో పరిష్కారం.. నకిలీ లావాదేవీలకు సౌండ్ బాక్స్‌తో చెక్ పెట్టొచ్చని పేటీఎం నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా పేటీఎంకు 2.3 కోట్ల మంది వర్తకులు పార్ట్నర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. పేమెంట్ జరిగిందా లేదా అని తక్షణమే తెలుసుకునేందుకు సౌండ్ బాక్స్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కానింగ్, వాలెట్, డెటిట్, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ యాప్‌లు ఏ మాధ్యమం ద్వారా అయినా సరే పేమెంట్ చేయగానే, ఖాతాలో నగదు జమ కాగానే లావాదేవీల వివరాలు సౌండ్ బాక్స్‌లో వాయిస్ రూపేణా వినిపిస్తాయి. దుకాణా యజమానులు ప్రతి లావాదేవీ వివరాలు ప్రతిరోజూ లేదా వారానికోసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేమెంట్ పూర్తయ్యాక బ్యాంక్ ఖాతాలో అమౌంట్ జమయ్యేందుకు ఎంత సమయం పట్టిందనే వివరాలనూ తెలుసుకోవచ్చు. -
నన్ను అడ్డుకుంటే పొడుచుకుంటా..
సాక్షి, నవాబుపేట(మహబూబ్‌నగర్): తనను మోసం చేశాడని మండలంలోని చౌటపల్లిలో ఆర్మీ జవాన్ ఇంటి ఎదుట నిరసనకు దిగిన ప్రియురాలి నిరసన ఆదివారం శృతిమించటంతో గందరగోళం నెలకొంది. చౌటపల్లికి చెందిన తిలక్‌గౌడ్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా తనను మోసం చేశాడని హైదరాబాద్‌కు చెందిన పూజ అతని ఇంటి ఎదుట నిరసనకు దిగింది. కాగా రెండ్రోజుల క్రితం ఎవరూ లేకపోవటంతో ఆమె నిరసన విరమించింది. తిరిగి ఆదివారం ప్రియుడి ఇంటి ఎదుట మరోసారి నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా తనకు న్యాయం చేయాలని కోరింది. తన నిరసనను ఎవరైనా అడ్డుకుంటే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగింది. దీంతో చుట్టు పక్కలవారు, ప్రియుడి బంధువులు ఆమెను ఆపేందుకు ప్రయత్నించిన తరుణంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. అలాగే ఆమె ప్రతి ఘటించటంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో నిరసనకు దిగిన ప్రియురాలిని జవాన్ బంధువులు చితకబాదినట్లు సమాచారం. కత్తి తీ సుకుని రావటంతో ఆమెను ఆడ్డుకున్న తరుణంలో ఇద్దరికి గాయాలు అయినట్లు సమాచారం. కాగా ఈ విషయంలో ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, దీనికి గల పూర్వపరాలు పరిశీలించి కేసు దర్యాప్తు చే స్తామని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. కాగా బాధితురాలు గతంలోనే తనను మోసం చేశాడన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్ఐ వివరించారు. చదవండి: మూడు నెలలుగా సహజీవనం.. మనస్పర్థల కారణంగా ఆత్మహత్య -
ఇన్‌స్టాలో పరిచయం: బాలిక ‘ప్రేమ చదివింపులు’.. చివరకు..
సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): సోషల్ మీడియాలో పరిచయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో తెలిపే ఉదంతం ఇది. ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన యువకుడి ప్రేమ మాటలు నమ్మిన బాలిక విడతల వారిగా 36 సవర్ల నగలు, రూ.లక్ష నగదు చెల్లించుకుంది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. తిరువళ్లూరు జిల్లా విష్ణువాక్కం గ్రామానికి చెందిన బాలిక(16) తిరువళ్లూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్లస్‌టూ చదువుతోంది. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ తరగతుల కోసం తండ్రి స్మార్ట్ ఫొన్ కొనిచ్చారు. క్లాసులు ముగిసిన తర్వాత సోషల్ మీడియాకు అలవాటు పడింది. ఈ క్రమంలో ఇన్‌స్ట్రాగామ్ ద్వారా మనవాలనగర్‌కు చెందిన రేవంత్ పరిచయమయ్యాడు. మాయ మాటలు చెబుతూ ప్రేమపేరుతో బాలికను బుట్టలో వేసుకున్నాడు. అమ్మకు ఆరోగ్యం సరిగ్గా లేదని, చదువు కోసమని వివిధ సందర్భాల్లో బాలిక నుంచి 32 సవర్ల నగలు, రూ. లక్ష నగదు వసూలు చేసి చివరికి ఫోన్ స్విచ్ఆఫ్ చేశాడు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బాలిక తండ్రి వెంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రేవంత్ కోసం గాలిస్తున్నారు. ఆన్లైన్ తరగతులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కనిపెట్టి ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చదవండి: ఆర్ఎంపీ క్లినిక్‌లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం -
వామ్మో.. కిలాడీ గ్యాంగ్.. ఫైనాన్స్ ఉద్యోగికి మాయమాటలు చెప్పి..
సాక్షి, మైసూరు(కర్ణాటక): మండ్యకు చెందిన సౌమ్య (29), చామరాజనగరకు చెందిన ప్రసాద్(30) అనే ఇద్దరిని మైసూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ ఓ ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి సురేష్‌తో పరిచయం పెంచుకున్నారు. తమ బంగారం వేరొకరి వద్ద కుదువలో ఉందని మాయమాటలు చెప్పారు. అంతటితో ఆగకుండా డబ్బులు కావాలని కోరారు. మీరు డబ్బులిస్తే విడిపించి మీకే అమ్ముతామని సురేష్‌ను నమ్మించి రూ.1.75 లక్షలను తీసుకున్నారు. తరువాత ఇద్దరూ మొబైల్ఫోన్లను స్విచ్చాఫ్ చేయడంతో బాధితుడు సాలిగ్రామ పోలీసులకు ఫిర్యాదు చేయగా, గాలించి ఇద్దరినీ అరెస్టు చేశారు. -
మ్యాజిక్ ఇసుక : మండిస్తే.. బంగారమా?!
సాక్షి, ముంబై: నమ్మిన వాడినే నట్టేట ముంచిన వైనం ఒకటి వెలుగులోకి వచ్చింది. మ్యాజిక్ సాండ్ పేరుతో ఏకంగా బంగారు వ్యాపారికే టోకరా ఇచ్చాడో ఘరానా మోసగాడు. తాను తీసుకొచ్చిన మహిమ గల ఇసుకను మండిస్తే మేలిమి బంగారం పుట్టుకొస్తుందని వ్యాపారిని నమ్మించాడు. అలా నాలుగు కిలోల ఇసుకను విక్రయించి 50 లక్షల రూపాయలకు కుచ్చు టోపీ పెట్టాడు..ఈ విచిత్రమైన సంఘటన పుణేలో నమోదైంది. వివరాల్లో వెళితే..బంగారు ఉంగరం కొనడానికి షాపునకు వచ్చిన నిందితుడు పూణేకు ఆభరణాల వ్యాపారితో గత ఏడాది కాలంనుండి పరిచయం పెంచుకున్నాడు. అంతేకాదు, పాల ఉత్పత్తులు, బియ్యం, ఇతర వస్తువులను విక్రయిస్తూ మంచివాడిగా నటించి నమ్మకాన్ని పొందాడు. ఆ తరువాత తనప్లాన్ను అమలు చేశాడు. తన దగ్గర ఉన్న ప్రత్యేక ఇసుకను మండిస్తే.. బంగారం తయారవుతుందంటూ వ్యాపారిని బురిడీ కొట్టించాడు. స్వయంగా ఆభరణాల వ్యాపారి అయి ఉండి కూడా, అమాయకంగా అతని మాయలో పడిపోయిన వ్యాపారి ఆ మాయా ఇసుకను తీసుకొని రూ .30 లక్షల నగదు, సుమారు 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని ముట్టజెప్పాడు. ఆనక విషయం తెలిసి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. -
చీటీల పేరిట రూ.22 లక్షలకు టోకరా
శ్రీకాకుళం సిటీ : నగరంలోని ఇలిసిపురం పరాంకుశనగర్కు చెందిన ఓ మహిళ చీటీల పేరుతో రూ.22 లక్షలకు టోకరా వేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు, బాధిత మహిళలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇలిసిపురం పరాంకుశనగర్లో బోణె రాజ్యలక్ష్మి, రాజేశ్వరరావు దంపతులు చాలా కాలంగా నివసిస్తున్నారు. రాజ్యలక్ష్మి సుమారు పదేళ్ల క్రితం నుంచి చీటీలు వేస్తున్నారు. ప్రారంభంలో సక్రమంగా మొత్తాలు అందిస్తూ స్థానికంగా నమ్మకం పెంచుకుంది. ఇదే అదనుగా పెద్దపెద్ద చీటీలను వేసి లక్షలాది రూపాయలు వసూలు చేయడం ప్రారంభించింది. కొందరి నుంచి ఎక్కువ వడ్డీ ఆశ చూపి లక్షలాది రూపాయలు తీసుకుంది. కొన్నాళ్లుగా చీటీలు పాడుకున్నవారికి డబ్బు ఇవ్వకపోవడంతో ఆమెపై అందరికీ అనుమానం పెరిగింది. అదే సమయంలో దంపతులు కనిపించకుండాపోవడంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. వారు రంగంలోకి దిగి ఆ దంపతులను ఎలాగోలా స్టేషన్‌కు రప్పించారు. మంగళవారం వారిద్దరూ రెండోపట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఉన్నారన్న విషయం తెలిసిన బాధితులంతా ఒక్కసారిగా స్టేషన్‌కు చేరుకున్నారు. రాజ్యలక్ష్మిని, ఆమె భర్త రాజేశ్వరరావులను నిలదీశారు. ఈ సమయంలో బాధితులు, చీటీదారుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో 22 మంది బాధితులకు ఇవ్వాల్సిన చీటీల నగదు వివరాలను పోలీసులు లెక్కించారు. ఆ మొత్తం సుమారు రూ.22 లక్షలుగా పోలీసులు నిర్థారణకు వచ్చినట్లు తెలిసింది. బాధితులకు న్యాయం చేయాలని పోలీసులు సూచించగా ఆమె ఐదేళ్లు గడువు కావాలని కోరడంతో బాధితులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ తమకు జరిగిన మోసంపై రెడ్డి దేవితో పాటు బాధితులంతా ఫిర్యాదు చేయడంతో రెండోపట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
రూ.25లక్షలకు టోకరా వేసిన ఉద్యోగులు
సాక్షి, విజయవాడ : సిటీలో ఘరానామోసం వెలుగు చూసింది. ఇద్దరు ఉద్యోగులు తాము పనిచేసే బ్యాంకుకే టోకరా పెట్టారు. రూ.25లక్షలు స్వాహా చేశారు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు విద్యాధరరావు, నాగేశ్వర రావు ఘరానా మోసానికి పాల్పడ్డారు. అశోక్ చక్రవర్తి పేరు మీద నకిలీ పత్రాలు సృష్టించి రూ. 25లక్షలకు శఠగోపం పెట్టారు. అయితే కొంత కాలానికి తీసుకున్న రుణం కట్టాలంటూ అసలు వ్యక్తికి నోటీసులు వెళ్లాయి. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తాను ఎప్పుడు లోన్ తీసుకోలేదంటూ అశోక్ చక్రవర్తి వాపోయారు. -
ఇస్తారా.. ముంచేస్తారా?!
‘సారు నీ కాళ్లు మొక్కుతా.. పైసాపైసా పోగుచేసుకుని మీ మీద నమ్మకంతో జమచేసిన. రెండెళ్లయింది ఇస్తామని.. ఇంకా ఇస్తలేరు. చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకుంటలేరు. మా బాధను అర్థం చేసుకోండి.. మా డబ్బులు మాకు ఇయ్యుండ్రి’.. అంటూ జిల్లా కేంద్రంలోని వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో నిత్యం బాధితుల మొరలు వినిపిస్తున్నాయి. సాక్షి, కామారెడ్డి టౌన్/కామారెడ్డి: వందలాది మంది బాధితులు తాము జమ చేసుకున్న డబ్బుల కోసం కంపెనీ కార్యాలయానికి బారులు తీరుతున్నారు. ఖాతాదారులకు డబ్బులు చెల్లించాల్సిన సమయం ఏడాది దాటి నా, ఖాతాదారులు కాళ్లవేళ్లా పడినా డబ్బులు ఇవ్వడం లేరు. కంపెనీ పేరు తో మరో చోట పెట్టుబడులు పెట్టామని, డబ్బులు వచ్చాకే ఇస్తామని తేల్చి చెబుతున్నారు. దీంతో తమ డబ్బులు ఇస్తారా.. ముంచేస్తారా.. అన్న సందేహంలో ఖాతాదారులు అందోళనకు గురవుతున్నారు. బారులు తీరుతున్న బాధితులు చిట్టీల పేరుతో వందలాది మంది ఖాతాదారుల నుంచి ఐదేళ్లలో రూ.కోట్ల డబ్బులు కట్టించుకున్న వెల్ఫేర్ కంపెనీ చెల్లింపుల్లో పాల్పడుతున్న మోసాలు ఇటీవలే వెలుగులోకి వచ్చాయి. దీంతో బాధితులు తమ డబ్బుల కోసం బారు లు తీరడం పెరిగింది. సిబ్బంది మా త్రం తమ దగ్గర డబ్బులు లేవంటున్నా రు. ‘అవసరమైతే తాళం వేసి బయట పంచాయితీ పెట్టుకుందాం.. అప్పుడు మీ డబ్బులు పూర్తిగా రావు మీ ఇష్టం’.. అనే రీతిలో సమాధానాలిస్తున్నారు. మేం ఇచ్చిన్నప్పుడే తీసుకుంటేనే డబ్బులు వస్తాయి. లేకుంటే ఏం చేసుకుంటారో చేసుకోండని సమాధానం ఇస్తున్నారని ఖాతాధారులు వాపోతున్నారు. రాసిచ్చిన తేదీల్లోనే రావాలని దబాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మకం పేరిట నట్టేట ముంచుతున్నారని ఆగ్రహిస్తున్నారు. పేదలనే టార్గెట్ చేశారు కూలీలు, బీడీ కార్మికులు, చిరుద్యోగులనే కంపెనీ టార్గెట్‌గా చేసుకుంది. భారీ మొత్తంలో కమీషన్లు ఇచ్చి 50కిపైగా ఏజెంట్లను నియమించుకుంది. ఒక్కో ఏజెంట్ ద్వారా 40కి పైగానే కస్టమర్లను రాబట్టారు. మా కంపెనీలో ప్రతి నెల చొప్పున మూడేళ్లు డబ్బులు పోగుచేసి మరో రెండేళ్లు ఆగితే కస్టమర్లకు రెండింతలు ఇస్తామని ఆశ చూపించారు. ఒక్కో కస్టమర్ నుంచి నెలకు కనీసం రూ.300 నుంచి గరిష్టంగా రూ.10 వేల వరకు కట్టించుకున్నారు. ఇలా రూ.2.50 కోట్లకు పైగానే వసూలు చేసినట్లు సమాచారం. ఈ డబ్బుతో కామారెడ్డితో పాటు ఇతర ప్రాంతాల్లో వెంచర్లు, ఇతర వ్యాపా రాల్లో పెట్టుబడులు పెట్టారు. సుమారు 500 మందికిపైగా ఖాతాదారులు కంపెనీకి బాధితులుగా ఉన్నట్లు తెలిసింది. దీంట్లో ఎక్కువగా నిరుపేదలే ఉన్నారు. కంపెనీ కార్యాలయానికి బాధితులు వస్తుండడంతో వెల్ఫేర్ మోసాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయమై కామారెడ్డి బ్రాంచ్ ఏరియా మేనేజర్ లక్ష్మీనారాయణను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఇక్కడి ఇబ్బందులను, ఖాతాదారుల కష్టాలను కంపెనీ ఎండీకి తెలిపామని, పైనుంచి డబ్బులు వస్తేనే చెల్లిస్తామని, మా చేతుల్లో ఏమి లేదని సమాధానమిచ్చారు. చెప్పులరిగేలా తిరుగుతున్నా.. మా ఊరి ఏజెంట్ నమ్మించి మూడేళ్లు డబ్బులు కట్టించుకున్నాడు. ఐదేళ్ల తర్వాత ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇయ్యలే. ఆర్నెళ్లుగా చెప్పులరిగేలా తిరుగుతున్నా. కాళ్లు మొక్కుతా అన్నా కనికరిస్తలేరు. మాలాంటి పేదోళ్లను మోసం చేస్తున్నారు. మా డబ్బులు మాకు వెంటనే ఇయ్యాలే. – బాలవ్వ, రామారెడ్డి మండలం -
వెబ్ సిరీస్ సీన్లు పోర్న్ సైట్లో.. నటికి షాక్
ముంబై : అవకాశాల పేరిట యువతిని మోసం చేసి.. ఆమె నటించిన సీన్లను దుర్వినియోగం చేశాడు ఓ దర్శకుడు. అడల్ట్ చిత్రాల్లో, పోర్న్ సైట్లో వాటిని అప్ లోడ్ చేశాడు. కంగుతిన్న యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఓషివారా పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం... వెబ్ సిరీస్ పేరిట రాజన్ అగర్వాల్ అనే కాస్టింగ్ డైరెక్టర్ 2015లో ఓ ప్రకటన ఇచ్చాడు. అది చూసి లోఖంద్వాలాకు చెందిన ఓ యువతి(26) రాజన్‌ను సంప్రదించింది. మొత్తం ఐదు సీజన్లుగా తీస్తానని.. అన్నింటిలో నువ్వే హీరోయిన్వంటూ ఆమెను అతను నమ్మబలికాడు. ఒకరోజు షూటింగ్ పేరిట మధ్ ఐలాండ్‌లో ఆమెతో కొన్ని హాట్ సీన్లను చిత్రీకరించాడు. అయితే ఆ వ్యవహారం అక్కడితోనే ముగిసిపోయింది. మిగతా షూటింగ్ కోసం ఆమె ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవటంతో ఆమె ఆ విషయాన్ని తేలికగా తీసుకుంది. ఇదిలా ఉంటే గతేడాది యూట్యూబ్‌లో ఓ అడల్ట్ చిత్రాన్ని అప్ లోడ్ చేసిన సదరు దర్శకుడు ఆమె నటించిన సీన్లను అందులో కలిపేశాడు. ఇది గమనించిన ఆ యువతి స్నేహితుడొకరు విషయాన్ని ఆమె దృష్టికి తేవటంతో యువతి ఆగ్రహానికి లోనై రాజన్‌ను నిలదీసింది. కానీ, అతను స్పందించలేదు. కొన్నాళ్ల క్రితం ఓ పోర్న్ సైట్ లో కూడా అవే దృశ్యాలు దర్శనమివ్వటంతో పోలీసులకు రాజన్‌పై ఫిర్యాదు చేసింది. రాజన్‌ను అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మరో నిందితుడు ఉపేంద్ర రాయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఓషివారా పోలీసులు తెలిపారు. -
ఘరానా మోసగాడు
-
నిరుద్యోగులకు చంద్రబాబు దగా
గన్నవరం : విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి వంటి ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం యువత సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత యువజన సమాఖ్య ( ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఎన్.లెనిన్‌బాబు పిలుపునిచ్చారు. స్థానిక రాయ్‌నగర్ కళ్యాణ మండపంలో శుక్రవారం జిల్లా 17వ మహాసభ జరిగింది. తొలుత జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన ఎఐవైఎఫ్ నాయకులు, కార్యకర్తలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న లెనిన్‌బాబు మాట్లాడుతూ...యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంలో కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయని విమర్శించారు. ఎన్నికల ముందు యువతకు కోటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, విదేశాల్లో ఉన్న నల్లదానాన్ని దేశానికి తీసుకువచ్చి పేద కుటుంబాలకు పంపిణీ చేస్తామనే వాగ్ధానాలను కేంద్రం నిలబెట్టుకోలేదని ఆరోపించారు. యువతకు జాబ్ కావలంటే బాబు రావాలని హామీలు గుప్పించిన టీడీపీ ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలహామీల్లో ప్రకటించిన నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకపోవడం చంద్రబాబు దగాకోరు విధానాలకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల వేదనను గుర్తించి ఖాళీగా లక్ష నలభై వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జయప్రదం చేయండి ఈ నెల 29, 30, 31 తేదిల్లో ఏలూరులో జరిగే ఎఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎఐవైఎఫ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ ముప్పాల నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా, నగర కార్యదర్శులు అక్కినేని వనజ, దోనేపూడి శంకర్, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ఇన్ఛార్జ్ గడ్డం కోటేశ్వరరావు, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు సిహెచ్. కోటేశ్వరరావు, ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్ పాల్గొన్నారు. -
పంటలను ఎండబెడుతున్న ప్రభుత్వం
మచిలీపట్నం రైతులను నిర్వీర్యం చేసి అనంతరం భూములను గుంజుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. సాగునీరు అందకపోవటంతో బందరు మండలంలో ఎండిపోయిన వరి పొలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. తాళ్లపాలెం, జొన్నలవారిమోడి, కానూరు తదితర గ్రామాల్లో పర్యటించిన ఆయన రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీని నమ్మి ఓట్లు వేసిన ప్రజలను, రైతులను మోసం చేస్తున్నారన్నారు. మంత్రులు, ఇతర శాసనసభ్యులు ప్రజాధనంతో పర్యటనలు చేస్తున్నారని రైతులకు సకాలంలో సాగునీరు అందించే అంశంపై దృష్టిసారించటం లేదని చెప్పారు. ఆగస్టు నెల పూర్తవుతున్న దశలోనూ రామరాజుపాలెం ప్రధాన కాలువకు నీరు ఇవ్వకపోవటంతో వెదజల్లే పద్ధతి ద్వారా వరినాట్లు పూర్తిచేసిన పొలాల్లోని పైరు చనిపోయిందన్నారు. గత ఎనిమిది నెలలుగా రామరాజుపాలెం కాలువకు చుక్కనీరు విడుదల చేయకపోవటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. బందరు మండలంలోని దాదాపు 24వేల ఎకరాల్లో వరిసాగు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. 9వ నెంబరు కాలువ ద్వారా నేటికీ నీటిని విడుదల చేయలేదని, కోన గ్రామానికి కాలువ ద్వారా నీరు చేరి దాదాపు ఏడాది గడిచిందన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ఏం చేస్తున్నారు? వరిసాగుకు సకాలంలో నీరు ఇవ్వకుంటే రైతులు సాగును వదులుకుంటారని, భూమిపై మమకారాన్ని కోల్పోతారని ఈ నేపధ్యంలో ఇండస్ట్రియల్ తదితర పేర్లతో భూమిని కాజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నాని ధ్వజమెత్తారు. మంత్రి కొల్లు రవీంద్ర కాలువల వెంట నిద్రపోతానని, శివారు ప్రాంతాలకు సాగునీరు అందిస్తానని చెప్పటమే తప్ప చుక్క నీరివ్వలేదని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి పంపింగ్ చేస్తున్న నీరు ఎక్కడకు వెళుతోందో మంత్రి సమాధానం చెప్పాలన్నారు. పట్టిసీమ ద్వారా వచ్చే నీటిని గండికొట్టి కొల్లేరులోకి పంపుకున్నారని చెప్పారు. మూడు, నాలుగు రోజులు వేచి చూసి కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున రైతులతో ధర్నా చేయనున్నట్లు చెప్పారు. గొల్లుమన్న అన్నదాతలు జూన్, జూలై నెలల్లో కురిసిన వర్షాలతో ఈ ఏడాది వాతావరణం సాగుకు అనుకూలంగా ఉంటుందని వెదజల్లే పద్దతి ద్వారా 40 రోజుల క్రితం వరినాట్లు పూర్తిచేసినట్లు తాళ్లపాలెంకు చెందిన గంగిరెడ్డి తాతయ్య, జొన్నల రామారావు, పాము నాగరాజు, నాగమల్లేశ్వరరావు అనే రైతులు పేర్ని నాని దృష్టికి తీసుకువచ్చారు. ఐదుసార్లు దుక్కులు, విత్తనాల ఖర్చులు, కలుపు నివారణ తదితరాలు కలిపి ఎకరానికి రూ. 7వేలకు పైగా ఖర్చు చేశామని వివరించారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ప«థకం ద్వారా 25శాతం పంట బీమాను అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కానూరు పీఏసీఎస్ అధ్యక్షుడు శ్రీకాకుళపు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తాళ్లపాలెం సర్పంచ్ వాలిశెట్టి రవిశంకర్, పుల్లయ్య, పోతిరెడ్డిపాలెం సర్పంచ్ మేకా లవకుమార్, పోతేపల్లి ఎంపీటీసీ సభ్యుడు నాగబాబు, చిలకలపూడి పీఏసీఎస్ అధ్యక్షుడు గాజుల నాగరాజు పలువురు రైతులు పాల్గొన్నారు. -
రాసలీలల ’రక్షకభటుడు’
-
బోర్డు తిప్పేసిన NRI హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ!
-
బాబు పాదయాత్రపై తమ్ముళ్ల అనుమానాలు!
ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పాదయాత్రపై తెలుగు తమ్ముళ్లలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. వేలివెన్ను నుంచి బ్రాహ్మణగూడెం వరకు చంద్రబాబు పాదయాత్ర నిర్వస్తారని పార్టీ అధికారిక ప్రకటన వెలువరించింది. అయితే మార్గమధ్యలోనే నిడదవోలులో బాబు పాదయాత్రను ముగించారు. దీంతో 14 కిలోమీటర్లే పాదయాత్ర చేశారని కొంతమంది తెలుగుతమ్ముళ్లు వాదిస్తుంటే చంద్రబాబు మాత్రం తన 18 కిలోమీటర్ల పాదయాత్ర ముగిసిందని ప్రకటించారు. ఇందులో నిజాలేమిటో టీడీపీనే తేల్చాలి. -
పెళ్ళి ప్రకటనే పెట్టుబడిగా..!