మరుగుతున్న నూనెలో తల ముంచి కిరాతకం.. | Atrocity on women at Paderu | Sakshi
Sakshi News home page

మరుగుతున్న నూనెలో తల ముంచి కిరాతకం..

Published Sun, Feb 17 2019 5:19 AM | Last Updated on Sun, Feb 17 2019 10:24 AM

Atrocity on women at Paderu - Sakshi

కాలిన గాయాలతో ఆస్పత్రిలో మహిళ

పాడేరు రూరల్‌: తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదన్న కారణంగా ఓ మహిళపై దారుణమైన రీతిలో వ్యవహరించాడో రాక్షసుడు. సలసల కాగుతున్న నూనెలో ఆమె తలను ముంచి కిరాతకంగా వ్యవహరించాడు. ఈ సంఘటన శనివారం రాత్రి పాడేరులో జరిగింది. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని పాత బస్టాండ్‌ వీధిలో నివాసం ఉంటున్న రత్నం (45) అనే మహిళ భర్త ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో కుటుంబ పోషణ భారం ఆమెపై పడింది. ఇద్దరు పిల్లలను పెంచేందుకు పాత బస్టాండ్‌ వద్ద పకోడి, బజ్జీల దుకాణం నిర్వహిస్తోంది. పెట్టుబడి కోసం పది నెలల క్రితం అమె పాడేరుకు చెందిన పెంటారావు అనే వ్యక్తి వద్ద డైలీ ఫైనాన్స్‌ కింద రూ.20వేలు అప్పు తీసుకుంది.

అందులో ఇప్పటి వరకు రూ.10,600 చెల్లించింది. ఆమె అనారోగ్యం కారణంగా ఇటీవల షాపు తెరవలేదు. అప్పు ఇచ్చిన వ్యక్తి వచ్చి డబ్బు చెల్లించామని ఒత్తిడి తెచ్చాడు. ఈ నెల 15న పెంటారావు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆ నేపథ్యంలోనే శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో మళ్లీ వచ్చిన పెంటారావు బజ్జీలు, పకోడీలు వేసే సలసల మరుగుతున్న నూనెలో ఆమె తల, ముఖం భాగాలను ముంచేశాడు. ఆమె తెరుకునే లోపలే   అక్కడ నుంచి వెళ్లిపోయాడు. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా 50 శాతం చర్మం కాలిపోయిందని వైద్యులు చెప్పారు. ఈ సంఘటపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement