స్వరా ఫైనాన్స్‌ కస్టమర్లకు నివాబూపా కవరేజీ | Swara Fincare Customer Gets Niva Bupa Emi Protection Plan | Sakshi
Sakshi News home page

స్వరా ఫైనాన్స్‌ కస్టమర్లకు నివాబూపా కవరేజీ

Published Thu, Dec 29 2022 10:36 AM | Last Updated on Thu, Dec 29 2022 10:36 AM

Swara Fincare Customer Gets Niva Bupa Emi Protection Plan - Sakshi

న్యూఢిల్లీ: స్వరా ఫైనాన్స్‌తో నివా బూపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఒక ఒప్పందం చేసుకుంది. దీనికింద స్వరా ఫైనాన్స్‌ నుంచి రుణాలు తీసుకునే వారికి ‘ఎక్స్‌ప్రెస్‌ హెల్త్‌ – సీరియస్‌ ఇల్‌నెస్‌ ప్లాన్‌ బెనిఫిట్‌’ను ఆఫర్‌ చేయనుంది. ఈ ప్లాన్‌ ఏడాది, రెండేళ్ల కాలానికి లభిస్తుంది. స్వర ఫైనాన్స్‌ రుణ గ్రహీతలు ఈ ప్లాన్‌ తీసుకుని, ఏదైనా అనారోగ్యంతో ఐదు రోజులు, అంతకుమించి ఎక్కువ కాలానికి హాస్పిటల్‌లో చేరినప్పుడు.. మూడు ఈఎంఐలను నివా బూపా చెల్లిస్తుంది.

నేడు గ్రామీణ ప్రాంతాల్లో 20 శాతం మందికి ఎలాంటి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ లేదని.. ఈ అంతరం పూడ్చేందుకు స్వరా ఫైనాన్స్‌తో కలసి ఈ పాŠల్‌న్‌తో ముందుకు వచ్చామని నివాబూపా తెలిపింది. బ్యాంకుల పరిధిలో లేని కస్టమర్లకు స్వరా ఫైనాన్స్‌ రూ.50వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు ఇస్తుంటుంది.

చదవండి: ముకేశ్‌ అంబానీ రిలయన్స్‌ పగ్గాలు చేపట్టి 20 ఏళ్లు.. ఆదాయం, లాభాలు ఎన్ని రెట్లు పెరిగాయో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement