
బాబు పాదయాత్రపై తమ్ముళ్ల అనుమానాలు!
ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పాదయాత్రపై తెలుగు తమ్ముళ్లలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. వేలివెన్ను నుంచి బ్రాహ్మణగూడెం వరకు చంద్రబాబు పాదయాత్ర నిర్వస్తారని పార్టీ అధికారిక ప్రకటన వెలువరించింది. అయితే మార్గమధ్యలోనే నిడదవోలులో బాబు పాదయాత్రను ముగించారు. దీంతో 14 కిలోమీటర్లే పాదయాత్ర చేశారని కొంతమంది తెలుగుతమ్ముళ్లు వాదిస్తుంటే చంద్రబాబు మాత్రం తన 18 కిలోమీటర్ల పాదయాత్ర ముగిసిందని ప్రకటించారు. ఇందులో నిజాలేమిటో టీడీపీనే తేల్చాలి.