
ముంబై : అవకాశాల పేరిట యువతిని మోసం చేసి.. ఆమె నటించిన సీన్లను దుర్వినియోగం చేశాడు ఓ దర్శకుడు. అడల్ట్ చిత్రాల్లో, పోర్న్ సైట్‌లో వాటిని అప్ లోడ్ చేశాడు. కంగుతిన్న యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఓషివారా పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం... వెబ్ సిరీస్ పేరిట రాజన్ అగర్వాల్ అనే కాస్టింగ్ డైరెక్టర్ 2015లో ఓ ప్రకటన ఇచ్చాడు. అది చూసి లోఖంద్‌వాలాకు చెందిన ఓ యువతి(26) రాజన్‌ను సంప్రదించింది. మొత్తం ఐదు సీజన్లుగా తీస్తానని.. అన్నింటిలో నువ్వే హీరోయిన్‌వంటూ ఆమెను అతను నమ్మబలికాడు. ఒకరోజు షూటింగ్ పేరిట మధ్ ఐలాండ్‌లో ఆమెతో కొన్ని హాట్ సీన్లను చిత్రీకరించాడు. అయితే ఆ వ్యవహారం అక్కడితోనే ముగిసిపోయింది.
మిగతా షూటింగ్ కోసం ఆమె ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవటంతో ఆమె ఆ విషయాన్ని తేలికగా తీసుకుంది. ఇదిలా ఉంటే గతేడాది యూట్యూబ్‌లో ఓ అడల్ట్ చిత్రాన్ని అప్ లోడ్ చేసిన సదరు దర్శకుడు ఆమె నటించిన సీన్లను అందులో కలిపేశాడు. ఇది గమనించిన ఆ యువతి స్నేహితుడొకరు విషయాన్ని ఆమె దృష్టికి తేవటంతో యువతి ఆగ్రహానికి లోనై రాజన్‌ను నిలదీసింది. కానీ, అతను స్పందించలేదు. కొన్నాళ్ల క్రితం ఓ పోర్న్ సైట్ లో కూడా అవే దృశ్యాలు దర్శనమివ్వటంతో పోలీసులకు రాజన్‌పై ఫిర్యాదు చేసింది. రాజన్‌ను అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మరో నిందితుడు ఉపేంద్ర రాయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఓషివారా పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment