
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక విధానాల విషయంలో అధ్యక్షుడికి సలహాలు ఇచ్చే ఆర్థిక బృందంలో భారతీయ మూలాలున్న అమెరికన్ భరత్ రామమూర్తి కీలక స్థానంలో నియ మితులయ్యారు. భరత్‌ను నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్(ఎన్‌ఈసీ) డెప్యూటీ డైరెక్టర్‌గా మళ్లీ నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ బుధవారం ప్రకటించింది.
వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలకు సంబంధించి భరత్ బైడెన్‌కు సలహాదారుగానూ వ్యవహరిస్తారు. 2020 డిసెంబర్‌లో భరత్ ఎన్‌ఈసీలో ఆర్థిక సంస్కరణలు, వినియోగదారుల రక్షణ విభాగానికి డెప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు.
చదవండి: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. మరోసారి క్షిపణుల వర్షం..